
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరుకు తనవంతు బాధ్యతగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ ముందుకు వచ్చి సహాయం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5 కోట్లు, కర్ణాటకకు 2 కోట్లు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి తాజాగా ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వానికి 2 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. ఈ మేరకు 2 కోట్లు బ్యాంకు ద్వారా పంపించిన మేఘ యాజమాన్యం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ కూడా రాసింది. లాక్‌డౌన్ మూలంగా పేదలు, కూలీలు, ఆకలితో అలమటిస్తున్న వారికి ప్రభుత్వాలు అందిస్తున్న సాయానికి తమ వంతుగా మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు చేయూతను అందిస్తామని మేఘా ప్రకటించింది. (ఏపీ: ‘మేఘా’ విరాళం)
Comments
Please login to add a commentAdd a comment