ఎన్నారై సిబ్బందికి అంబులెన్స్‌ల తాళాలను అందజేస్తున్న ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ పి.సుధారెడ్డి
మంగళగిరి: గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ రెండు అంబులెన్స్‌లను వితరణగా అందజేసింది. ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ పి.సుధారెడ్డి బుధవారం అంబులెన్స్‌ల తాళాలను ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.నరసరాజు, ప్రిన్సిపల్ లక్ష్మిలకు అందజేశారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ.. మేఘా సంస్థ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు నిర్మించామని, పలు ఆసుపత్రులకు అవసరమైన అంబులెన్సులను అందించటంతో పాటు గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎంఈఐఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై ఆసుపత్రికి తమ సంస్థ అందజేసిన అంబులెన్స్‌లలో ఐసీయూకు అవసరమైన సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎన్నారై ఆస్పత్రి సీఈవో వెంకట ఫణిదర్, ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ కోశాధికారి టీసీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment