ఎంఈఐఎల్ 130 ప్రాజెక్టుల రికార్డు! | MEIL Completed 130 Projects | Sakshi
Sakshi News home page

ఎంఈఐఎల్ 130 ప్రాజెక్టుల రికార్డు!

Published Wed, May 15 2019 1:48 PM | Last Updated on Wed, May 15 2019 1:48 PM

MEIL Completed 130 Projects  - Sakshi

ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల‌్ గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, గ్యాస్ ప్రాసెసింగ్, గ్యాస్ పంపిణీ తదితర రంగాలలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టులను నిర్ణీత గడువు కన్నా ముందే నాణ్యతతో రాజీపడకుండా పూర్తి చేయడం ఎంఈఐఎల‌్ ప్రత్యేకత. రికార్డు సమయంలో400 220 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్,  ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంఈఐఎల‌్ ఎక్కింది. అలాగే రాగేశ్వరీ వద్ద గ్యాస్ ప్రాసిసింగ్ యూనిట‌్‌ను కూడా కేవలం ఆరునెలల కాలంలోనే నెలకొల్పి రికార్డులను తిరగరాసింది.

2018-19 సంవత్సరానికి గాను తెలంగాణాలో మిషన్‌ భగీరథ కింద కరీంనగర్‌,  సిరిసిల్లా,  వెములవాడ,  చొప్పదండి, పెద్దపల్లి-రమగుండం,మహబూబ్‌నగర్‌, నల్గొండ, పాలేరు-వరంగల్‌ వంటి ప్రాజెక్ట్‌లతో పాటు రాజస్థాన్‌లోని రాగేశ్వరి గ్యాస్‌ టెర్మినల్‌ ప్లాంట్‌, అసింద్‌, కోట్రి, షాపుర, పాలి, ఓడిషాలోనిభూవనేశ్వర్‌ బల్క్‌ వాటర్‌, కియోన్‌జహర్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌, అలాగే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, ఆగ్రా లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇక సాగునీటి రంగంలో  పురుషోత్తపట్నం స్టేజ్‌-2, కొండవీటివాగు, చింతలపూడి, హంద్రీ-నీవా ఫేస్‌-2,  కర్నాటకలోని  ఉత్తర కోలార్‌,  దసరహళ్లి,  కాన్వా,  గుజరాత్‌లోని  సౌనీయోజనతో  పాటు ఆరు  ఎత్తిపోతల  పథకాలను దిగ్విజయంగా పూర్తిచేసింది. 

అలాగే విద్యుత్ రంగంలో నర్సాపూర్‌,  కలికిరి,  గజ్వేల్‌,  కేతిరెడ్డిపల్లి,  మహేశ్వరం,  పొదిలి,  సత్తేనపల్లి  ప్రాజెక్ట్లను  పూర్తి  చేసింది. ఎంఈఐఎల్‌ పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్ట్‌లో కొన్ని పూర్తిస్థాయిలోని ప్రాజెక్టులుగా కాగా మరికొన్ని ప్రాజెక్ట్‌ల్లో భాగమైన  నిర్దేశించిన పనికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్‌గానే పరిగణిస్తారు.

రికార్డ్‌ సమయంలో రాగేశ్వరి గ్యాస్‌ టెర్మినల్‌...
రికార్డ్‌ సమయంలో రాజస్థాన్‌లోని రాగేశ్వరి గ్యాస్‌ టెర్మినల్‌ ప్లాంట్‌ను 6 నెలల్లోనే పూర్తి  చేసింది. కెయిర్న్ ఇండియా కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు పనులను 2018 సెప్టెంబర్‌లో మొదలుపెట్టి మార్చి 2019 నాటికి పూర్తి చేసింది.  ఈ ప్రాజెక్ట్‌ ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ పనులను ఎంఈఐఎల్‌ 18నెలల పాటు చూడనుంది.

సౌరాష్ట్ర బ్రాంచ్‌కెనాల్‌పై జల విద్యుత్‌...
అలాగే గుజరాత్‌లోని సౌరాష్ట్ర బ్రాంచ్‌ కెనాల్‌పైన రెండు హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఎంఈఐఎల్‌ పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది.  ఇందులో  ఒక్కో  యూనిట్‌లో  15  మెగా  మెగావాట్ల  విద్యుత్‌ ఉత్పత్తి  చేయనుంది. మరో 15 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్లాంటును కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. మూడో ప్లాంటు అందుబాటులోకి వస్తే మొత్తం 45 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి అవుతుంది.

