Herbal products
-
నయన తార మెచ్చిన హైబిస్కస్ టీ : ఎన్ని మ్యాజిక్కులో
మన భారతదేశంలో మందార మొక్కకు ఉన్న ప్రాముఖ్యత చాలా పెద్దదే. మందార ఆకులు, పువ్వులు, పువ్వుల నుంచి తీసిన తైలం సౌందర్య ఉత్పత్తుల్లో అనాదిగా వాడుకలో ఉన్నవే. ముఖ్యంగా ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఈ మందార టీ తాగడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది స్టార్ హీరోయన్ నయనతార.మందార పువ్వుల టీ, లేదా హైబిస్కస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి .మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు , గుండె సంబంధిత వ్యాధులు,తదితర సమస్యలకు చక్కగా పనిచేస్తోంది. బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. మొటిమలు, చర్మంపై వేడి కురుపులు రాకుండా కాపాడుతుంది. అలాగే హైబిస్కస్ టీ వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని కాపాడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్/అనారోగ్యం నుండి రక్షించే యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుంది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) రోజూ మందార టీ తాగడం సురక్షితమేనా? అంటే నిక్షేపంలా తాగవచ్చు (మితంగా) మందారతో దాదాపు ఎలాంటి అలెర్జీలు ఉండవు. మందార టీ దేనికి మంచిది? మందార టీ వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరంగా పరిశీలిద్దాం. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.హైపోలిపిడెమిక్ లక్షణాల వల్ల మధుమేహం వంటి బ్లడ్ షుగర్ డిజార్డర్స్‌తో బాధపడేవారికి అద్భుతాలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి , రక్త నాళాలు దెబ్బతినకుండా కాపాడటానికి దోహదం చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మన శరీర కణజాలం, కణాలలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా ఈ వ్యాధుల నుండి కాపాడుతుంది. మెరిసే చర్మం కోసం మందార టీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. హైబిస్కస్ టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇంకా మైరిసెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది కాబట్టి చర్మం మెరుపును కాపాడుతుంది.ఆరోగ్యకరమైన జుట్టుమందార టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెలనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. జుట్టుకు సహజమైన రంగును అందించి పట్టుకుచ్చులా మెరిసేలా చేస్తుంది. జుట్టు తొందరగా తెల్లగా కావడాన్ని అడ్డుకుంటుంది. ఈ టీలో ఉన్న అమైనో ఆమ్లాలు మీ శరీరంలో ఎక్కువ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇది కుదుళ్లు గట్టి జుట్టు ఒత్తుగా, షైనీ ఉంచేందుకు మ్యాజిక్‌లా పనిచేస్తుంది.ఇంకా రక్తపోటు నియంత్రణలోనూ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని ఆస్కార్బిక్ యాసిడ్ (విటమిన్ సి) సమృద్ధిగా ఉండటం వల్ల, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కూడా ప్రసిద్ది చెందింది, ఇది సాధారణ అనారోగ్యాలను అరికట్టడంలో సహాయపడుతుంది ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం చికిత్సలోనూ పనిచేస్తుంది.మందార పూల టీ తయారీఎండ బెట్టిన మందార పూలను నీటిలో వేసి కొద్ది సేపు మరిగించాలి.దీంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసి మరికొద్దిసేపు మరిగించాలి. చక్కటి రంగు వచ్చిన తరువాత ఒక కప్పులోకి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. రుచికోసం ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. ఇంకా నిమ్మ, పుదీనాతో గార్నిష్ చేసుకొని చల్లగాగానీ, వేడిగా గానీ తాగవచ్చు. రెండు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. -
రకుల్ ప్రీత్ ‘ఫెన్నెల్ టీ’ పోస్ట్ వైరల్, దీని లాభాలేంటో తెలుసా?
అందానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేనటి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రమంగా జిమ్ చేస్తూ, బలవర్ధక ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చే రకుల్ ప్రీత్ తాజాగా ఒకటీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అసలు ఏంటీ ఫెన్నెల్ టీ, దీని ప్రయోజనాలేంటి అనేది హాట్ టాపిక్‌గా మారింది. మరి ఫెన్నెల్ టీతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?ఫెన్నెల్ టీ అంటే సోంపు గింజలతో తయారు చేసే టీ. దీన్నే ఫెన్నెల్ సీడ్స్ వాటర్, లేదా ఫెన్నెల్-ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని కూడా పిలుస్తారు. ప్రతిరోజూ ఉదయం ఈ సోంపు గింజల నీళ్లను తీసుకోవడం ద్వారా అనేక అరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సోపు గింజలను నీటిలో వేసి కాచడం ద్వారా ఫెన్నెల్ టీని తయారు చేస్తారు. దీని రుచి చిరు చేదుగా, చక్కటి సువాసనతో ఉంటుంది. శతాబ్దాలుగా దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు.ఫెన్నెల్ టీ ఎలా తయారు చేయాలిఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఫెన్నెల్ గింజలను తీసుకుని వాటిని రెండు కప్పుల నీటిలో మరిగించాలి. ఆ నీటిని వడకట్టి చల్లబడిన తరువాత గానీ, వేడి వేడిగా కానీ సేవించవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో ఫెన్నెల్ టీ తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఫెన్నెల్ టీ లాభాలుసోంపు గింజలలో ఉండే విటమిన్ సీ ఐరన్, ఖనిజాలు నిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. సోంపు గింజల నీటిని తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి రక్షణ అందిస్తుంది. ఫెన్నెల్ టీ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సోంపు గింజలలో అనెథోల్ వంటి నూనెలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జీర్ణక్రియలో సాయపడతాయి. సోంపు గింజలలో కార్మినేటివ్ గుణాలు ప్రేగు కదలికలను మెరుగు పరుస్తాయి. జీర్ణశయాంతర ప్రేగులలోని కండరాలను ప్రేరేపించి, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో సాయపడతాయి. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అజీర్ణం, గుండెల్లో మంటకు ఉపశమనం లభిస్తుంది. మధుమేహులకు లేదా డయాబెటిస్ రిస్క్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. సోంపు గింజల వాటర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. వయస్సు-సంబంధిత మచ్చలు తగ్గుతాయి. కంటి సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.సోంపు గింజలలో పొటాషియం ఉంటుంది. సోంపు గింజలలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయ పడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఫెన్నెల్ టీ పీరియడ్స్ క్రాంప్ల నుండి ఉపశమనం పొందడంలో సహాయ పడుతుంది. ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కండరాలకు శాంతి కలుగుతుంది. దీంతో ప్రశాంతమైన నిద్ర పడుతుంది. -
హెర్బల్ ప్రొటీన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన..హెబ్బాపటేల్ (ఫొటోలు)
-
తిరుమల: శేషాచలం.. సంజీవని ఔషధ వనం
శేషాచలం అంటే ఔషధ వనం. ఇప్పటివరకూ మనకు శేషాచల కొండలు అంటే వేంకటేశ్వర స్వామి నిలయం, ఎర్రచందనం అడవులని మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ అపర సంజీవని వంటి వన మూలికలు, ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఆస్పత్రులే లేని కాలంలో రాజులు, జమీందార్లకు ఈ శేషాచలమే వైద్యశాల. ఔషధ మొక్కలు.. వనమూలికలతోనే ఎలాంటి జబ్బులైనా నయం చేసేవారు. నిజానికి ఆ నాటి నుంచి నేటికీ అడవిలో లభించే ఈ ఔషధ మొక్కల గురించి కొందరికి మాత్రమే తెలుసు. నేటి తరానికి ఒకింత విడ్డూరం అనిపించినా.. నాటి ఆయుర్వేద వైద్య మూలాలే నేటి అల్లోపతి, హోమియోపతి, ఆయుష్ తదితర అన్ని రకాల వైద్యానికి ఆధారం. ఇంతటి అద్భుతమైన ఔషధ మొక్కలు, వనమూలికలు, వృక్షాలను తనలో దాచుకున్న శేషాచలం కొండల్లో అన్వేషణ సాగిస్తే తెలిసిన విశేషాలు.. తిరుపతి అలిపిరి.. శేషాచల అటవీ ప్రాంతం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లా వ్యాప్తంగా 526చదరపు కిలో మీటర్లు (82,500 హెక్టార్ల)లో వ్యాపించి ఉంది. దీన్ని రెండు విభాగాలుగా విభజించారు. శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్కు–353చదరపు కిలోమీటర్లు టీటీడీ పర్యవేక్షణలో, వన్యప్రాణి అభయారణ్యం – 526చదరపు కిలోమీటర్లు అటవీశాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ఈశాన్య పర్వత శ్రేణుల్లో భాగమైన శేషాచలం కొండలు ఎన్నో వింతలు, విశేషాలు, చరిత్రలు, అద్భుతాలకు ఆలవాలం. దేవతా మూర్తులకు నిలయంగా నానుడిలో ఉన్న శేషాచలం కొండలను బొటానికల్ స్వర్గం అని పరిశోధకులు పిలుస్తుంటారు. అత్యంత అరుదైన ఔషధ, వన మూలికలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు మానవాళికి ఆయువుతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. ఈ కారడవిలో 176 కుటుంబాలకు చెందిన 1500కు పైగా జాతుల మొక్కలను పరిశోధకులు గుర్తించారు. ప్రతి మూలిక, మొక్క కూడా ఏదో ఒకరకమైన మానవ, జంతు, పక్షు వ్యాధులను నయం చేసే గుణాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ వ్యతికినా దొరకని అతి అరుదైన జాతి వృక్షాల్లో ఎర్రచందనం ఇక్కడి ప్రత్యేకత. దీంతోపాటు జాలారీ, తంబ జాలారి, తెల్లకరక, మొగిలి వంటివి ఇక్కడ దర్శనమిస్తాయి. శేషాచల అడవుల్లో దొరికే ఈ అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులపై నిత్యం జాతీయ, అంతర్జాతీయ పరిశోదనలు జరుగుతుండటం విశేషంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ గుర్తింపు అరుదైన పక్షి, జంతు, వృక్ష జాతులు ఇక్కడ మాత్రమే దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలోనే శేషాచల పర్వత శ్రేణిని బయోస్పియర్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ సంచరించేందుకు అడవులపై ఆధారపడి జీవనం సాగించే వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. దీనినే బఫర్ జోన్ అంటారు. బయోస్పియర్ జాతీయ, అంతర్జాతీయ పరిశోధనలు జరుగతూనే ఉంటాయి. శేషాచల అడవులకు అంతర్జాతీయ గుర్తింపు రావటం విశేషం. ఊడుగ చెట్టు(అంకోలము) వేర్లు, పండ్లు, విత్తనాలను ఉపయోగించి ఆయుర్వేద మందులు తయారుచేస్తారు. అలంగియేసి కుటుంబానికి చెందినది ఈ మొక్క. ఆంగ్లంలో అలంగియం సాలి్వఫోలియం అని పిలుస్తారు. ఆ్రస్టింజెంట్, ఆంథెలి్మంటిక్, డయేరియా, లెప్రసీ, ఎరిసిపెలాస్, చర్మ వ్యాధులు, మూత్ర సంబంధిత రుగ్మతలు, జ్వరము, రక్తస్రావము, వెఱి< కుక్కలు, కండ్లకలక తదితర వ్యాధుల నివారణకు దీనిని ఉపయోగిస్తారు. గిల్లతీగ గిల్లతీగ ప్రత్యేకించి శేషాచలంలోని తలకోన అటవీ ప్రాంతంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇది లయనాసి తీగల జాతికి చెందినది. చెట్టుకు చెట్టును ఆధాంరం చేసుకొని అడివంతా అల్లుకుంటూపోతుంది. ఇది మూడు వతాబ్దాల నాటి దని పరిశోధకులు చెబుతున్నారు. తలకోన ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల మేర అల్లుకుపోవడాన్ని చూడవచ్చు. దీని చుట్టుకొలత 260 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ తీగకు కాసే కాయలు సుమారు 100సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. వృక్ష కాయలలో అతిపెద్ద కాయగా పరిగణిస్తారు. కొండజాతి ప్రాంతీయులు దీని కాయల్లో ఉన్న గుజ్జును తొలిగించి అగ్గిపెట్టెగా వాడుకుంటారు. మరి కొందరు నసిం డబ్బాగాను వాడతారు. తీగ బెరడులో సఫోనిక్ అనే చేపల చంపే పదార్థం ఉంటుంది. నేలవేము ఈ రకం చెట్టు శేషాచలం అడవిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మొక్కననుయాంటిపైరేటిక్, యాంటిపెరియాడిక్, యాంటీ ఇన్ప్ల్లమేటరీ, అల్సర్లు, దీర్ఘకాలిక జ్వరాలు, బ్రాంకైటిస్, చర్మ వ్యాధులు, లెప్రసీ, పేగు పురుగులు, హేమోరాయిడ్స్, కామెర్లు, కడుపు పూతలకు వినియోగిస్తారు. ఇది అకాంతసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని ఇంగ్లీషులో ఆండ్రొగ్రాఫిస్ పానిక్యులేటా అని అంటారు. తెల్ల కరక శేషాచలంలో మాత్రమే అరుదుగా దొరికే ఈ తెల్లకరకను మూత్రవిసర్జన, వాపులు, యాంటిపైరేటిక్, ప్రక్షాళన, విరేచనాలు, పెప్టిక్ అల్సర్లు, మధుమేహం, వెనిరియల్ వ్యాధులు, దగ్గు, జలుబు, విరేచనాలు, పగుళ్లుకు వాడతారు. కాంబ్రెటేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను ఆంగ్లంలో టెర్మినలియా పల్లిడా అని పిలుస్తారు. దీనిలో పండు భాగాన్ని వినియోగించి మందు తయారు చేస్తారు. నక్కతోక ఇది అకాంతసి కుటుంబానికి చెందిన మొక్క. నక్కతోక మొక్కలోని అన్ని భాగాలు పలు రకాల ఆయుర్వే మందులకు వినియోగిస్తారు. దీనిని ఆంగ్లంలో ఎక్బోలియం వైరైడ్ అంటారు. గౌట్, డైసూరియా, స్ట్రిక్చర్, కామెర్లు, మెనోరాగియా, రుమాటిజం. కణితుల నివా రణకు ఉపయోగిస్తారు. మొగిలి పాండనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులను పంటి నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, రుమాటిజం, మూత్ర విసర్జన, యాంటి వైరల్‌కు దీనిని వినియోగిస్తారు. దీనిని ఆంగ్లములో పాండనస్ అమరిల్లిఫోలియస్ అని అంటారు. కప్పరిల్లాకు ఈ ఆకుతో మూత్ర సంబంధిత వ్యాధులు, యోని ఉత్సర్గ, కోలిక్ మరియు డిస్పెప్సియా, కాలేయం, ఆస్తమా, బ్రోన్కైటిస్, జలుబు, దీర్ఘకాలిక దగ్గు పనితీరును ప్రేరేపిస్తుంది. ఇది లామియాసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని కోలియస్ అంబోనికస్ అని అంగ్లంలో పిలుస్తారు. బ్రయోపైలం బ్రయోఫిలమ్ కలిసినం అని ఆంగ్లములో పేర్కొనే ఈ మొక్క క్రాసులేసి కుటుంబానికి చెందినది. దీని ఆకులను చర్మ సమస్యలు, రక్త ప్రసరణ, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు దోహదపడుతాయి. ఇది శేషాచలంలో మాత్రమే లభించే ఔషధ మొక్క చంపకము(మాను సంపంగి) మాగ్నోలియాసీ కుటుంబానికి చెందిన ఈ మొక్కను అజీర్తి, వికారం, మూత్రపిండ వ్యాధులలో స్కాల్డింగ్, మహిళల నెలసరి నియంత్రణ, ఉన్మాదం, మతిమరుపు, అబారి్టఫేసియంట్(రూట్ జ్యూస్)కు వాడతారు. మిచెలియా చంపాకా అని ఆంగ్లంలో పిలుస్తారు. భూ తులసి(విభూది పత్రి) లామియాసి కుంటుబానికి చెందిన ఈ మొక్కను ఓసిమమ్ బాసిలికం అని అంగ్లంలో పిలుస్తారు. బెణుకులు, ఉబ్బసం, విరేచనాలు, బ్రోన్కైటిస్, గోనేరియా, నెఫ్రైటిస్, అంతర్గత పైల్స్ వంటి జబ్బులు నయం కావడానికి వినియోగిస్తారు. జాలారి ఈ వృక్షం తలకోన అడవుల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. జలపాతానికి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని ఆలయ ధ్వజçస్తంభాలకు వాడతారు. దీని చేవ అతిగట్టిగానూ ధృడంగానూ ఉంటుంది. ఈ చెట్టు ఆకులను కామెర్ల నివారణకు వినియోగిస్తారు. కృష్ణ తులసి(తులసి) లామియాసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులు, కాండము, వేర్లను సాధారణ జలుబు, దగ్గు, బ్రోంకోస్పస్్మ, సాధారణ బలహీనత, ఒత్తిడి రుగ్మతలు, చర్మవ్యాధులు, గాయాలు, అజీర్ణం, వికారం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీనిని అంగ్లంలో ఓసిమమ్ శాన్్కటమ్ అని పిలుస్తారు. చిన్నబిక్కి దీనిని ఆంగ్లములో గలినీయా రజినిపెరా అని పిలుస్తారు. ఇది రూజియేసా కుటుంబానికి చెందినది. దీని సమూలాన్ని పూత ద్వారా తేలుకాటుకు వాడతారు. బిక్కి చెట్టు శేషాచలంలోని చామల, దిన్నెల, కోడూరు, నాగపట్ల అటవీ ప్రాంతంలో విరివిగా దొరుకుతుంది. బిల్లుడు ఫ్లిండర్ సీయాసీ అనే ఈ బిల్లుడు జాతిని ఆంగ్లములో క్లోరోక్జిలాన్ అని పిలుస్తుంటారు. దీని బెరడు తీసి రసం తయారు చేసి చర్మవ్యాధులకు ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా శేషాచల అటవీ ప్రాంతంలోని పాపవినాశనం, బాలపల్లి, రాజంపేట, భాకరాపేట, తలకోన అటవీ ప్రాంతంలో చూడవచ్చు. రాజ వైద్యుల కట్టుమాత్రలు ఇక్కడి గుహల్లో.. ఈ ఫోటోలో కనిపిస్తున్నవి చూస్తే రాళ్లు అనుకుంటారు. కాదు ఇవి కట్టుమాత్రలు (సాధుడు మాత్రలు) అని సిద్ధవైద్యం చెబుతోంది. పురాతన కాలంలో రాజవైద్యులు శేషాచల గుహల్లో ఉంటూ అక్కడి ఆయుర్వేద మందులు తయారుచేసేవారు. 200ఏళ్ల ముందు రాజవైద్యులు తయారు చేసిన ఈ కట్టుమాత్రలను సాధువులు గుర్తించారు. లోహాలను, రసాయనాలను ఇక్కడ దొరికే వనమూలికా పసరుతో నూరి పుటం వేసి నాటు మందులు తయారు చేసేవారు. పూర్వం నాటు, మూలిక వైద్యానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు బయటపడినట్లు సాధువుల ద్వారా సమాచారం. హిమాలయాల్లో కూడా దొరకని అరుదైన మూలికలు ఈ శేషాచలం కొండల్లో దొరుకుతాయని మునులు అన్వేషణ సాగిస్తుంటారు. శేషాచలంలో దొరికే మూలికలతో తరాలుగా వైద్యం శేషాచల అటవీ ప్రాంతాల్లో దొరికే మూలికలు, ఔషశ మొక్కలతో ఆయుర్వేద వైద్యం అందిస్తున్నాం. ఈ విద్య మా పూరీ్వకుల నుంచి మాకు వచ్చింది. ఇప్పుడు నా వయస్సు 74 సంవత్సరాలు. క్యాన్సర్ మొదలుకొని తలనొప్పి, ఆయాసం వంటి అనేక జబ్బులకు మూలికల ద్వారా నయం చేస్తాం. కట్టుమాత్రలు తయారు చేసేంత మహానిపుణులు ఇప్పుడు లేరు. మా నాన్న, తాత కాలంలో ఎక్కువగా ఈ నాటు వైద్యం ద్వారానే జబ్బులు నయం అయ్యేవి. దానికి సంబంధించి మూలికలు మన ప్రాంతంలోనే దొరుకుతాయి. – రాజన్న, ఆయుర్వేద వైద్యులు, వెంకటగిరి నాడు ఆరోగ్యం క్షీణిస్తే.. అడవులకే వెళ్లేవారు.. నాటి పూరీ్వకుల కాలంలో ఆరోగ్యం క్షీణిస్తే అడవుల బాటపట్టడమే ఉత్తమంగా పరిగణించేవారని గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలు చెబుతున్నారు. తలనొప్పి, ఆయాసం, కీళ్లనొప్పులు వంటి జబ్బులతో బాధపడేవారు సమీప శేషాచల పర్వత శ్రేణి నుంచి వచ్చే జలపాతంలో స్నానాలు ఆచరించినా, ఇక్కడ వీచే గాలి పీల్చినా జబ్బులు మటుమాయం అవుతాయని చెప్పేవారు. శేషాచల తీర్థాలు వేర్లు, మూలికలు, ఔషధ మొక్కల నుంచి ఊట ద్వారా రావడం వల్ల వ్యాధులు నశించేగుణం ఈ నీళ్లకు ఉంటుందని చెబుతుంటారు. శేషాచలం అణువణువూ ఉపయోగకరమే.. ఔషధ, వనమూలికలు ఎక్కడ దొరకనివి ఈ పర్వతాల్లోనే దొరుకుతాయని మునులు, సాధువులు, నాటువైద్యులను కలిసినప్పుడు అనేక అంశాలను చెప్పారు. శేషాచల విశేషాలపై దాదాపు 15ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నాను. పూర్వీకులు, గ్రామీణులను నుంచి తెలుసుకొన్న ఎన్నో అంశాలు ఆశ్యర్యానికి గురి చేశాయి. రాజవైద్యులు, మునులు, సిద్ధమునులు ఈ ప్రాంతంలో ఆయుర్వేద వైద్యం చేసేవారని తెలిసింది. శేషాచలం అడవుల పరిరక్షణ ఎంతో అవసరం. ఎన్నో చరిత్రలకు ఇక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. శేషాచల పర్వతం అణువణువు మానవాళికి ఉపయోగకరమే. – బాబ్జిరెడ్డి, శాస్త్రవేత్త, ఎస్వీ యూనివర్సిటీ . -
‘అద్భుతం మహా అద్భుతం’ ,హిమాలయాల్లో అరుదైన మూలికలు
హరిద్వార్: ఆచార్య బాలకృష్ణ నేతృత్వంలోని పతంజలి బృందం హిమాలయాల్లో అరుదైన మూలికలను కనుగొంది. హిమాలయాలలోని కొన్ని అధిరోహించలేని, చేరుకోలేని శిఖరాలను సైతం ఎక్కి ఈ మూలికలను గుర్తించినట్లు ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, పతంజలి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఇందుకు సంబంధించి ఏర్పాటైన ఒక స్వాగత కార్యక్రమం చిత్రాన్ని తిలకించవచ్చు. ఈ కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం)ప్రిన్సిపాల్ కల్నల్ అమిత్ బిష్త్‌తో సహా పలువురు పాల్గొన్నారు. అరుదైన విజయాన్ని సాధించినందుకుగాను పతంజలి బృందాన్ని పలువురు ప్రశంసించారు. ఇది గర్వకారణ చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. -
యూఎస్‌లో వీటికి చాలా డిమాండ్.. నువ్వు ఊ అంటే కోట్లే
సాక్షి,హిమాయతనగర్(హైదరాబాద్): ‘అమెరికాలో హెర్బల్ ప్రొడక్ట్స్, పౌడర్‌కు చాలా డిమాండ్ ఉంది.. ఇండియాలో అయితే తక్కువ ధరకే వస్తుంది.. మాతో చేయి కలిపితే మీకు కోట్లు వచ్చేలా వ్యాపారం చేపిస్తాము’ అంటూ నగరానికి చెందిన వ్యాపారికి సైబర్ నేరగాళ్లు వల వేశారు. అమెరికాకు సరుకు రవాణా, కోట్లలో లాభాలు అనే మాటలకు వ్యాపారి నేరగాళ్ల బుట్టలో పడ్డాడు. గాం«దీనగర్‌లో ‘ప్రైమ్ హెర్బల్ ఎంటర్ప్రైజెస్’ పేరుతో హెర్బల్ ప్రొడక్టుల వ్యాపారం చేస్తున్న వ్యాపారికి ఇటీవల యూఎస్ ఫోన్ నంబర్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేశాడు. (చదవండి: కొంతకాలంగా యువతితో ప్రేమ.. స్నేహితులతో కలిసి ప్రియుడు.. ) హెర్బల్కు అమెరికాలో మంచి డిమాండ్ ఉందని, పౌడర్, ప్రొడక్ట్స్ ఏవైనా సరే వేలల్లో ఖరీదు ఉంటుందన్నాడు. కొద్దిరోజుల క్రితమే ఇండియా నుంచి సరుకు పంపే మా మనిషి చనిపోయాడని నమ్మించారు. మీకు ఆశక్తి ఉంటే మాతో చేతులు కలపొచ్చన్నారు. దీనికి సరే అన్న వ్యాపారి కొన్ని పౌడర్ ప్యాకెట్స్‌తో ఢిల్లీలోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి కలసి ఆ పౌడర్ ప్యాకెట్స్‌ను తీసుకుని ఇక్కడి రేటును చెల్లించాడు. మరుసటి రోజు కాల్ చేసి మంచి ప్రీమియం క్వాలిటీని పంపారన్నాడు. ఈసారి పెద్ద మొత్తంలో కావాలన్నాడు. దీంతో సుమారు రూ. 34 లక్షల విలువైన పౌడర్ తదితర ప్రొడక్ట్స్‌ను వాళ్లు చెప్పిన ఢిల్లీ అడ్రస్‌కు పంపాడు. రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం రావడం లేదు. ఫోన్లో సంప్రదించేందుకు ప్రయతి్నంచినా స్విచ్చాఫ్ వస్తుండటంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. దీంతో శుక్రవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వివరించారు. -
హెర్బల్ టీతో కరోనాకి చెక్!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు చెక్‌పెట్టే ఏ ఔషధాన్ని కనిపెట్టలేదు. మాస్క్‌లు, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించడం వల్ల ఈ మహమ్మరి నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. కరోనాపై పోరాటంలో భాగంగా మొహాలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్) సెఫ్టీ డివైజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు తయారు చేస్తూ అండగా నిలుస్తోంది. (శుభపరిణామం: మరింత పెరిగిన రికవరీ) అయితే ఇప్పుడు తాజా కరోనాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీని తయారు చేసింది. ఇంతవరకు కరోనాకు ఎటువంటి మందు లేకపోవడంతో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే మనం కరోనాతో పోరాడగలం. మనకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోగలుగుతాం. ఈ హెర్బల్ టీని స్థానికంగా అందుబాటులో ఉండే ఆరు రకాల హెర్బల్స్ అశ్వగంధ, తిప్పతీగ, ములేటి, తులసి, గ్రీన్‌టీని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. వీటిని తగిన పాళ్లలో కలిపి ఈ హెర్బల్ టీని తయారు చేసుకోవాలి. దీనిని రోజుకు మూడు సార్లు తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. (నాలాగా కోవిడ్ బారిన పడకండి: ఎమ్మెల్యే) -
అరుదైన మూలికలు@సంతబజార్
సాక్షి, మహబూబ్‌నగర్ : ఏదైన ఆయుర్వేదం వైద్యానికి కావాల్సిన మూలికలు, దినుసులు నాగర్‌కర్నూల్ సంత బజార్లో దొరుకుతాయి. చిరుధాన్యాల నుంచి ఆరుదుగా దొరికే అడవి గింజలు, ఆకులు, మూలికలు వరకు అన్ని ఒకే చోట లభ్యమవుతున్నాయి. ఆయర్వేదం వైద్యానికి అవసరమగు నేరేడు విత్తులు, నాగ కేశరములు, అడవి బాదామి, తిప్ప తీగ, తెల్లపట్టిక తదితర అన్నీ ఇక్కడే విక్రయిస్తుంటారు. దాదాపు వంద రకాల దినుసులు, చెట్ల వేర్లు, మూలికలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ముఖ్యంగా మన్ననూర్, హైదరాబాద్‌లోని బేగంబజార్, సికింద్రాబాద్, బెంగళూర్ వంటి దూర ప్రాంతాల నుంచి వీటిని తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నారు. దశాబ్దాలుగా అనేక రకాలైన దినుసులు, మూలికలు, వేర్లు విక్రయిసున్నారు. అంతే కాకుండా పూజా సామగ్రి విరివిగా లభిస్తాయి. బంగారు విక్రయ షాపులు కూడా ఇక్కడే ఉన్నాయి. దశాబ్దాలుగా బంగారు విక్రయాలకు నిలయంగా ఈ వీధి ఉంది. అరుదుగా దొరికే కొన్ని రకాల మూలికలు అక్రోట్ కాయలు, మాసి కాయలు, అడవి యాలకులు, నల్లవుసిరి, తిప్ప తీగ, నాగ కేసరములు, పట్టి వేరు, టానికాయలు, అడవి బుర్రెలు, అడవి చింత, కలబంధ, కటక రోహిణి, సకస్తూరి పసుపు, మాని పసుపు, నేల తాటి, నేల గుమ్మడి, ఎర్ర మద్ది, మర్రి ఊడలు, కురు వేరు, వజ కొమ్మలు, అతి వజ, ఆదొండ, దొండ పిండి, కంద చెక్కర, సూర్యనామ, సొంటి, కరక్కాయలు, వాయుకుంభాలు, గంటు భరంగి, ఆకుల కర్ర, సామ్రానీ జైపు, పిట్టకాయలు, సైదవ లవణం, తాటి బెల్లం, సపేదమెస్త్రీ, కర్జూర పండ్లు తదితర ఆయుర్వేదానికి సంబంధించి అడవి మూలికలు లభిస్తాయి. దినుసులు సారా పప్పు, అడవి జిలకర్ర, తోక మిరియాలు, అటుకు మామిడి పప్పు, ఎదురు బియ్యం, లవంగాల పట్ట, రాగి హంస, దులగొండి విత్తులు, నేరేడి విత్తులు, బాదం పప్పు, అడవి జిలకర్ర, ఆజా వాము, కుసుములు, కంది, పెసర, శనగ పప్పు గింజలు, ఆముదాలు, వడ్లు, చిల్ల గింజులతో పాటు చిరు ధాన్యాలు, వివిధ రకాల ఇతర పప్పుధాన్యాలు లభిస్తాయి. గింజల నుంచి మూలికల నుంచి తీసిన నూనెలు ఇప్ప నూనె, కానుగ నూనె, వేప నూనె, ఆవ, కుసుమ, నువ్వుల నూనెలు, ఆముదం నూనె, అల్వీన్ ఆయిల్ తదితర నూనెలు ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాలైన పుప్పు ధాన్యాలు, మూలికలు, వేర్లు, ఆయుర్వేదంకు అవసరమయ్యే అనేక రకాల మొక్కలు తీసుకొచ్చి విక్రయిస్తున్నాము. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాం. ప్రజలు వచ్చి తమకు అవసరం అయ్యే వాటినే కొంటారు. ఆన్లైన్లో కూడా మా దుకాణం సమాచారం వస్తుంది. – బొడ్డు వెంకటప్రసాద్, వ్యాపారి, సంతబజార్, నాగర్‌కర్నూల్ -
వన మూలికల వైద్యం
కురుపాం: శాస్త్రీయంగా రుజువు చేయకుండా.. వన మూలికల వైద్యం మంచిది కాదని ప్రభుత్వ వైద్యులు హెచ్చరిస్తున్నా.. మండల గిరిజనులు అత్యధిక శాతం వనమూలికల వైద్యంపై ఆధారపడుతున్నారు. వీరికి వనమూలికా వైద్యుల సేవా సంఘం (263/2016) భరోసా ఇస్తుండటం విశేషం. కురుపాం మండలంలో వనమూలికా వైద్యుల సేవా సంఘం 2016లో ఏర్పడింది. ఈ సంఘం స్ఫూర్తితో గిరిజన యువత జిజారుగూడ, వెంపటాపురం, పొక్కిరి, జరడ తదితర గ్రామాల్లో వనమూలికా వైద్యం చేస్తున్నారు. పక్షవాతం, ఆయాసం, ఉబ్బసం, పచ్చకామెర్లు, ఎర్ర కామెర్లు, స్త్రీల వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, పొత్తి కడుపునొప్పి, కాళ్లు, చేతులు తిమ్మెర్లు, క్షయ, క్యాన్సర్, చిన్నపిల్లల సమస్యలను వనమూలికా వైద్యంతో నయం చేస్తున్నారు. చీకటి కొండల్లో వనమూలికల సేకరణ కురుపాం మండలంలో ఒడిశా–శ్రీకాకుళం జిల్లాలకు సరిహద్ధు ప్రాంతమైన జరడ సమీపంలో చీకటికొండల్లోకి వనమూలికా వైద్యులు వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే ఉండి కావలసిన వన మూలికలను సేకరిస్తున్నారు. ఈ మొక్కలను తమ ఇంటి సమీపంలో నాటి వనమూలికలతో మందులను తయారు చేసి తక్కువ ఖర్చుతో పంపిణి చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి వనమూలికా వైద్యులను ప్రభుత్వం ఆదుకోవాలి. సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో వనమూలికలతో తయారు చేసిన మందుల్ని అందిస్తున్నారు. ప్రభుత్వం ఆధునాతన పరికరాలు మంజూరు చేస్తే వనమూలికల మందుల్ని తయారు చేస్తాం. – బిడ్డిక తెలుంగు,జుజారుగూడ, తిత్తిరి పంచాయతీ, కురుపాం మండలం వన మూలికలతో ప్రమాదం ఎలాంటి పరిశోధన జరపకుండా వినియోగిస్తున్న వన మూలికల మందులతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వనమూలికా వైద్యం ద్వారా వ్యాధులు నయం కావచ్చు. కానీ వాటిపై పరిశోధన జరగాలి. వాటితో ఎలా వ్యాధులు నయం అవుతున్నాయో తెలియాలి. అనంతరం వ్యాధిగ్రస్తులు వనమూలికా వైద్యం చేయించుకోవచ్చు. లేకుంటే అధిక మోతాదు వినియోగం వల్ల దుష్పప్రభావం కలగవచ్చు. – డాక్టర్ వారణాసి గౌరీశంకరరావు,సూపరింటెండెంట్, సామాజిక ఆరోగ్య కేంద్రం, కురుపాం -
జీసీసీ బ్రాండ్ బాజా
సాక్షి, హైదరాబాద్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) హెర్బల్ ఉత్పత్తులతో మార్కెట్లోకి అడుగు పెడుతోంది. హెర్బల్ సబ్బులు, గ్లిజరిన్ సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం యంత్రాలను సిద్ధం చేసుకున్న జీసీసీ.. యూనిట్ల ఏర్పాటులో నిమగ్నమైంది. ఉత్పత్తుల తయారీలో ఆయూష్ శాఖ సహకారాన్ని తీసుకోవా లని నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖతో అవగాహ న కుదుర్చుకోనుంది. హెర్బల్ ఉత్పత్తులకు సంబంధించి ముడి సరుకులో మూలికల వాడకంపై ఆయూష్ యంత్రాంగం సూచనలు చేయనుంది. ఏయే ఉత్పత్తిలో ఎంత మోతాదులో మూలికలు వినియోగించాలో అందుకు సంబంధించి ఆయూష్ అధికారులు ఫార్ములా ఖరారు చేస్తారు. ప్రస్తుతం జీసీసీ ద్వారా విక్రయించే తేనెకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో హెర్బల్ ఉత్పత్తులను కూడా అదే స్థాయిలో తీసుకొచ్చేందుకు, దేశీయ మార్కెట్లో తన బ్రాండును విస్తృతం చేసేందుకు సరికొత్త పంథాతో జీసీసీ ముందుకెళ్తోంది. గిరి నేచర్.. గిరి గోల్డ్.. జీసీసీ సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలకు సహజసిద్ధమైన పేర్లను అధికారులు సూచిస్తున్నారు. గిరి నేచర్ పేరుతో సౌందర్య సబ్బులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో అలోవెరా, బొప్పాయి, నీమ్ పేర్లతో మూడు రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. గిరి గోల్డ్ పేరుతో గ్లిజరిన్ సబ్బులు రానున్నాయి. వీటితో పాటు గిరి డిటర్జెంట్, గిరి నేచర్ షాంపూలూ మార్కెట్లోకి తెచ్చేందుకు జీసీసీ సిద్ధమవుతోంది. జీసీసీ ఉత్పత్తులకు క్షేత్రస్థాయిలో డిమాండ్ ఉంది. ప్రస్తుతం తయారు చేస్తున్న ఉత్పత్తులను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. గురుకులాల్లో రూ.250 కోట్ల టర్నోవర్‌కు అవకాశం ఉందని జీసీసీ భావిస్తోంది. గిరిజన యువతకు ప్రాధాన్యం తయారీ కేంద్రాల్లో స్థానిక గిరిజన యువతకు అవకాశం కల్పించనున్నారు. మార్కెటింగ్ రంగంలోనూ గిరిజన యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వచ్చే నెలలో ఈ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జీసీసీ జనరల్ మేనేజర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
కృత్రిమం టు ప్రకృతి
హెర్బల్ ఉత్పత్తులు కండిషనర్‌తో కలగలిసి గాఢమైనదాన్నంటూ ఒగలుపోతూ ప్రొటీన్‌తో చిక్కనై జుట్టును నిగారింపజేస్తానంటూ షాంపూలు గొప్పలకు పోయాయి. గొడవచేశాయి. అంతలోనే ఏమైందో ఏమోగానీ... శీకాకాయ సహిత కుంకుడుకాయ పులుసే రూపుమార్చుకొని మళ్లీ బాత్రూమ్ అరుగుమీద మరోమారు ప్రత్యక్షమౌతోంది. పళ్లు తోమడం కోసం పేస్ట్ వంక చూడటానికి కను గుడ్డు కనుకొనలకు కదిలే లోపే ... వనమూలికా వజ్రదంతి అక్కడ దర్శనమిస్తోంది. స్వాభావిక సాంప్రదాయిక సహితమైన ఆ వస్తువులు పతంజలి ప్రాడక్ట్ అనో, హెర్బల్ కంజ్యూమర్ గూడ్ అనో... విపణి వీధుల్లో ఇప్పుడు ప్రతిరోజూ ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తున్నాయి. కనువిందు చేస్తున్నాయి. దాంతో... ప్రతి రోజూ సెల్వార్ కమీజ్ చున్నీ దుపట్టాలతో కనిపించే అమ్మాయి అకస్మాత్తుగా పరికిణీ పావడా, పట్టు వోణీ, అంచు నిండా జరీవిరి తీగలను కవిగాంచకపోయినా.... కన్సూమ‘రవి’ గాంచుతున్నాడు. న్యాచురల్, హెర్ ‘బల్’ థ్రిల్లింతలు కలిగిస్తున్న ఆ ప్రోడక్ట్‌ల తీరు తెన్నులు... ట్రెండీ వన్నెలపై ప్రత్యేక కథనమిది. దీప్తికి చిన్నప్పుడు తలంటు స్నానమంటే నాయనమ్మ కుంకుడు కాయలు, సీకాకాయ పొడితో తలరుద్ది స్నానమే! పెరుగుతున్న వయసు, మారిన కాలానికి తగ్గట్లు తరువాత షాంపూలు, శాషేలకు మారింది. ఇప్పుడు నాలుగు పదుల వయసొచ్చి, ఇద్దరు ఆడపిల్లల తల్లి అయ్యాక తనకూ, పిల్లలకూ తల స్నానమంటే దీప్తి ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, అపార్ట్మెంట్లో బోర్ వాటర్, ఉత్తిపుణ్యానికే ఊడిపోతున్న జుట్టు మధ్య వారానికి రెండుసార్లయినా తప్పని తలస్నానం కోసం రకరకాల మార్గాలు అన్వేషించారు. భూమి గుండ్రంగా ఉన్నట్లు ఇప్పుడు మళ్ళీ ‘హెర్బల్’ ఉత్పత్తుల వైపు మొగ్గుతున్నారు. కాకపోతే, కుంకుడు కాయలు కొట్టి, నురుసు పోసుకొనే తీరిక, ఓపిక లేకపోవడంతో - కేశాలకు నష్టం చేయని హెర్బల్ షాంపూలు వాడడం మొదలుపెట్టారు. చిన్నప్పుడు ఆయుర్వేద వనమూనికలున్న ‘వజ్రదంతి’ పళ్ళపొడి వాడి, పెద్దయ్యాక ఖరీదైన టూత్‌పేస్ట్‌లకు మారిన విశాఖపట్నం వాసి యాభై ఏళ్ళ శ్రీరామచంద్రమూర్తికి పంటి మీద ఎనామిల్ పోయి, ఏది నోట్లో పెట్టుకొన్నా పళ్ళు జివ్వున లాగేస్తున్నాయి. అందుకే, ఈ పంటి తీపులు తగ్గించుకోవడానికి వీలుగా మళ్ళీ చిన్నప్పటి వనమూలికల బాటపట్టారు. ఉదయాన్నే పళ్ళు తోముకోవడానికి హెర్బల్ టూత్‌పేస్ట్‌లను చేతపట్టారు. ఏడున్నర పదులు దాటిన విజయవాడ విఠలేశ్వరమ్మ గారు రోజూ ఉదయాన్నే ఆరోగ్యం కోసం తీసుకొనే తేనె కోసం పెద్ద సంస్థల ప్రొడక్ట్‌లను ఇప్పుడు కాదంటున్నారు. కొడుకుకి చెప్పి, అడవి నుంచి గిరిపుత్రులు సేకరించిన ఉత్పత్తులు అమ్మే గిరిజన్ స్టోర్స్ నుంచే ఒకప్పటిలా తేనె తెప్పించుకుంటున్నారు. తిరుపతిలో ఉంటున్న వేణుగోపాలరావు ఇంట్లో ఇప్పుడు పిల్లల బిస్కెట్ల దగ్గర నుంచి ఇంట్లో వాడే గోధుమ పిండి, వగైరా దాకా ప్రతీదీ ‘పతంజలి’ హెర్బల్ ప్రొడక్టే! దేశమంతటా... ‘హెర్బల్’ హవా! ఒక్క తెలుగునాటే కాదు... ఇప్పుడు దేశమంతటా ఇదే పరిస్థితి. హెర్బల్ ప్రొడక్ట్‌లదే హవా! అనారోగ్యాలు, రకరకాల శారీరక సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్ళీ ఒకప్పటి దేశవాళీ ఆరోగ్య, ఆహార విధానాలను జనం అక్కున చేర్చుకుంటున్నారు. పర్యావరణ పరిస్థితులు, ఆహార, విహారాల్లోని సమస్యలన్నిటికీ ఔషధ ఉత్పత్తులే పరిష్కారమని నమ్ముతున్నారు. వెరసి, ‘త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగదారుల ఉత్పత్తుల’ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ - ఎఫ్.ఎం.సి.జి) విభాగంలో ఇప్పుడు హెర్బల్ ప్రొడక్ట్‌ల అమ్మకాలు తారాపథానికి దూసుకుపోతున్నాయి. నిజానికి, మన దేశంలో మొదటి నుంచి ఆయుర్వేద ఉత్పత్తులు, ఔషధ మూలికల ఉత్పత్తులకు పాపులారిటీ ఎక్కువే. ఆధునిక యుగంలో మధ్యలో కొంత వాటి ప్రాభవం తగ్గినట్లు అనిపించినా, ‘నేచురల్’ పద్ధతిలో అందం, ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరిగిన ఈ తరం మళ్ళీ ప్రాచీన విజ్ఞానానికే ఓటేస్తోంది. గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయిన ఆరు నెలల కాలంలో వివాదాస్పద బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని ‘పతంజలి’ సంస్థ ఉత్పత్తుల అమ్మకం ఏకంగా 64 శాతం పెరిగింది. ఇక, డాబర్, హిమాలయా లాంటి ఇతర ఔషధ ఉత్పత్తుల సంస్థల అమ్మకాలు కూడా మార్కెట్లో రెండంకెల్లో పెరిగాయి. టూత్పేస్ట్లు, షాంపూలు, జుట్టుకు రాసుకొనే నూనెలు - ఇలా అన్నింటిలోనూ ఇదే వరుస. కీలకమైన కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ విభాగాలన్నిటిలో వీటి మార్కెట్ వాటా బాగా పెరుగుతోందని మార్కెట్ రిసెర్చ్ సంస్థ ‘నీల్సెన్’ కూడా లెక్కలతో సహా తేల్చింది. ఎందుకీ కొత్త మోజు! ఇంతకీ ఈ హెర్బల్ ప్రొడక్ట్‌ల అమ్మకాలకు ఉన్నట్టుండి ఇంత గిరాకీ ఎలా వచ్చినట్లు? దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. రసాయనాలతో తయారయ్యేవాటితో పోలిస్తే ఈ ఉత్పత్తుల్లో సహజ ముడి పదార్థాలు వాడతారు. ధర కూడా చౌక. పైగా, సైడ్ ఎఫెక్ట్లు ఉండవని జనానికి నమ్మకం. ఆరోగ్యపరంగా లాభాలు సరేసరి. అందుకే, ప్రస్తుతం ఈ ‘నేచురల్’ ఉత్పత్తులకు తెగ పాపులారిటీ, జనంలో మోజు! అందుకు తగ్గట్లే ఇప్పుడు ఏ పచారీ సామాన్ల కొట్టుకు వెళ్ళినా, ఈ ‘నేచురల్’ ప్రొడక్ట్‌లు తెగ కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉన్న డాబర్, ఇమామి, మ్యారికో లాంటి భారతీయ సంస్థల ఉత్పత్తులు ఎలాగూ ఉంటాయి. కొత్తగా ఆధ్యాత్మిక రంగంలోని బాబా రామ్‌దేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ లాంటి వారి ‘పతంజలి’ తదితర సంస్థల డైలీ యూజ్ ప్రొడక్ట్‌లు దర్శనమిస్తున్నాయి. మన ‘వన’ బాటలోకి... మల్టీ నేషనల్స్ విశేషం ఏమిటంటే, ఒకప్పుడు కేవలం చిన్న సంస్థలనుకున్న ఈ హెర్బల్ ప్రొడక్ట్ సంస్థలన్నీ ఇప్పుడు ఆయుర్వేదేతర సంస్థల మార్కెట్ వాటాను నెమ్మదిగా తమ వశం చేసుకుంటున్నాయి. తాజా గణాంకాలు ఆ సంగతి స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు, ‘ఫేస్ వాష్’ లాంటి ఉత్పత్తుల విభాగంలో ఆయుర్వేదేతర ప్రొడక్ట్స్ అమ్మకాల పెరుగుదల ఒక్క ఏడాదిలోనే 21 శాతం నుంచి 16 శాతానికి పడిపోయింది. ఇక, షాంపూల లాంటి వాటిలో అయితే ఆయుర్వేద బ్రాండ్ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ‘భారతీయ మార్కెట్ రిసెర్చ్ బ్యూరో (ఐ.ఎం.ఆర్.బి) ఇంటర్నేషనల్’ సర్వే ఈ షాంపూల కథ బయటపెట్టింది. ఈ దెబ్బకు ఇప్పటి దాకా మార్కెట్‌ను శాసించిన బడా సంస్థలు కుదేలవుతున్నాయి. దాంతో, అవి కూడా మన వనమూలికలతో ‘నేచురల్’, ‘ఆయుర్వేద’, ‘హెర్బల్’ బాట పట్టాల్సి వస్తోంది. గతంలో ‘ప్రామిస్’, ‘యాంకర్’, ‘అమర్’ లాంటి స్థానిక టూత్‌పేస్ట్‌లన్నీ మల్టీ నేషనల్ కంపెనీల చేతిలో నలిగిపోయాయి. కానీ ఇప్పుడు అచ్చంగా సీన్ రివర్స్ అయింది. దంత సంరక్షణ ఉత్పత్తుల్లో ‘పతంజలి’ వారి ‘దంత కాంతి’ టూత్‌పేస్ట్ నుంచి పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి ‘కాల్గేట్ - పామోలివ్’ వారు ‘వేద్ శక్తి’తో ముందుకు రావాల్సి వచ్చింది. ఉప్పు, బొగ్గుపొడితో పళ్ళు తోముకొనే భారతీయ తరహా విధానాన్ని ఒకప్పుడు తెగ విమర్శించిన బహుళ జాతి సంస్థలు ఇప్పుడు ‘యాక్టివ్ సాల్ట్ అండ్ చార్కోల్ టూత్‌పేస్ట్’ అంటూ అచ్చం అవే తయారుచేస్తున్నాయి. దీన్నిబట్టి పరిస్థితి ఎంత ‘నేచురల్’గా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఆహార ఉత్పత్తుల్లోనూ... అదే వరస! కొన్నాళ్ళ క్రితం దాకా కేవలం చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ, దంత సంరక్షణ లాంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ విషయంలోనే ఈ నేచురల్ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ ఉండేది. కానీ, ఇటీవలి కాలంలో ఆహారం, పానీయాలు, గృహసంరక్షణ ఉత్పత్తుల విషయంలోనూ ‘నేచురల్’ వాటి వైపే జనం మొగ్గుతున్నారు. బాబా రామ్‌దేవ్ ‘పతంజలి’ ప్రొడక్ట్స్ కేవలం ఒక్క ఏడాదిలో దాదాపు 80 శాతం మేర దేశంలో చొచ్చుకుపోవడమే అందుకు నిదర్శనం. బిస్కెట్లు, పానీయాల దగ్గర నుంచి నెయ్యి, నూనె, తేనె దాకా, గోధుమ పిండి నుంచి రకరకాల పిండ్ల దాకా అన్నింటిలో దేశవాళీ ఉత్పత్తిగా ‘పతంజలి’ ప్రత్యక్షమవుతోంది. సర్వసాధారణంగా మార్కెట్లో పాతుకుపోయిన బ్రాండ్లను కాదని, ఇలా దేశవాళీ సరుకుల వైపు జనం అంత తొందరగా రారు. కానీ, ఇప్పుడు ఆ అసాధరణ సంఘటనే జరుగుతోంది. అదే ఇప్పుడు మహా మహా మార్కెట్ పండితుల్ని సైతం ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. ‘పతంజలి’ ప్రొడక్ట్స్ లాంటివి ఇక్కడ నుంచి కెనడా, అమెరికా, మారిషస్, బ్రిటన్ లాంటి అనేక దేశాలకు కూడా ఎగుమతి అవుతుండడం గమనించాల్సిన విషయం. వరుస చూస్తుంటే - తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలిలో కూడా కాలుష్యం పెరిగిపోతోందని వాపోతున్న ఆధునిక జీవన పరిస్థితుల్లో, జీవనశైలి రోగాలు పెరిగిపోతున్న రోజుల్లో - ఈ ‘నేచురల్’, ‘హెర్బల్’ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు రోజు రోజుకూ ఇంకా ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. అదే జరిగితే, ఇప్పటికే సాంప్రదాయిక హెర్బల్ ఉత్పత్తుల రంగంలో పాతుకుపోయిన సంస్థలకూ, పరిశోధన - నూతన ఉత్పత్తుల రూపకల్పన విభాగంలో బలమున్న సంస్థలకూ భవిష్యత్తు మరింత ఉజ్జ్వలంగా ఉండనుంది. మార్కెట్లో ఎటుచూసినా అప్పుడు ‘నేచురల్’ ప్రొడక్ట్స్లే! వాటిలో మెరుగైనవి ఏమిటనే కొత్త ప్రశ్న మొదలవుతుంది. - రెంటాల ఎందెందు వెతకి చూసిన... అందందే! ఇవాళ సామాన్య జనంతో పాటు, స్టాక్ మార్కెట్ కంపెనీల జాబితాలో లేకపోయినా మార్కెట్ నిపుణులు కూడా ఆసక్తిగా చూస్తున్న సంస్థ - ‘పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్’ (పి.ఎ.ఎల్). తలనొప్పి, కీళ్ళనొప్పులు, ఆస్త్మా, ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ లాంటి అన్నిటికీ మందులు అందిస్తోంది. చిత్రం ఏమిటంటే, ఒక్క ఆయుర్వేదం మందుల్లోనే కాదు... ‘ఇందుగలడందు లేడని సందేహంబు వలదు’ అన్నట్లుగా పప్పు ధాన్యాలు, మసాలా దినుసులు, చ్యవన్‌ప్రాశ్, టూత్పేస్ట్లు, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, ఇన్స్టంట్ నూడుల్స్, టీ, జామ్, కార్న్‌ఫ్లేక్స్, చివరకు వృద్ధాప్యం కనపడనివ్వని యాంటీ ఏజింగ్ సౌందర్య ఉత్పత్తులు - ఇలా అన్నింటా ‘పతంజలి’ ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్రత్యక్షం. పదేళ్ళ క్రితం 2006లో రిజిస్టరైన ‘పతంజలి ఆయుర్వేద్’ సంస్థ ఏకంగా 350 రకాల ఉత్పత్తులు చేస్తోంది. చేతిలో 11 వేల పైగా సొంత దుకాణాలు, 20 వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారు. హరిద్వార్ శివార్లలోని 150 ఎకరాల ప్రాంగణంలోని ఫ్యాక్టరీ నుంచి రోజూ 300 ట్రక్కుల సరుకులు రవాణా అవుతుంటాయి. సాంకేతికంగా చూస్తే - యోగా గురువు, టీవీ ప్రముఖుడైన బాబా రామ్‌దేవ్‌కు ఈ సంస్థలో వాటా లేదు. కానీ, నడిపేది ఆయన సహపాఠీ, శిష్యుడైన ఆచార్య బాలకృష్ణే. అలాగే ఈ ‘పతంజలి’ బ్రాండ్‌కు ఇంత పాపులారిటీ వచ్చిందంటే, అదంతా దేశవ్యాప్తంగా తన యోగా శిబిరాల్లో రామ్‌దేవ్ చేసిన మార్కెటింగ్ చలవే. దానికి తోడు బయటి ప్రొడక్ట్‌ల కన్నా వీటి రేటు కూడా సగటున 10 నుంచి 30 శాతం తక్కువ. అది కూడా కొనేవాళ్ళకు స్పెషల్ ఎట్రాక్షన్. అందుకే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఏకంగా రూ. 2 వేల కోట్ల ఆదాయం సంపాదించింది. లాభం సంగతికొస్తే, 2012 మార్చి నాటికి కోటి డాలర్ల పైగా ఉన్న ‘పతంజలి’ నికర లాభం, ఈ ఏడాది మార్చి నాటికి పదిన్నర కోట్ల డాలర్లకు దూసుకుపోయింది. రాగల రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని మరో 7 రాష్ట్రాల్లో కనీసం 1200 ఎకరాల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని ‘పతంజలి’ ప్లాన్. అందులో ఒక ఫ్యాక్టరీ అచ్చంగా విదేశాలకు ‘పతంజలి’ ఉత్పత్తుల ఎగుమతికే! అప్పటి విజ్ఞానం... ఇప్పటి లేటెస్ట్ ఫ్యాషన్! ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద, వన మూలికల విజ్ఞానం భారతీయుల సొంతం. వాటిని జీవితంలో భాగం చేసుకొన్న జీవనశైలీ ఉండేది. క్రమంగా వాటికి దూరమవుతూ వచ్చాం. అయితే, ఇటీవల కొద్ది కాలంగా బాబా రామ్‌దేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ లాంటి ఆధునిక యోగ గురువులు ఆయుర్వేదం, యోగాలను ఆధ్యాత్మిక రంగానికి కొనసాగింపుగా పాపులర్ చేశారు. అదే సమయంలో పాశ్చాత్య వైద్య విధానంలోని లోపాలనూ, కొన్నిసార్లు జరుగుతున్న మోసాలనూ, ఆ దుష్ర్పభావాలనూ రామ్‌దేవ్ లాంటి వారు పదేపదే ప్రస్తావిస్తూ, జనంలోకి బాగా ప్రచారం చేశారు. దానికి తోడు భారతీయ సంస్కృతి, సంప్రదాయం, దేశీయత లాంటివి ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం హోరుకు సరిపోయాయి. ఖరీదైన మల్టీ నేషనల్ ప్రొడక్ట్‌ల కన్నా, చిన్నప్పుడు తాతయ్య, నాయనమ్మ చెప్పిన మన వనమూలికల విజ్ఞానంతో తయారైన ఈ హెర్బల్ ప్రొడక్ట్‌లు మిన్న అనే భావం మామూలు మధ్యతరగతి అందరిలో కలుగుతోంది. ఇవాళ్టి లేటెస్ట్ ‘హెర్బల్’ హవా వెనక ఇంత కథ ఉంది! ఈ లెక్కలే సాక్ష్యం! భారతదేశంలో ఇవాళ ప్యాకేజ్డ్ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్ విలువ దాదాపు రూ. 3.2 లక్షల కోట్లు హెర్బల్ ప్రొడక్ట్స్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఒక్క ‘పతంజలి’ బ్రాండ్ ఈ ఎఫ్.ఎం.సి.జి. మార్కెట్లో 5 శాతం పైగా వాటా చేజిక్కించుకుంది. 2020 నాటి కల్లా అది 13 శాతానికి పెరుగుతుందని అంచనా. అదే పద్ధతిలో మిగిలిన హెర్బల్ ఉత్పత్తి సంస్థల పురోగతి సరేసరి గత ఏడాది నవంబర్ నుంచి టీవీలో యాడ్స్ కూడా మొదలెట్టిన ‘పతంజలి’ అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి దాకా అయిదు నెలల్లో యాడ్స్‌కే దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు పెట్టినట్లు పరిశ్రమ వర్గాల అంచనా. ఈ సొంత ఉత్పత్తులన్నిటికీ తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాబా రామ్‌దేవ్ మాత్రం రూ. 60 కోట్లే ఖర్చు చేశామంటున్నారు గడచిన నాలుగేళ్ళలో ‘పతంజలి’ పెరుగుదల ఏకంగా 1011 శాతం అన్న లెక్క చూశాక, ఆయుర్వేదేతర సంస్థలకు దిమ్మదిరిగిపోయింది.