
హైదరాబాద్, సాక్షి: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణలో వేగం మరింత పెంచింది అవినీతి నిరోధక శాఖ(ACB). ఈ క్రమంలో విచారణకు రావాల్సిందేనంటూ బినామీలందరికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్‌కు ఏసీబీ లేఖ రాసింది.
శివబాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన భరత్, సత్యానారాయణ, భరణిలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆయనకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దర్యాప్తులో దొరికిన పత్రాల ఆధారంగా.. ప్రభుత్వ అనుమతి తీసుకుని ఆ ఐఏఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది.
ఇదిలా ఉంటే.. 2021-23 సంవత్సరాల మధ్య శివబాలకృష్ణ కోట్ల ఆస్తుల్ని కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఆ ఆస్తులన్నింటినీ ఆయన తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్ చేయించారు.ఈ క్రమంలో యాదాద్రిలో 57 ఎకరాల భూమిపై ప్రత్యేక విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment