బాలాసోర్: తక్కువ ఎత్తులో దూసుకొచ్చే బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగల స్వదేశీ సూపర్‌సోనిక్ ఇంటర్‌సెప్టార్ క్షిపణిని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రయోగంలో భాగంగా పృథ్వీని శత్రు క్షిపణిలా మార్చి సూపర్‌సోనిక్ ఇంటర్‌సెప్టార్ క్షిపణికి లక్ష్యంగా నిర్దేశించారు. అబ్దుల్ కలాం దీవిలో ఏఏడీ (అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్) సూపర్‌సోనిక్ క్షిపణిని మోహరించారు. దీనిలోని రాడార్ల ద్వారా పృథ్వీకి సంబంధించిన సంకేతాలు అందుకున్న ఇంటర్‌సెప్టార్ క్షిపణి గాలిలోనే పృథ్వీని ఢీకొట్టింది. 7.5 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణిలో అధునాతన వ్యవస్థలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment