సూపర్ సానిక్ బస్సు
హాలెండ్: బస్సు ప్రయాణమనగానే అందరికీ గుర్తుకొచ్చేది గంటల తరబడి ప్రయాణం. మధ్యలో మొరాయించడం. అయితే అందుకు భిన్నంగా అత్యంత వేగంగా రాకెట్‌లా రహదారులపై పరుగులు తీసే బస్సు హాలెండ్ దేశంలో తయారైంది. దీని ప్రయాణ వేగం ఎంతో తెలుసా. గంటకు 250 కిలోమీటర్లు. నమ్మబుద్ధి కావడం లేదు కదా.
ఆ దేశానికి చెందిన ఏరోడైనమిక్ నిపుణుడు, మాజీ ఫార్ములా వన్ రేసర్ దీనిని తీర్చిదిద్దాడు. దీని తయారీకి ఏడు మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఇది దుబాయ్‌నుంచి బయల్దేరితే కేవలం 30 నిమిషాల్లో అబుధాభికి చేరుకోగలుగుతుంది. దీనిని అల్యూమినియం, కార్బన్ ఫైబర్, పాలికార్బనేట్లతో తయారుచేశారు. దీని పొడవు 15 మీటర్లు, వెడల్పు రెండున్నర మీటర్లు. ఐదు అడుగుల ఎత్తు. ఈ బస్సులో 23 మంది ప్రయాణించవచ్చు.