![MEIL 500 crore order for Megha company - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/16/megha-company-rs-500-crore-order.jpg.webp?itok=j3flj3rX)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘ ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ ఐకామ్ టెలి తాజాగా భారత రక్షణ శాఖ నుంచి రూ. 500 కోట్ల ఆర్డర్ చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా 5/7.5 టన్నుల రేడియో రిలే కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ కంటైనర్స్ 1,035 యూనిట్లు సరఫరా చేయనుంది. రక్షణ శాఖతో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఐకామ్ టెలి గురువారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే డెలివరీలు ప్రారంభం అవుతాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment