​​​​అక్రమాస్తుల కేసు.. ఉద్యోగం నుంచి బాలకృష్ణ తొలగింపు ? | Telangana Govt To Remove Hmda Former Director Shiva Balakrishna | Sakshi
Sakshi News home page

అక్రమాస్తుల కేసు.. ఉద్యోగం నుంచి శివబాలకృష్ణ తొలగింపు ?

Published Mon, Jan 29 2024 3:15 PM | Last Updated on Mon, Jan 29 2024 8:14 PM

Telangana Govt To Remove Hmda Former Director Shiva Balakrishna - Sakshi

సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శివ బాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించే అంశంపై పురపాలక ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం.

మరోపక్క బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన పలువురు ఉద్యోగులకు ఏసీబీ నోటీసులిచ్చింది. ఉద్యోగులతో పాటు బాలకృష్ణతో అక్రమ లావాదేవీలు  జరిపిన వారిని ఏసీబీ విచారించనుంది. ఇప్పటికే శివబాలకృష్ణ బినామీలు, బ్యాంకు లాకర్లపైన ఏసీబీ దృష్టి పెట్టింది. 

కాగా, శివబాలకృష్ణను 10రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ వేసిన కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో కోర్టు విచారించనుంది. కోర్ట బాలకృష్ణను కస్టడీకి ఇస్తే ఆయన జరిపిన లావాదేవీలు, బినామీలకు సంబంధించిన వ్యవహారాలు తదితర అంశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. బాలకృష్ణ చెప్పే విషయాల ఆధారంగా ఈ కేసులో మరికొందరి అరెస్టులు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల శివబాలకృష్ణ ఇంటిపై రెయిడ్స్‌ జరిపిన ఏసీబీ ఆయన ఆదాయానికి మించి ఆస్తులను పోగేసినట్లు తేల్చింది. దీంతో అక్రమాస్తుల కేసులో ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే ఆయన భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. 

ఏసీబీకి బాలకృష్ణ భాదితుల క్యూ..

అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్టయిన తర్వాత ఆయన బాధితులు ఒక్కొక్కరుగా ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. లే అవుట్‌లకు, నిర్మాణాలను అనుమతులిచ్చేందుకుగాను తమతో శివబాలకృష్ణ జరిపిన లావాదేవీలపై వారు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఏసీబీని కోరుతున్నారు. 

ఇదీచదవండి.. కేటీఆర్‌ తన భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement