పర్యావరణం కలుషితం కాకుండా... | Megha Gas:Eco-friendly Green Fuel for Household and Commercial in AP, Telangana | Sakshi
Sakshi News home page

గ్యాస్ పంపిణీలో మేఘా ప్రస్థానం

Published Wed, Nov 13 2019 2:34 PM | Last Updated on Wed, Nov 13 2019 3:48 PM

Megha Gas:Eco-friendly Green Fuel for Household and Commercial in AP, Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచంలోని తనదైన ముద్రవేసుకున్న మేఘా ఇంజనీరింగ్ ఇప్పుడు తాజాగా గ్యాస్ సరఫరా, పంపిణీకి విస్తృతం చేయనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మూడు జిల్లాలో ఆటోమొబైల్ గ్యాస్ సరఫరా చేస్తున్న మేఘా తాజాగా మరో శకాన్ని ప్రారంభించబోతోంది.  మేఘా గ్యాస్ బ్రాండ్ పేరుతో  గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్‌ను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది.  ఇందుకోసం పర్యావరణం కలుషితం కాకుండా... కేంద్రం కలను సాకారం చేసేలా  మేఘా హైడ్రోకార్బన్స్ డివిజన్ సమగ్ర ప్రణాళికను రూపొందించింది.  

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం  16 జిల్లాల్లో గ్యాస్ పంపిణీ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతులను పొందింది. అలాగే ఆటోమోబైల్ రంగానికి గ్యాస్ సరఫరా కోసం ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ మరో అయిదు స్టేషన్లను వచ్చే మూడు నెలల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని తూంకూరు, బెల్గాం జిల్లాల్లో గ్యాస్ పంపిణీని  ప్రారంభించగా.. త్వరలో తెలంగాణ లో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.    

నాగాయలంక, వెస్ట్ పెనుగొండ క్షేత్రాలు కీలకం
కృష్ణా జిల్లా నాగాయలంక, వెస్ట్ పెనుగొండ ఆన్షోర్ గ్యాస్ క్షేత్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్యాస్ గ్రిడ్‌ను అభివృద్ధి పరిచేందుకు ఓఎన్జీసీ నుంచి వ్యూహాత్మకంగా పొందింది.  ఈ గ్యాస్ క్షేత్రాల నుంచి రోజుకి లక్షా 30 వేల ఎస్సీఎం గ్యాస్‌ను తరలించనుంది. ఇందుకోసం అమెరికా నుంచి రప్పించిన మెకానికల్ రిఫ్రిజేషన్ యూనిట్లు, కంప్రెసర్లు వంటి అత్యధునిక యంత్రాలను ఉపయోగిస్తోంది. నాగాయలంక క్రేత్రం నుంచి నేచురల్ గ్యాస్ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కృష్టాజిల్లాలోని వినియోగదారులకు పంపిణీ చేస్తున్నది. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలో ఇప్పటికే 1200 కిలోమీటర్ల పైప్లైన్ వేసింది. భవిష్యత్తు అవసరాల కోసం మరో 5000 కిలోమీటర్ల పైప్‌లైన్ వేయనుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ను, ఆటో మోబైల్ రంగానికి  కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)ని సరఫరా చేయనుంది. 


తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి త్వరలో గ్యాస్ పంపిణీకి సన్నహాలను చేస్తున్నది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో 12 కిలోమీటర్ల మేర పైపులైను వేయగా వచ్చే మూడు నెలల్లో మిగతా జిల్లాల్లో పైప్లైను పనులను విస్తరించి సేవలను ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నది.

మేఘా సీఎన్జీ స్టేషన్లు...
కృష్ణా జిల్లాలో ఆటోమోబైల్ రంగానికి ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా గ్యాస్ మూడు నెలల్లో మరో ఐదు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది.  ప్రస్తుతం ఉన్న 9 సీఎన్జీ స్టేషన్ల ద్వారా ప్రతి నెలా నాలుగున్నర లక్షల ఎస్సీఎం గ్యాస్‌ను విక్రయిస్తున్నది.  కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఐదు సీఎన్జీ స్టేషన్ల ద్వారా మరో మూడు లక్షల ఎస్సీఎం గ్యాస్ ను సరఫరా చేసే అవకాశం వుంది.  

అంచనాలకు మించి
కర్ణాటకలోని బెల్గాం, తూంకూరు జిల్లా గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తూంకూరు జిల్లాలోనే మొత్తం 12,500 మంది వినియోగదారులకు ప్రస్తుతం పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తుండగా, ఈ నెలాఖారుకు మరో నాలుగు వేల గ్యాస్ కనెక్షన్లను ఇవ్వనుంది. వాణిజ్య వినియోగదారుల నుంచి ప్రతి నెలా లక్షా 40 వేల ఎస్సీఎం గ్యాస్‌ పంపిణీ చేస్తుండగా, త్వరలోనే ఈ డిమాండ్ రెట్టంపు కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement