ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లో టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న 40 మంది కార్మికులను కాపాడే రెస్క్యూ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రిల్లింగ్ మెషిన్ మళ్లీ మొరాయించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. టన్నెల్‌లోకి వెడెల్పైన స్టీల్ పైపులను పంపి చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారీ యంత్రంతో ఆరు రోజులుగా డ్రిల్లింగ్ చేస్తున్నారు.
టన్నెల్ డ్రిల్లింగ్ చేస్తూ శుక్రవారం ఆగిపోయిన యంత్రం రెండోది కావడం గమనార్హం. గురువారం ఒక యంత్రం డ్రిల్లింగ్ చేస్తూ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అధికారులు మూడో యంత్రాన్ని ఇండోర్ నుంచి వాయు మార్గంలో తీసుకువస్తున్నారు. ఈ యంత్రం శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకోనున్నట్లు సమాచారం.
కాగా, ఆదివారం(నవంబర్ 12) ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో చార్‌దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 4 కిలోమీటర్ల టన్నెల్‌లోని ఓ భాగం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తేన్న 40 మంది కార్మికులు టన్నెల్ కింద చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్, ఆహారపదార్థాలు, నీరు పంపిస్తున్నారు. ఇప్పటివరకు వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీచదవండి..ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు : హర్యానా హై కోర్టు
Comments
Please login to add a commentAdd a comment