అందానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేనటి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రమంగా జిమ్ చేస్తూ, బలవర్ధక ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చే రకుల్ ప్రీత్ తాజాగా ఒకటీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అసలు ఏంటీ ఫెన్నెల్ టీ, దీని ప్రయోజనాలేంటి అనేది హాట్ టాపిక్‌గా మారింది. మరి ఫెన్నెల్ టీతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?
ఫెన్నెల్ టీ అంటే సోంపు గింజలతో తయారు చేసే టీ. దీన్నే ఫెన్నెల్ సీడ్స్ వాటర్, లేదా ఫెన్నెల్-ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని కూడా పిలుస్తారు. ప్రతిరోజూ ఉదయం ఈ సోంపు గింజల నీళ్లను తీసుకోవడం ద్వారా అనేక అరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సోపు గింజలను నీటిలో వేసి కాచడం ద్వారా ఫెన్నెల్ టీని తయారు చేస్తారు. దీని రుచి చిరు చేదుగా, చక్కటి సువాసనతో ఉంటుంది. శతాబ్దాలుగా దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
ఫెన్నెల్ టీ ఎలా తయారు చేయాలి
ఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఫెన్నెల్ గింజలను తీసుకుని వాటిని రెండు కప్పుల నీటిలో మరిగించాలి. ఆ నీటిని వడకట్టి చల్లబడిన తరువాత గానీ, వేడి వేడిగా కానీ సేవించవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో ఫెన్నెల్ టీ తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
ఫెన్నెల్ టీ లాభాలు
సోంపు గింజలలో ఉండే విటమిన్ సీ ఐరన్, ఖనిజాలు నిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. సోంపు గింజల నీటిని తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి రక్షణ అందిస్తుంది. ఫెన్నెల్ టీ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సోంపు గింజలలో అనెథోల్ వంటి నూనెలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జీర్ణక్రియలో సాయపడతాయి. సోంపు గింజలలో కార్మినేటివ్ గుణాలు ప్రేగు కదలికలను మెరుగు పరుస్తాయి. జీర్ణశయాంతర ప్రేగులలోని కండరాలను ప్రేరేపించి, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో సాయపడతాయి. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అజీర్ణం, గుండెల్లో మంటకు ఉపశమనం లభిస్తుంది.
మధుమేహులకు లేదా డయాబెటిస్ రిస్క్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. సోంపు గింజల వాటర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. వయస్సు-సంబంధిత మచ్చలు తగ్గుతాయి. కంటి సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.
సోంపు గింజలలో పొటాషియం ఉంటుంది. సోంపు గింజలలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయ పడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఫెన్నెల్ టీ పీరియడ్స్ క్రాంప్‌ల నుండి ఉపశమనం పొందడంలో సహాయ పడుతుంది. ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కండరాలకు శాంతి కలుగుతుంది. దీంతో ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment