మేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్‌ | PNGRB Green Signal For Megha Gas To MCGDPL | Sakshi
Sakshi News home page

మేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్‌

Published Mon, Sep 26 2022 6:32 PM | Last Updated on Mon, Sep 26 2022 7:01 PM

PNGRB Green Signal For Megha Gas To MCGDPL - Sakshi

హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ పేరు  మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (MCGDPL)గా మారింది. దేశంలో వివిధ నగరాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD)ని  మేఘా గ్యాస్ ఇప్పటివరకు నిర్వహిస్తోంది. ఇక నుంచి    మేఘా గ్యాస్ బదులు ఎంసీజీడీపిఎల్‌ కంపెనీ ఇక నుంచి అన్ని రకాల అనుమతులున్న అధీకృత సంస్థగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ను చేపడుతుంది. 

ఇప్పటి వరకు  మేఘా గ్రూప్  లో ఒక విభాగంగా ఉన్న మేఘా గ్యాస్‌కున్న అనుమతులన్నింటినీ ఎంసీజీడీపిఎల్‌ కి బదిలీ చేయాలంటూ ఎంఈఐఎల్ చేసిన అభ్యర్థనను పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ఆమోదించింది. ఇక నుంచి  మేఘా గ్యాస్ కు ఉన్న అన్ని కార్యకలాపాలు, పరిపాలనా విధులతో సహా అన్ని వ్యవహారాలు ఎంసీజీడీపిఎల్‌ కిందకు వస్తాయి.

దేశంలోని 10 రాష్ట్రాలు,  62 జిల్లాల్లోని 22 భౌగోళిక ప్రాంతాలలో కంపెనీ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ను ఎంసీజీడీపిఎల్‌ ఇక నుంచి   అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్యకలాపాలను మేఘా గ్యాస్ ఇప్పటికే  చేపట్టింది. ఇక నుంచి ఎంసీజీడీపిఎల్‌ వీటిని చేపడుతుంది.  ఇప్పటికే 2000 కి.మీ మేర MDPE లైన్ మరియు 500 కి.మీ పైగా స్టీల్ పైప్‌లైన్‌లను వివిధ ప్రాంతాలలో మేఘా గ్యాస్  ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 60కి పైగా సీఎన్‌జీ  స్టేషన్లను  దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీ నిర్వహిస్తోంది. 80 వేలకు పైగా గృహాలకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్‌ను అందిస్తున్నది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం కంపెనీ ఇప్పటికే రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. మరో రూ.10,000 కోట్లను వచ్చే ఐదేండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement