ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,హిమాయతనగర్(హైదరాబాద్): ‘అమెరికాలో హెర్బల్ ప్రొడక్ట్స్, పౌడర్‌కు చాలా డిమాండ్ ఉంది.. ఇండియాలో అయితే తక్కువ ధరకే వస్తుంది.. మాతో చేయి కలిపితే మీకు కోట్లు వచ్చేలా వ్యాపారం చేపిస్తాము’ అంటూ నగరానికి చెందిన వ్యాపారికి సైబర్ నేరగాళ్లు వల వేశారు. అమెరికాకు సరుకు రవాణా, కోట్లలో లాభాలు అనే మాటలకు వ్యాపారి నేరగాళ్ల బుట్టలో పడ్డాడు. గాం«దీనగర్‌లో ‘ప్రైమ్ హెర్బల్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో హెర్బల్ ప్రొడక్టుల వ్యాపారం చేస్తున్న వ్యాపారికి ఇటీవల యూఎస్ ఫోన్ నంబర్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేశాడు. (చదవండి: కొంతకాలంగా యువతితో ప్రేమ.. స్నేహితులతో కలిసి ప్రియుడు.. )
హెర్బల్‌కు అమెరికాలో మంచి డిమాండ్ ఉందని, పౌడర్, ప్రొడక్ట్స్ ఏవైనా సరే వేలల్లో ఖరీదు ఉంటుందన్నాడు. కొద్దిరోజుల క్రితమే ఇండియా నుంచి సరుకు పంపే మా మనిషి చనిపోయాడని నమ్మించారు. మీకు ఆశక్తి ఉంటే మాతో చేతులు కలపొచ్చన్నారు. దీనికి సరే అన్న వ్యాపారి కొన్ని పౌడర్ ప్యాకెట్స్‌తో ఢిల్లీలోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి కలసి ఆ పౌడర్ ప్యాకెట్స్‌ను తీసుకుని ఇక్కడి రేటును చెల్లించాడు. మరుసటి రోజు కాల్ చేసి మంచి ప్రీమియం క్వాలిటీని పంపారన్నాడు.
ఈసారి పెద్ద మొత్తంలో కావాలన్నాడు. దీంతో సుమారు రూ. 34 లక్షల విలువైన పౌడర్ తదితర ప్రొడక్ట్స్‌ను వాళ్లు చెప్పిన ఢిల్లీ అడ్రస్‌కు పంపాడు. రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం రావడం లేదు. ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయతి్నంచినా స్విచ్చాఫ్ వస్తుండటంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. దీంతో శుక్రవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment