Pngrb
-
హైదరాబాద్: మేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్
-
మేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్
హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ పేరు మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (MCGDPL)గా మారింది. దేశంలో వివిధ నగరాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD)ని మేఘా గ్యాస్ ఇప్పటివరకు నిర్వహిస్తోంది. ఇక నుంచి మేఘా గ్యాస్ బదులు ఎంసీజీడీపిఎల్ కంపెనీ ఇక నుంచి అన్ని రకాల అనుమతులున్న అధీకృత సంస్థగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ను చేపడుతుంది. ఇప్పటి వరకు మేఘా గ్రూప్ లో ఒక విభాగంగా ఉన్న మేఘా గ్యాస్‌కున్న అనుమతులన్నింటినీ ఎంసీజీడీపిఎల్ కి బదిలీ చేయాలంటూ ఎంఈఐఎల్ చేసిన అభ్యర్థనను పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ఆమోదించింది. ఇక నుంచి మేఘా గ్యాస్ కు ఉన్న అన్ని కార్యకలాపాలు, పరిపాలనా విధులతో సహా అన్ని వ్యవహారాలు ఎంసీజీడీపిఎల్ కిందకు వస్తాయి. దేశంలోని 10 రాష్ట్రాలు, 62 జిల్లాల్లోని 22 భౌగోళిక ప్రాంతాలలో కంపెనీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను ఎంసీజీడీపిఎల్ ఇక నుంచి అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్యకలాపాలను మేఘా గ్యాస్ ఇప్పటికే చేపట్టింది. ఇక నుంచి ఎంసీజీడీపిఎల్ వీటిని చేపడుతుంది. ఇప్పటికే 2000 కి.మీ మేర MDPE లైన్ మరియు 500 కి.మీ పైగా స్టీల్ పైప్లైన్లను వివిధ ప్రాంతాలలో మేఘా గ్యాస్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 60కి పైగా సీఎన్జీ స్టేషన్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీ నిర్వహిస్తోంది. 80 వేలకు పైగా గృహాలకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్‌ను అందిస్తున్నది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం కంపెనీ ఇప్పటికే రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. మరో రూ.10,000 కోట్లను వచ్చే ఐదేండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. -
మేఘాకు 12 ‘సిటీ గ్యాస్’ ఏరియాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టు 11వ రౌండు బిడ్డింగ్‌లో ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) 12 జాగ్రఫికల్ ఏరియాలను (జీఏ)దక్కించుకుంది. వీటిలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని ఏరియాలు ఉన్నాయి. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నియంత్రణ బోర్డు (పీఎన్జీఆర్బీ) శుక్రవారం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 65 జీఏలకు బిడ్స్ ఆహ్వానించగా 61 ఏరియాలకు బిడ్స్ వచ్చాయి. వీటిలో 52 ఏరియాల ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల కారణంగా 9 ప్రాంతాల ఫలితాలను ప్రకటించలేదు. వీటిల్లోనూ మరికొన్నింటిని ఎంఈఐఎల్ దక్కించుకునే అవకాశం ఉంది. తెలంగాణా విషయానికొస్తే జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తిలో సీజీడీ ప్రాజెక్టులో భాగంగా సిటీ గేట్ స్టేషన్, గ్యాస్ సప్లై పైప్లైన్లు.. సిఎన్జీ స్టేషన్లను నిర్మించి, ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పైప్‌లైన్ నిర్మించడంతో పాటు 32 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈఐఎల్ పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాతో పాటు కర్ణాటకలో తుముకూరు, బెల్గావి జిల్లాల్లో మేఘా గ్యాస్ పేరిట గృహ, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన గ్యాస్‌తో పాటు వాహనాలకు సీఎన్జీని కూడా అందిస్తున్నట్లు వివరించింది. -
ఆయిల్–గ్యాస్ రెగ్యులేటర్ చీఫ్‌గా దినేశ్ కె సరాఫ్
న్యూఢిల్లీ: పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటర్ బోర్డు (పీఎన్జీఆర్బీ) కొత్త చైర్మన్‌గా దినేశ్ కె సరాఫ్ నియమితులయ్యారు. ఈయన ఓఎన్జీసీ మాజీ సీఎండీ. 2015 ఆగస్ట్‌లో ఎస్.కృష్ణన్ పదవీ విరమణతో పీఎన్జీఆర్బీ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు దినేశ్ సరాఫ్‌ను కొత్త చీఫ్‌గా నియమించింది. సైకిల్ షేరింగ్ సర్వీసులొస్తున్నాయ్! న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ ‘మొబిక్విక్’ మాజీ మార్కెటింగ్ హెడ్ ఆకాశ్ గుప్తా... దేశంలో బైసైకిల్ షేరింగ్ సర్వీస్‌లను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక వారంలోగా ‘మాబ్సీ’ యాప్‌ను ఆవిష్కరించనున్నారు. ‘మెట్రో, బస్సు దిగిన తర్వాత డ్రాప్ పాయింట్ల వద్ద పార్క్ చేసిన బైసైకిల్స్ ఉంటాయి. దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను యాప్ సాయంతో స్కాన్ చేస్తే అది అన్‌లాక్ అవుతుంది. తీసుకొని గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. తర్వాత పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాల్లో పార్క్ చేసి లాక్ చేయాలి. అప్పుడు రైడ్ పూర్తవుతుంది’ అని గుప్తా వివరించారు. ‘సబ్స్క్రిప్షన్ పద్ధతిలో సేవలు అందుబాటులో ఉంటాయి. నెలకు రూ.99లతో 60 రైడ్లు పొందొచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ రూ.999. ఇది సాధారణ ప్రజలకు. ఇక విద్యార్ధుల విషయానికి వస్తే రోజుకు 4 రైడ్లు ఉంటాయి. నెల ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ మామూలే. అదే రైడ్ టైమ్ గంట దాటితే అదనపు చార్జీలుంటాయి’ అని వివరించారు. -
కేజీ గ్యాస్‌కు అధిక ధర వసూలు
న్యూఢిల్లీ: కేజీ-డీ6గ్యాస్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రభుత్వ ఆమోదిత ధర కంటే అధికంగా వసూలు చేసిందని, అంతేకాకుండా.. అదనంగా వసూలు చేసిన మార్కెటింగ్ మార్జిన్‌ను ప్రభుత్వంతో ఆదాయ పంపకం, రాయల్టీల లెక్కింపులో చూపలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) పేర్కొంది. కాగ్ చెప్పింది ఇదీ... కేజీ-డీ6లో వెలికితీసిన గ్యాస్‌ను రిలయన్స్ తమ కస్టమర్లకు విక్రయించే ధరను ప్రభుత్వం 2007 అక్టోబర్‌లో ఒకో మిలియన్ బ్రిటిష్ యూనిట్(ఎంబీటీయూ)కు 4.2 డాలర్లుగా నిర్ణయించింది. అయితే, రిలయన్స్ మాత్రం ఒక్కో యూనిట్‌కు 4.205 డాలర్ల చొప్పున వసూలు చేసిందని, దీనివల్ల అదనంగా 2009-10 నుంచి తొలి నాలుగేళ్లలో 9.68 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వసూలు చేసినట్లు పేర్కొంది. ఈ ధరపైన ఆర్ఐఎల్ తమ మార్కెటింగ్ రిస్క్‌ల కోసమంటూ ఒక్కో ఎంబీటీయూకి 0.135 డాలర్లను అదనంగా రాబట్టిందని కాగ్ తెలిపింది. అయితే, ప్రభుత్వంతో లాభాల పంపకం, రాయల్టీ లెక్కింపు విషయంలో మాత్రం 4.34 డాలర్లకు బదులు కేవలం 4.205 డాలర్ల ధరనే పరిగణనలోకి తీసుకున్నట్లు తమ ఆడిటింగ్‌లో గుర్తించినట్లు పేర్కొంది. అంటే మార్కెటింగ్ మార్జిన్‌గా వసూలు చేసిన 261.33 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఖాతా పుస్తకాల్లో చూపలేదనేది కాగ్ నివేదిక సారాంశం.