హరిద్వార్: ఆచార్య బాలకృష్ణ నేతృత్వంలోని పతంజలి బృందం హిమాలయాల్లో అరుదైన మూలికలను కనుగొంది. హిమాలయాలలోని కొన్ని అధిరోహించలేని, చేరుకోలేని శిఖరాలను సైతం ఎక్కి ఈ మూలికలను గుర్తించినట్లు ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది.
హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, పతంజలి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఇందుకు సంబంధించి ఏర్పాటైన ఒక స్వాగత కార్యక్రమం చిత్రాన్ని తిలకించవచ్చు.
ఈ కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ, నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్‌ఐఎం)ప్రిన్సిపాల్ కల్నల్ అమిత్ బిష్త్‌తో సహా పలువురు పాల్గొన్నారు. అరుదైన విజయాన్ని సాధించినందుకుగాను పతంజలి బృందాన్ని పలువురు ప్రశంసించారు. ఇది గర్వకారణ చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment