Balkrishna
-
అక్రమాస్తుల కేసు.. ఉద్యోగం నుంచి బాలకృష్ణ తొలగింపు ?
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శివ బాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించే అంశంపై పురపాలక ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోపక్క బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన పలువురు ఉద్యోగులకు ఏసీబీ నోటీసులిచ్చింది. ఉద్యోగులతో పాటు బాలకృష్ణతో అక్రమ లావాదేవీలు జరిపిన వారిని ఏసీబీ విచారించనుంది. ఇప్పటికే శివబాలకృష్ణ బినామీలు, బ్యాంకు లాకర్లపైన ఏసీబీ దృష్టి పెట్టింది. కాగా, శివబాలకృష్ణను 10రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ వేసిన కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో కోర్టు విచారించనుంది. కోర్ట బాలకృష్ణను కస్టడీకి ఇస్తే ఆయన జరిపిన లావాదేవీలు, బినామీలకు సంబంధించిన వ్యవహారాలు తదితర అంశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. బాలకృష్ణ చెప్పే విషయాల ఆధారంగా ఈ కేసులో మరికొందరి అరెస్టులు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శివబాలకృష్ణ ఇంటిపై రెయిడ్స్ జరిపిన ఏసీబీ ఆయన ఆదాయానికి మించి ఆస్తులను పోగేసినట్లు తేల్చింది. దీంతో అక్రమాస్తుల కేసులో ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే ఆయన భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఏసీబీకి బాలకృష్ణ భాదితుల క్యూ.. అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్టయిన తర్వాత ఆయన బాధితులు ఒక్కొక్కరుగా ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. లే అవుట్లకు, నిర్మాణాలను అనుమతులిచ్చేందుకుగాను తమతో శివబాలకృష్ణ జరిపిన లావాదేవీలపై వారు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఏసీబీని కోరుతున్నారు. ఇదీచదవండి.. కేటీఆర్ తన భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి -
‘అద్భుతం మహా అద్భుతం’ ,హిమాలయాల్లో అరుదైన మూలికలు
హరిద్వార్: ఆచార్య బాలకృష్ణ నేతృత్వంలోని పతంజలి బృందం హిమాలయాల్లో అరుదైన మూలికలను కనుగొంది. హిమాలయాలలోని కొన్ని అధిరోహించలేని, చేరుకోలేని శిఖరాలను సైతం ఎక్కి ఈ మూలికలను గుర్తించినట్లు ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, పతంజలి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఇందుకు సంబంధించి ఏర్పాటైన ఒక స్వాగత కార్యక్రమం చిత్రాన్ని తిలకించవచ్చు. ఈ కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం)ప్రిన్సిపాల్ కల్నల్ అమిత్ బిష్త్‌తో సహా పలువురు పాల్గొన్నారు. అరుదైన విజయాన్ని సాధించినందుకుగాను పతంజలి బృందాన్ని పలువురు ప్రశంసించారు. ఇది గర్వకారణ చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. -
ఎల్జీ బాలకృష్ణన్- ఇప్కా ల్యాబ్స్ జూమ్
ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 187 పాయింట్లు పెరిగి 40,332కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,831 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించింది. ఈ బాటలో క్యూ3పై అంచనాలు పెరగడంతో ఈ ఆటో విడిభాగాల కంపెనీ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క క్యూ2లో ఆకర్షణీయ పనితీరు చూపనున్న అంచనాలతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఇప్కా ల్యాబొరేటరీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎల్జీ బాలకృష్ణన్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్జీ బాలకృష్ణన్ నికర లాభం దాదాపు 24 శాతం క్షీణించి రూ. 28 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 412 కోట్లను తాకింది. అయితే ఇటీవల ఆటో రంగం జోరందుకోవడంతో క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో మరింత మెరుగైన పనితీరును చూపవచ్చన్న అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎల్జీ బాలకృష్ణన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 272 వద్ద ట్రేడవుతోంది. ఇప్కా ల్యాబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఇప్కా ల్యాబొరేటరీస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించనున్న అంచనాలు పెరిగాయి. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఇప్కా ల్యాబ్ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 2,319 సమీపంలో సరికొత్త గరిష్టానికి చేరింది. ప్రస్తుతం కొంత వెనకడుగు వేసి 5.5 శాతం లాభంతో రూ. 2,240 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో కంపెనీ నికర లాభం మూడు రెట్లు జంప్‌చేసి రూ. 129 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 41 శాతం పెరిగి రూ. 1,546 కోట్లకు చేరింది. కాగా.. యాంటీమలేరియల్ బిజినెస్‌లో గ్లోబల్ ఫండ్ నుంచి మద్దతు లభించడం, యూఎస్ఎఫ్డీఏ నుంచి దిగుమతులపై అడ్డంకులు తొలగిపోవడం వంటి అంశాలు కంపెనీ పనితీరుకు దోహదపడగలవని ఆగస్ట్ నివేదికలో రేటింగ్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
బాలకృష్ణ - గ్రీవ్స్ కాటన్.. రివర్స్ గేర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆఫ్‌రోడ్ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు నిరాశపరచడంతో ఇంజిన్ల తయారీ దిగ్గజం గ్రీవ్స్ కాటన్ కౌంటర్లో సైతం అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో డీలా పడ్డాయి. వివరాలు చూద్దాం.. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ నికర లాభం 26 శాతం క్షీణించి రూ. 132 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం సైతం 21 శాతం నీరసించి రూ. 943 కోట్లకు చేరింది. ఇబిటా 10 శాతం వెనకడుగుతో రూ. 240 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 1310 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1306 వరకూ నీరసించింది. గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో గ్రీవ్స్ కాటన్ రూ. 31 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 68 శాతం క్షీణించి రూ. 158 కోట్లకు పరిమితమైంది. ఈ కాలంలో రూ. 27 కోట్ల నిర్వహణ నష్టం ప్రకటించింది. గత క్యూ1లో రూ. 58 కోట్ల ఇబిటా నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ కాటన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.2 శాతం పతనమై రూ. 84 దిగువన ట్రేడవుతోంది. -
బాలయ్య ఎన్టీఆర్‌కు పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
-
బాలయ్య ఎన్టీఆర్‌కు పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితంపై వివాదస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఎవరు ఏమన్నా.. సినిమా తెరకెక్కించి తీరుతానని తేల్చిచెప్పారు రాం గోపాల్ వర్మ. తాజాగా విజయ దశమి రోజు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రారంభించనున్నట్టు వర్మ ప్రకటించారు. కొత్త ఏడాది జనవరి చివరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. లక్ష్మి పార్వతి తన జీవితంలో ప్రవేశించడాని కంటే ముందే ఎన్టీఆర్ మరణించే వారని, కానీ ఆమె ఆయన జీవితంలోకి వచ్చాక, లక్ష్మీస్ ఎన్టీఆర్ జీవితం ప్రారంభమైందని తెలిపారు. తిరుపతిలో అక్టోబర్ 19న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముంబైకు చెందిన వ్యాపారవేత్త బాల గిరితో పాటు మరికొంతమంది అతిథులు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా, తండ్రి ఎన్టీఆర్ జీవితం కథలోనే తాను ప్రధాన పాత్ర పోషిస్తూ బాలకృష్ణ.. ఎన్టీఆర్ సినిమాను చేస్తున్నారు. ఆ సినిమాకు డైరెక్టర్ క్రిష్. బాలకృష్ణ, ఎన్టీఆర్‌గా చేస్తున్న ఆ సినిమాకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పడికప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్లను పోస్టు చేస్తూ.. చిత్ర బృందం ఆ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్‌కు పోటీగా వస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో కోణాన్ని వర్మ స్పృశిస్తున్నట్టు తెలుస్తోంది. -
వాట్సాప్‌కు షాక్ : న్యూ లుక్‌తో కింభో రీలాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు గుండెల్లో గుబులు పుట్టించేలా కింభో మళ్లీ వార్తల్లోకొచ్చేసింది. ఈ నెలలోనే ఈ కింభో యాప్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ఖాతాలో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. కొత్త, ఆధునిక ఫీచర్లు కింభో యాప్ లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్నామంటూ ట్వీట్ చేశారు. కింభో యాప్‌ను ఆగష్టు 27, 2018 న ప్రారంభించనున్నామని బాలకృష్ణ ట్వీట్ చేశారు. ఈ యాప్ ట్రయిల్ వెర్షన్‌ను ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాదు లాంచింగ్‌కు ముందే యూజర్లు తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు. కాగా యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి సంస్థ వాట్సాప్‌కు పోటీగా కింభో పేరిట కొత్త స్వదేశీ మెసేజింగ్ తీసుకురానున్నట్టు ఈ ఏడాది మే 31న ప్రకటించారు. అచ్చం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో కింభో యాప్‌ను రామ్‌దేవ్ విడుదల చేశారని పతంజలి గ్రూప్ ప్రతినిధి ఎస్కే తిజారావాలా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సంస్కృతంలో కింభో అంటే ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? అనే అర్థాలు వస్తాయని ఈ సందర్భంగా తిజారావాలా తెలిపారు. అయితే సెక్యూరిటీ కారణాల రీత్యా గూగుల్ ప్లే స్టోర్ నుంచి కింభో అదృశ్యమైన సంగతి తెలిసిందే. T-1 स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं आप के विश्वास के लिए पतंजलि परिवार आपके प्रति कृतज्ञ है,आप स्वतंत्रता दिवस के पावन उत्सव के साथ डिजिटल आजादी का जश्न "किम्भो:" के नये और एडवांस फीचर्स के साथ मनाइये| किम्भो: ऐैप में कुछ सूक्ष्म न्यूनताएँ हो सकती है, उनके continues in T-2 pic.twitter.com/bWLk6x6x3Q — Acharya Balkrishna (@Ach_Balkrishna) August 15, 2018 -
ఫోర్బ్స్ లిస్ట్ లో 'బాలకృష్ణ'
సింగపూర్ : ప్రముఖ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న పతంజలి ఫోర్బ్స్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యోగా గురు రామ్ దేవ్ బాబా సహాయకుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణ ఫోర్బ్స్ లిస్ట్ లో తొలిసారిగా స్థానం సంపాదించారు. సుమారు రూ.16,000 కోట్లు సంపదతో వందమంది ధనవంతుల భారతీయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో 48వ స్థానంలో నిలిచారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న వినియోగ వస్తువుల సంస్థల్లో పతంజలి ఒకటని, దీని నికర విలువ ఆధారంగా, సంస్థలో 92 శాతం వాటాను కలిగివున్న బాలకృష్ణను ఎంపిక చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది. రామ్ దేవ్ కు పతంజలి సంస్థలో వాటాలున్నప్పటికీ , బాలకృష్ణ కార్యకలాపాలు నడిపే వ్యక్తి అనీ, కంపెనీ వాస్తవ బ్రాండ్ అంబాసిడర్ అని ఫోర్బ్స్ పేర్కొంది. గత సంవత్సరం 5,000 కోట్ల ఆదాయాన్ని సాధించిన పతంజలి ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా లయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 22.7 బిలియన్ డాలర్లతో దేశంలో అత్యంత ధనవంతులైన పది మందిలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.