medigadda pampu house
-
హంద్రీ - నీవాను మించి...
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌తో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా అద్బుతం చేసింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్చ్ లిమిటెడ్(ఎంఈఐఎల్). ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పధకంలో తమ ఇంజనీరింగ్ మేధస్సుతో అద్భుతాలు చేసింది. అనతికాలంలోనే అత్యధిక సామర్ధ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణా ప్రజల గొంతుకను తడపడమే కాదు బీడుపడిన పంటపొలాలను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం. మూడేళ్ళలోనే 11పంపింగ్ కేంద్రాలలొ 3436 మెగావాట్ల సామర్ద్యం గల మిషన్ల ఏర్పాటుతో మొదటి దశ పనులు పూర్తిచేసి కాళేశ్వరంలోని లింక్ -1,2 లను పూర్తిచేసి రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోసి చరిత్ర తిరగరాసింది. మేఘా పంపులతో గోదావరి పరవళ్లు రెండేళ్ళలో 11పంపింగ్ కేంద్రాలు పూర్తి చేయడంతో పాటు లింక్-1 పూర్తితో 120 కిమీ ఎగువకు గోదావరి నీరు రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళించడమే కాకుండా లక్ష్మీ పంప్ హౌస్ తో దిగువన ప్రాణహిత నీరు ఎగువ గోదావరిలోకి మళ్ళింపు చేయడం మరో రికార్డ్. గోదారి పరవళ్ళకు కొత్తనడకలు నేర్పుతూ రైతుల ఆశలకు జీవంపోస్తూ తెలంగాణా ప్రభుత్వ చిత్తశుద్దిని, పట్టుదలను, ఆచరణలో కాళేశ్వరాన్ని శరవేగంగా పూర్తి చేసి నిరూపించింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్స్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్). ఇప్పుడు లక్ష్మీ(మేడిగడ్డ)పంపింగ్ కేంద్రం నుండి 11 మిషన్లతో ఒకేసారి నీటిని ఎత్తిపోయడం ద్వారా మొదటి దశ పనులు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. తాజాగా లక్ష్మీ కేంద్రం ఫిబ్రవరి 15వ తేదీ అర్దరాత్రి నుండి ఇప్పటివరకు నాలుగు టిఎంసిల నీటిని ఎత్తిపోసింది. 11 మిషన్లు పనిచేయడం ద్వారా 22 డెలివరీ పైపుల ద్వారా విడుదలైన ఆ గోదావరి పరవళ్ళు కనులవిందుగా ఉంది. పంపింగ్ కేంద్రం నుండి జాలువారిన గోదారి జలాలు వాడిన రైతన్నల ఆశలను మళ్ళీ చిగురింపచేశాయి. లక్ష్మీ నుండి డిసి ద్వారా విడుదలైన నీరు 13 కిలోమీటర్ల మేర కాలువలో హోయలొలుకుతూ సరస్వతి జలాశయానికి చేరిన గోదారి సముద్రాన్ని తలపిసూ జనాలను మైమరిపిస్తోంది. హంద్రీ - నీవాను మించి... ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పధకం అయిన హంద్రీనీవాతో ఔరా అనిపించుకున్న మేఘా ఇప్పుడు తాజాగా కాళేశ్వరంలో 3436 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మిషన్లను 11పంపింగ్ కేంద్రాలలో ఏర్పాటుచేసి తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగరాసింది. కాళేశ్వరంతో మరెవరికీ సాధ్యంకాని రికార్డు తన సొంతం చేసుకుంది మేఘా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం 22 పంపింగ్ స్టేషన్లు ఉండగా ఎంఈఐఎల్ మాత్రమే 17 పంప్ హౌస్‌లను నిర్మిస్తోంది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పధకాలకు ఇంత పెద్దస్థాయిలో విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా ఇదే మొదటిసారి. రికార్డు స్థాయిలో నిర్మాణం కాళేశ్వరం ద్వారా 7200 మెగావాట్ల సామర్ద్యంతో 3టిఎంసిల నీటిని రోజుకు పంప్ చేసే విధంగా పనులు జరగుతుండగా అందులో 2టిఎంసిల నీటిని రోజుకు పంప్ చేయడానికి 4992 మెగావాట్ల సామర్ద్యం కల్గిన పంపింగ్ కేంద్రాలతో పాటు అంతే విద్యుత్తు సరఫరా అవుతుంది.ఇందులోనూ అత్యధిక భాగం మేఘానే పూర్తిచేసింది. 11 పంపింగ్ కేంద్రాలలో 59మిషన్లను ఏర్పాటు చేయడం ద్వారా 3436 మెగావాట్లు రెండున్నరేళ్ళలో నిర్మించడం ఇంజనీరింగ్ వండర్ గా గుర్తింపు పొందింది.పంపింగ్ కేంద్రాల నిర్మాణంలో ఇంతవరకు దరిదాపుల్లో మరే ప్రాజెక్టు కూడా లేదు. ఐతే మొదటి దశలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంప్ హౌస్‌లను పూర్తిగా వినియోగిస్తుండటంతో దాదాపు 50టిఎంసిల నీటిని మిడ్ మానేరుకు పంప్ చేసి అక్కడి నుండి లోయర్ మానేరుకు విడుదల చేశారు. తాజాగా మళ్ళీ లక్ష్మీ కేంద్రం నుండి 11 మిషన్లతో పంపింగ్ ప్రారంభించగా సరస్వతి, పార్వతి, కేంద్రాల నుంచి కూడా పూర్తి స్థాయిలో పంపింగ్ కు రంగం సిద్దం చేశారు. ఇప్పటికే సరస్వతిలో 4మిషన్లు పంపింగ్ చేస్తున్నాయి. మేఘా విద్యుత్ వండర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మొత్తం 4627మెగావాట్ల విద్యుత్ సరఫరా అవసరం కాగా అందులో 3057మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ అనతికాలంలోనే నిర్మించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక అతి తక్కువ సమయంలోనే మేఘా పంపింగ్ కేంద్రాలు 44 టిఎంసీల నీటిని ఎత్తిపోశాయి. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ నీటిని పంప్చేయడం కూడా ఓ రికార్డ్‌గా చెప్పొచ్చు. -
ఇప్పుడంతా ‘పరీక్షా’ కాలం!
సాక్షి, హైదరాబాద్: ఇది ‘పరీక్ష’ల సీజన్. నీటిపారుదల శాఖకు టెస్టింగ్ పీరియడ్. పంప్‌హౌస్‌లలో డ్రై, వెట్‌రన్ నిర్వహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖరీఫ్ సీజన్లో కనిష్టంగా నూటా ఇరవై టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని నీటి పారుదల శాఖ దృడ సంకల్పంతో ఉంది. ఇప్పటికే ఎల్లంపల్లిలో లభ్యత ఉన్న జలాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–6 పరిధిలో పంపులు, మోటార్లకు వెట్‌రన్ నిర్వహించిన ఇంజనీర్లు మిగతా ప్యాకేజీల్లోని మోటార్లను సైతం డ్రై, వెట్‌రన్ నిర్వహించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 8వ తేదీన గానీ, 9వ తేదీన గానీ మేడిగడ్డ పంప్‌హౌస్‌ల పరిధిలో, 15వ తేదీలోపే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో, నెలాఖరుకు మిడ్‌మానేరు దిగువన ఉన్న నాలుగు ప్యాకేజీల పరిధిలోని పంప్‌హౌస్‌ల్లో డ్రై, వెట్‌రన్ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ నుంచే ఎత్తిపోతలు గోదావరిలో జూన్ తొలివారం నుంచే నీటి ప్రవాహాలు మొదలవుతాయి. ప్రాణహిత నుంచి గోదావరికి ఉధృత ప్రవాహాలుంటాయి. ఈ ప్రవాహాలు పుంజు కునే నాటికి పంపులు, మోటార్లు అంతా సిద్ధం చేసి వరద కొనసాగే రోజుల్లో కనిష్టంగా రోజకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం లక్ష్యంగా పె ట్టుకున్న విషయం తెలిసింది. అందుకు తగ్గట్లే బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వల పనులను చేస్తోంది. అత్యంత ముఖ్యమైన మోటార్ల ఏర్పాటును వేగిరం చేసింది. అత్యంత ప్రాధాన్యం గల తొలి పంప్‌హౌస్ అయిన మేడిగడ్డలో 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇందులో 7 ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరో రెండు మోటార్లు ఏర్పాటు దశలో ఉన్నాయి. సిద్ధంగా ఉన్న మోటార్లకు ఈ నెల 8నగానీ, 9న గానీ వెట్‌రన్ నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయిం చారు. ఇటీవల పంప్‌హౌస్ పరిధిలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ సైతం గోదావరిలో లభ్యతగా ఉండే నీటితో ఈ నెల 8న వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాలు కురిసి నీటి లభ్యత ఏర్పడిన అనంతరం అన్నారంలోని 9 మోటార్లు, సుందిళ్లలోని మోటార్లకు వెట్‌రన్ చేయనున్నారు. కాళేశ్వరానికి అనుసంధానంగా ఉన్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని మూడు పంప్హౌస్లకుగానూ రెండింటిని సిద్ధం చేసిన 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగేసి చొప్పున పంపులకు డ్రైరన్ నిర్వహించనున్నారు. ఈ పంప్‌హౌస్‌ల ద్వారా ఈ ఖరీఫ్‌లో కనిష్టంగా 45 నుంచి 60 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యం విధించారు. మిడ్‌మానేరు దిగువన ఉన్న ప్యాకేజీ–10లో 106 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 4 పంపులకు ఈ నెలాఖరున డ్రైరన్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్యాకేజీ–11లోని 135 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 మోటార్లు, ప్యాకేజీ–12లో 43 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 8 మోటార్లకు జూన్‌లో వెట్‌రన్ చేసే అవకాశం ఉంది. ఇక ప్యాకేజీ–16లోని రెండు పంప్‌హౌస్‌ల్లో జూలైలో వెట్‌రన్ జరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. -
రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలి
పునరావాస చట్టం అమలుచేయాలి గోలివాడ భూనిర్వాసితుల డిమాండ్ రామగుండం: గోలివాడ వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని, తమకు చెల్లించే లబ్ధి చేకూర్చే అంశాలపై అధికారులు లిఖితపూర్వకమైన హామీలు ఇవ్వాలని భూనిర్వాసితులు స్పష్టంచేశారు. మేడిగడ్డ–కాళేశ్వరం పంపుహౌస్ నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం పెద్దపల్లి ఆర్డీవో, భూసేకరణ అధికారి అశోక్‌కుమార్, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు రైతులతో ఆదివారం సమావేశమయ్యారు. భూముల ధరపై రైతులు అభ్యంతరం తెలుపుతూ అధికారుల చెల్లించే ధరను స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ ఎకరాకు రూ.14.52లక్షలు ఉందని, అదే ధర ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. పంపుహౌస్ పనులకు సేకరించే వ్యవసాయ భూములలో శాస్త్రీయ పద్ధతిని పాటించి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం భూములు సేకరించిన తర్వాత వాటి వెనుకవైపు ఉన్న భూములకు రవాణా సౌకర్యం కల్పించాల డిమాండ్ చేయగా.. స్పందించిన ఎస్ఈ సు«ధాకర్‌రెడ్డి సదరు భూములకు వెళ్లేందుకు కెనాల్‌పై వంతెన నిర్మాణం చేపడతామని చెప్పారు. భూనిర్వాసిత కుటుంబం నుంచి ఒకరికి ప్రాజెక్టులో, లేదంటే నీటిపారుదలశాఖలో ఉద్యోగావకాశం కల్పించాలని, డబుల్‌బెడ్ రూం పథకం వర్తింపజేయాలని కోరారు. 2013భూసేకరణ చట్టం అనుసరించి పరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలను అధికారులు ఉన్నతాధికారులతో సమీక్షించి తదుపరి నిర్ణయం వెల్లడించనున్నట్లు ఆర్డీవో అశోక్‌కుమార్ తెలిపారు.