రాయచూర్‌లో వైటీపీఎస్‌
ఇక కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌ జిల్లాలో వైటీపీఎస్‌ ప్రాజెక్ట్‌ను గడువుకంటే ముందే ఎంఈఐఎల్‌ పూర్తి చేసింది. ప్లాంటుకు అవసరమైన  నీటిని  కృష్ణనది  నుంచి  తీసుకునేలా  ఏర్పాట్లు  చేసింది. ఒక్కసారి  ప్లాంట్లులో వాడిన నీటిని (బూడిద నీరు) చెరువులకు పంపించి చెరువు ద్వారా మళ్లీ నీటినివైటీపీఎస్‌ ప్లాంట్‌కు తరళించేలా  ఏర్పాట్లు చేశారు.  నీటి వృథా కాకుండా ఎంఈఐల్‌ ఇలా ఏర్పాటు చేసింది.

కాళేశ్వరంలోని లింక్‌-1 సబ్‌స్టేషన్లు...
ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని లింక్‌-1 సబ్‌స్టేషన్లను ఎంఈఐఎల్‌ పూర్తి చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ప్యాకేజ్‌-8 సబ్‌స్టేషన్ను  విజయంతంగా  పూర్తిచేయడంతో  కాళేశ్వరం  ప్రాజెక్టు  లింక్‌-1లోని  నాలుగు  సబ్‌స్టేషన్లు అందుబాటులోకివచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు గుండెకాయ లాంటి లింక్‌-1లోని ప్యాకేజ్‌-8 రామడుగు 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఎంఈఐఎల్ విజయవంతంగా చార్జ్‌చేసింది. ప్రపంచంలోనే  అతి పెద్దదైన  భూగర్భ  పంపింగ్‌స్టేషన్‌ను  ప్యాకేజ్‌-8లో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ పంప్‌హౌస్‌లో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంకలిగిన 7 భారీ పంప్‌మోటార్లకు విద్యుత్ అందించేలా రామడుగులో  400/13.8/11  కేవీ సబ్‌స్టేషన్‌ను ఎంఈఐఎల్‌ విజయంతంగా చార్జ్‌ చేసింది.

360 మెగావాట్ల మొత్తం సామర్థ్యం కలిగిన 9 పంప్‌మోటర్లను సుందిళ్లలో ఏర్పాటు చేశారు. ఈ మోటార్లకు విద్యుత్‌ను అందించేందుకు 400 కేవీ సబ్‌ష్టేషన్‌, 480  మెగావాట్ల  సామర్థ్యం  కలిగిన  అన్నారం  పంప్‌హౌజ్‌లోని  12  పంప్  మోటార్లకు విద్యుత్‌ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ 220/11 కేవీఅన్నారం సబ్‌స్టేషన్‌, 600  మెగావాట్ల  సామర్థ్యం  కలిగిన  మేడిగడ్డ  పంప్‌హౌజ్‌లోని  17  పంప్‌మోటార్లకు  విద్యుత్‌ను  అందించేందుకు 220/11 కేవీ మేడిగడ్డ సబ్‌స్టేషన్‌ను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరానికి తాగునీటి సరఫరా పథకంలో  భాగంగా  70,000  గృహాలకు శుద్ధి చేసిన నీటిని  సరఫరా చేసే ప్రాజెక్టును కూడా ఎంఈఐఎల్ దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇందుకుగాను ఎంఈఐఎల్‌  544 కిలోవాట్ల  సామర్థ్యం  గల మూడు టర్బైన్‌ పంప్‌లను ఏర్పాటు చేసింది. రోజుకు 122 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధిచేసేలా వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో పురుషోత్తపట్నం స్టేజ్‌-2, హంద్రీనీవా రెండో దశ, కొండవీటివాగు, చింతలపూడి ప్రాజెక్టులను కూడా రికార్డ్‌  సమయంలో పూర్తి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement