హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అవసరమైన భారీ విద్యుత్ సరఫరా వ్యవస్థలో అత్యధిక భాగాన్ని ఎంఈఐఎల్ ఏర్పాటు చేసి తన చరిత్రను తానే తిరగరాసింది. ఇంతవరకు నీటిపారుదల రంగానికి ఎక్కడా ఏర్పాటు కానటువంటి అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థ రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎంత పెద్దదంటే దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా అయ్యే విద్యుత్‌తో సమానమైనది.
ఈశాన్య రాష్ట్రాల విద్యుత్‌సరఫరా మొత్తం 3916 మెగావాట్లు కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుకోసం ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థ సామర్ధ్యం 3057 మెగావాట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి వినియోగించే విద్యుత్ 4627 మెగావాట్లు. అంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి వినియోగించే విద్యుత్‌లో 66 శాతం విద్యుత్‌వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిందే. రైతాంగానికి అవసరమయ్యే విధంగా భారీ ఎత్తిపోతల పథకాన్ని, అందుకు అవసరమయ్యే విద్యుత్‌వ్యవస్థను ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం ప్రపంచంలోనే తొలిసారి అని నిపుణుల అభిప్రాయం.
రెండేళ్లలో కాళేశ్వరానికి అవసరమైన విద్యుత్ సరఫరాకు 260 కిలోమీటర్ల మేర విద్యుత్‌సరఫరా లైన్లను ఎంఈఐఎల్‌నిర్మించింది. 400 కేవీ, 220 కేవీ సామర్ధ్యం కలిగిన ఆరు సబ్‌స్టేషన్లను అతితక్కువ సమయంలో ఎంఈఐఎల్‌నిర్మించింది. ఈ సబ్‌స్టేషన్ల ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ 8, 10, 11 పంపుహౌజ్‌లలో ఏర్పాటు చేసిన 43 మోటార్లకు విద్యుత్‌సరఫరా చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6,12,14 ప్యాకేజీల్లోని సబ్‌స్టేషన్లు మినహా మిగిలిన అన్ని సబ్‌స్టేషన్లతో పాటు విద్యుత్ పంపిణీ లైన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది.
ప్యాకేజ్8 పంపుహౌజ్‌లో ఏడు భారీ పంపు మోటార్లకు (ఒక్కో పంపు మోటార్‌సామర్ధ్యం 139 మెగావాట్లు) అవసరమయ్యే విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ రామడుగు దగ్గర ఏర్పాటు చేసింది. ఈ విద్యుత్‌సబ్‌స్టేషన్‌ను కరీంనగర్‌జిల్లా రామడుగు వద్ద 16 నెలల్లో నే ఎంఈఐఎల్ ఛార్జ్‌చేసింది. సుందిళ్ల పంపుహౌజ్‌కు విద్యుత్‌ను అందించే 400/220/11 కేవీ సబ్‌స్టేషన్‌నిర్మాణం 2017 జూలై 30న గత ఏడాది జూలై 18 నాటికి ఎంఈఐఎల్‌పూర్తి చేసింది. ఈ విద్యుత్ ఉప కేంద్రం సుందిళ్ల పంపుహౌజ్‌లోని 360 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన తొమ్మిది యూనిట్లకు (పంపు, మోటారు) విద్యుత్‌ను సరఫరా చేయనుంది.
220 కేవీ సామర్ధ్యం గల అన్నారం విద్యుత్ సబ్‌స్టేషన్‌తో పాటు, సుందిళ్ల నుంచి 28 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్‌మిషన్‌లైన్‌పనులను 2017 ఏప్రిల్‌లో ప్రారంభించి, 17 నెలల్లో పూర్తి చేయడంతో పాటు ఛార్జింగ్ చేసింది ఎంఈఐఎల్. ఇది అన్నారంలోని 320 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పంపుహౌజ్‌లోని ఎనిమిది యూనిట్లకు విద్యుత్‌సరఫరా చేస్తుంది. మేడిగడ్డ పంపుహౌజ్‌లో 11 యూనిట్లు ఉండగా, వాటికి 440 మెగావాట్ల విద్యుత్‌అవసరం అవుతుంది. ఈ విద్యుత్‌ను అందించేందుకు మేడిగడ్డలో 220 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు సుందిళ్ల నుంచి 80 కిమీ టీఎండీసీ విద్యుత్‌పంపిణీ లైన్‌ను ఏప్రిల్2017లో ప్రారంభించి 2018 సెప్టెంబర్9న విజయవంతంగా ఎంఈఐఎల్‌ఛార్జింగ్‌చేసింది.
ప్యాకేజీ 10లోని నాలుగు యూనిట్ల పంపుహౌజ్‌కు అవసరమైన 424 మెగావాట్ల విద్యుత్‌సరఫరాకు అవసరమైన విద్యుత్‌కు 420/11 కేవీ ఉపకేంద్రాన్ని తిప్పాపూర్ వద్ద ఎంఈఐఎల్ నిర్మించింది. 8 నవంబర్2017లో ప్రారంభమైన ఈ పనులు 29 ఏప్రిల్2019లో పూర్తి చేసింది. కాళేశ్వరం 11వ ప్యాకేజీ లోని రంగనాయక సాగర్ పంపుహౌజ్‌లోని 541 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్‌ను అందించేందుకు చందులాపూర్ దగ్గర 400/13.8/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఎంఈఐఎల్ నిర్మించింది. రెండేళ్లలో ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment