సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్తో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా అద్బుతం చేసింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్చ్ లిమిటెడ్(ఎంఈఐఎల్). ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పధకంలో తమ ఇంజనీరింగ్ మేధస్సుతో అద్భుతాలు చేసింది. అనతికాలంలోనే అత్యధిక సామర్ధ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణా ప్రజల గొంతుకను తడపడమే కాదు బీడుపడిన పంటపొలాలను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం. మూడేళ్ళలోనే 11పంపింగ్ కేంద్రాలలొ 3436 మెగావాట్ల సామర్ద్యం గల మిషన్ల ఏర్పాటుతో మొదటి దశ పనులు పూర్తిచేసి కాళేశ్వరంలోని లింక్ -1,2 లను పూర్తిచేసి రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోసి చరిత్ర తిరగరాసింది.
మేఘా పంపులతో గోదావరి పరవళ్లు
రెండేళ్ళలో 11పంపింగ్ కేంద్రాలు పూర్తి చేయడంతో పాటు లింక్-1 పూర్తితో 120 కిమీ ఎగువకు గోదావరి నీరు రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళించడమే కాకుండా లక్ష్మీ పంప్ హౌస్ తో దిగువన ప్రాణహిత నీరు ఎగువ గోదావరిలోకి మళ్ళింపు చేయడం మరో రికార్డ్. గోదారి పరవళ్ళకు కొత్తనడకలు నేర్పుతూ రైతుల ఆశలకు జీవంపోస్తూ తెలంగాణా ప్రభుత్వ చిత్తశుద్దిని, పట్టుదలను, ఆచరణలో కాళేశ్వరాన్ని శరవేగంగా పూర్తి చేసి నిరూపించింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్స్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్).
ఇప్పుడు లక్ష్మీ(మేడిగడ్డ)పంపింగ్ కేంద్రం నుండి 11 మిషన్లతో ఒకేసారి నీటిని ఎత్తిపోయడం ద్వారా మొదటి దశ పనులు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. తాజాగా లక్ష్మీ కేంద్రం ఫిబ్రవరి 15వ తేదీ అర్దరాత్రి నుండి ఇప్పటివరకు నాలుగు టిఎంసిల నీటిని ఎత్తిపోసింది. 11 మిషన్లు పనిచేయడం ద్వారా 22 డెలివరీ పైపుల ద్వారా విడుదలైన ఆ గోదావరి పరవళ్ళు కనులవిందుగా ఉంది. పంపింగ్ కేంద్రం నుండి జాలువారిన గోదారి జలాలు వాడిన రైతన్నల ఆశలను మళ్ళీ చిగురింపచేశాయి. లక్ష్మీ నుండి డిసి ద్వారా విడుదలైన నీరు 13 కిలోమీటర్ల మేర కాలువలో హోయలొలుకుతూ సరస్వతి జలాశయానికి చేరిన గోదారి సముద్రాన్ని తలపిసూ జనాలను మైమరిపిస్తోంది.
హంద్రీ - నీవాను మించి...
ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పధకం అయిన హంద్రీనీవాతో ఔరా అనిపించుకున్న మేఘా ఇప్పుడు తాజాగా కాళేశ్వరంలో 3436 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మిషన్లను 11పంపింగ్ కేంద్రాలలో ఏర్పాటుచేసి తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగరాసింది. కాళేశ్వరంతో మరెవరికీ సాధ్యంకాని రికార్డు తన సొంతం చేసుకుంది మేఘా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం 22 పంపింగ్ స్టేషన్లు ఉండగా ఎంఈఐఎల్ మాత్రమే 17 పంప్ హౌస్లను నిర్మిస్తోంది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పధకాలకు ఇంత పెద్దస్థాయిలో విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా ఇదే మొదటిసారి.
రికార్డు స్థాయిలో నిర్మాణం
కాళేశ్వరం ద్వారా 7200 మెగావాట్ల సామర్ద్యంతో 3టిఎంసిల నీటిని రోజుకు పంప్ చేసే విధంగా పనులు జరగుతుండగా అందులో 2టిఎంసిల నీటిని రోజుకు పంప్ చేయడానికి 4992 మెగావాట్ల సామర్ద్యం కల్గిన పంపింగ్ కేంద్రాలతో పాటు అంతే విద్యుత్తు సరఫరా అవుతుంది.ఇందులోనూ అత్యధిక భాగం మేఘానే పూర్తిచేసింది. 11 పంపింగ్ కేంద్రాలలో 59మిషన్లను ఏర్పాటు చేయడం ద్వారా 3436 మెగావాట్లు రెండున్నరేళ్ళలో నిర్మించడం ఇంజనీరింగ్ వండర్ గా గుర్తింపు పొందింది.పంపింగ్ కేంద్రాల నిర్మాణంలో ఇంతవరకు దరిదాపుల్లో మరే ప్రాజెక్టు కూడా లేదు. ఐతే మొదటి దశలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంప్ హౌస్లను పూర్తిగా వినియోగిస్తుండటంతో దాదాపు 50టిఎంసిల నీటిని మిడ్ మానేరుకు పంప్ చేసి అక్కడి నుండి లోయర్ మానేరుకు విడుదల చేశారు. తాజాగా మళ్ళీ లక్ష్మీ కేంద్రం నుండి 11 మిషన్లతో పంపింగ్ ప్రారంభించగా సరస్వతి, పార్వతి, కేంద్రాల నుంచి కూడా పూర్తి స్థాయిలో పంపింగ్ కు రంగం సిద్దం చేశారు. ఇప్పటికే సరస్వతిలో 4మిషన్లు పంపింగ్ చేస్తున్నాయి.
మేఘా విద్యుత్ వండర్
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మొత్తం 4627మెగావాట్ల విద్యుత్ సరఫరా అవసరం కాగా అందులో 3057మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ అనతికాలంలోనే నిర్మించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక అతి తక్కువ సమయంలోనే మేఘా పంపింగ్ కేంద్రాలు 44 టిఎంసీల నీటిని ఎత్తిపోశాయి. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ నీటిని పంప్‌చేయడం కూడా ఓ రికార్డ్‌గా చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment