శ్రీనగర్//జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి బుధవారం తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 61 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఆరి్టకల్ 370 రద్దు చేసి, రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాక.. తొలిసారిగా కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో గత ఏడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి.కె.పోల్ వెల్లడించారు. మారుమూల ప్రాంతాల నుంచి నివేదికలు అందాక, పోస్టల్ బ్యాలెట్‌లను కూడా కలుపుకొంటే పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని తెలిపారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలుండగా.. బుధవారం తొలి విడతలో 24 సీట్లలో పోలింగ్ జరిగింది. 23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కశ్మీర్ లోయలో 16 సీట్లకు, జమ్మూలో 8 సీట్లకు బుధవారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్‌ల బయట ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. 61 శాతం పోలింగ్ నమోదైందని పి.కె.పోల్ ప్రకటించారు. సెపె్టంబరు 25న రెండో దశ, అక్టోబరు 1న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. హరియాణాతో కలిసి అక్టోబరు ఎనిమిదో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment