సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చినప్పటి నుంచీ పెద్ద ఎత్తున నగదు, బంగారం, మద్యం, మత్తు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొత్తంగా 1,196 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. తనిఖీల కోసం 89 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 169 ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వివరించింది. ఇప్పటివరకు కమిషన్ నేతృత్వంలో సాగిన నిఘా, స్వాదీనాలు, కేసుల వివరాలను వెల్లడించింది.
ఆ వివరాల మేరకు.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.20,43,38,375 నగదును, రూ.14,65,50,852 విలువైన బంగారం, వెండి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.86,92,533 విలువైన 31,730 లీటర్ల మద్యం, వెయ్యి కిలోల నల్లబెల్లం, 501 కిలోల అల్లం స్వాధీనం చేసుకున్నారు. రూ.89,02,825 విలువైన 310 కిలోల గంజాయిని తనిఖీల్లో పట్టుకున్నారు.
ప్రలోభాలకు గురి చేసేందుకు తరలిస్తున్నారనే అనుమానంతో 7,040 కిలోల బియ్యం, 440 చీరలు, 80 కుట్టు మెషీన్లు, 87 కుక్కర్లు, ఒక కారును స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.22,51,963. మొత్తంగా నగదు, వస్తువులన్నీ కలిపి విలువ రూ.37,07,36,548 అని కమిషన్ గుర్తించింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనపై 34,388 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది.
♦ గురువారం హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.33.55 లక్షలను, జూబ్లీహిల్స్‌లో మణిపూర్‌కు చెందిన మహిళ నుంచి రూ. 5.50 లక్షలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అబిడ్స్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి రూ. 5 లక్షల నగదు, అమీర్‌పేటలో మరొకరి నుంచి రూ. 9.9 లక్షలను, మియాపూర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి 448.96 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.
♦ నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురంలో చేపట్టిన వాహన తనిఖీల సందర్భంగా ఎలాంటి పత్రాలు చూపకుండా తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును సీజ్ చేశారు.
♦ మేడిపల్లి పోలీసులు నారపల్లి వెంకటాద్రి టౌన్‌షిప్ వద్ద వాహన తనిఖీల్లో రూ.13.50 లక్షలు, హబీబ్‌నగర్ పోలీసులు సీతారామ్‌భాగ్ ఎక్స్ రోడ్డులో ఓ వ్యక్తి నుండి రూ.6.95 లక్షలు నగదును స్వా«దీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment