సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ.కోట్ల విలువైన నగదు, మద్యం, వెండి, బంగారం పట్టుబడుతు న్నాయి. ఈ నెల 9న రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటినుంచి మంగâý వారం ఉదయం వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం రూ.130 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ని కల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడి ంచారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియో జకవ ర్గాల పరిధిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేర కు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీ సులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 373 ఫ్లయింగ్ స్క్వా డ్‌లు, 374 స్టాటిక్ సర్వైవలెన్స్ టీమ్‌లు, 95 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
డబ్బే డబ్బు!
ఎలాంటి అధికారిక గుర్తింపు పత్రాలు లేకుండా తర లిస్తున్న రూ.71.55 కోట్ల స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వికాస్‌రాజ్ వివరించారు. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం మొత్తం విలువ రూ.7.75 కోట్లు ఉంటుందన్నారు.
1694 కిలోల గంజాయి విలువ రూ.4.58 కోట్లు, పట్టుబడిన బంగారు, వెండి మొత్త విలువ రూ. 40.08 కోట్లు ఉంటుందని వివరించారు. ఇందులో మొత్తం 72.267 కిలోల బంగారం, 429.107 కిలోల వెండి, 42.03 క్యారట్ల వజ్రాలు న్నాయని స్పష్టం చేశారు. ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి విలువ మొత్తం రూ.6.29 కోట్లు అని వికాస్‌రాజ్ తెలిపారు.
ఈనెల 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ ఉదయం 9 గంటల వరకు మొత్తం రూ.21.84 కోట్ల విలువైన వస్తువులు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పా రు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియమా వళి అమల్లో ఉన్న రోజుల్లో రూ.103 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర వస్తు వులు స్వాధీనం చేసుకోగా.. ఈసారి ఇప్పటికే ఆ మొత్తం విలువ రూ.130 కోట్లు దాటడం విశేషం.
5,529 ఆయుధాలు స్వాధీనం: డీజీపీ కార్యాలయం
రాష్ట్రవ్యాప్తంగా 5,529 లైసెన్స్‌డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ కార్యాలయం తెలి పింది. వీటితోపాటు మరో మూడు అక్రమ ఆయు ధాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. 5,252 బైండోవర్ కేసులలో మొత్తం 17,128 మందిని బైండోవర్ చేసినట్టు వెల్లడించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన 184 మందిపై 56 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment