Balasor
-
ఓ వైపు తుపాను.. మరోవైపు పురిటి నొప్పులు
బాలాసోర్ (ఒడిషా): ఆకాశానికి చిల్లులు పడేట్టుగా కురుస్తున్న వర్షం... ఊరు మొత్తాన్ని చుట్టేసిన వరద నీరు... అప్పుడే మొదలైన పురిటి నొప్పులు.. అర్థరాత్రి.. చిమ్మచీకటి.. చెట్లు కూలిపోవడంతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఇక తల్లిబిడ్డల ప్రాణాలకే ప్రమాదమని అంతా భయపడుతున్న తరుణంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్ష్ ఫోర్స్ రంగంలోకి దిగింది. తక్షణ స్పందన ఒడిషాలోని బాలాసోర్ జిల్లా బహదలాపూర్ గ్రామంలో రాజా, సుకాంతి దంపతులు నివిస్తున్నారు. అయితే యాస్ తుపాను ఒడిషాలో తీరం దాటిన రోజు రాత్రే సుకాంతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. చెట్లూ కూలిపోవడంతో కరెంటు తెగిపోయి గ్రామంలో చీకట్లు కమ్మకున్నాయి. రోడ్డుకి అడ్డంగా పడిన చెట్లతో రాకపోకలు ఆగిపోయాయి. ఆ విపత్కర పరిస్థితుల్లోనే సుకాంతి ప్రసవించినా.. తల్లిబిడ్డలకు వైద్య సాయం అత్యవసరమైంది. మరోవైపు వరద నీరు ఇంటిని చుట్టేస్తోంది. ఈ తరుణంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రాజా ఫోన్ చేశాడు. తల్లిబిడ్డ క్షేమం వాహనాలు పోయే దారి లేకపోవడంతో కాలినడకనే ఎన్డీఆర్ఎప్ బృందం బహదలాపూర్ గ్రామానికి అర్థరాత్రి 2 గంటలకు చేరుకుంది. స్ట్రెచర్ మీదనే సుకాంతిని, నవజాత శిశువుని తీసుకుని కాలినడకన దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణించి ఆస్పత్రికి చేర్చారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన వివరాలను ఎన్డీఆర్ఎఫ డీసీ సత్య నారాయన్ ప్రధాన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. చదవండి: అలజడిలో జననం #CycloneYaasUPDATE 27/5/21@NDRFHQ 𝐑𝐄𝐒𝐂𝐔𝐄 𝐎𝐅 𝐌𝐎𝐓𝐇𝐄𝐑 & 𝐍𝐄𝐖𝐁𝐎𝐑𝐍 🔸Sukanti w/o Raja Jena 🔸& her newborn baby 🔸Bahabalapur,Balasore 🔸Rescued frm flooded village 🔸2 am night 🔸On foot w/stretcher 🔸Safe to hospital@PIBHomeAffairs @ANI @PIBBhubaneswar pic.twitter.com/FEbTUdjG8c — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) May 27, 2021 -
yaas cyclone ప్రచండ గాలులు
బాలాసోర్ : యాస్ తుపాన్ ఒడిషాలోని బాలాసోర్ దగ్గర తీరం దాటింది. తీరం దాటేప్పుడు ప్రచండ గాలులు వీచాయి. ఆ గాలుల తీవ్రతకు భారీ చెట్లు కూకటి వేళ్లతో నేలకూలాయి. తుపాను తీరం దాటేప్పుడు గంటలకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ ప్రపంచ గాలుల తీవ్రత ఎలా ఉందో మీరే చూడండి #CycloneYaasUPDATE Cyclone yaas hits balasore ( Orissa ) ⚡ pic.twitter.com/RSVHU0nVih — Shehzar Hussain 🇮🇳 (@_Shehzar_hN_) May 26, 2021 -
సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్: తక్కువ ఎత్తులో దూసుకొచ్చే బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగల స్వదేశీ సూపర్సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణిని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రయోగంలో భాగంగా పృథ్వీని శత్రు క్షిపణిలా మార్చి సూపర్సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణికి లక్ష్యంగా నిర్దేశించారు. అబ్దుల్ కలాం దీవిలో ఏఏడీ (అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్) సూపర్సోనిక్ క్షిపణిని మోహరించారు. దీనిలోని రాడార్ల ద్వారా పృథ్వీకి సంబంధించిన సంకేతాలు అందుకున్న ఇంటర్సెప్టార్ క్షిపణి గాలిలోనే పృథ్వీని ఢీకొట్టింది. 7.5 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణిలో అధునాతన వ్యవస్థలున్నాయి. -
పీడీవీ 'సూపర్ సక్సెస్!
ఆకాశంలోనే లక్ష్యాన్ని ధ్వంసం చేసిన పృథ్వీ ఇంటర్సెప్టర్ క్షిపణి తొలి ప్రయోగమే సఫలం బాలాసోర్: విదేశీ క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పించే అద్భుతమైన కవచం ‘బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ)’ వ్యవస్థ రూపకల్పనలో భాగంగా మన దేశం మరో గొప్ప ముందడుగు వేసింది. సుదూరం నుంచి దూసుకువచ్చే దీర్ఘశ్రేణి క్షిపణులను ముందుగా గుర్తించి, ఆకాశంలోనే పేల్చివేసే ‘పృథ్వీ డిఫెన్స్ వెహికల్ (పీడీవీ)’ని రక్షణశాఖ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. దీనిని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఒడిశాలోని వీలర్ ఐలాండ్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. పీడీవీ తొలి ప్రయోగంలోనే పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో రక్షణశాఖలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ప్రయోగం వివరాలతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయోగం జరిగిందిలా.. పీడీవీ ఇంటర్సెప్టర్ క్షిపణితో పాటు బాలిస్టిక్ క్షిపణి తరహాలో మోటార్లతో ప్రత్యేకంగా రూపొందించిన లక్ష్యాన్ని ఈ ప్రయోగంలో వినియోగించారు. ముందుగా.. బంగాళాఖాతం మధ్యలో నిలిపిన నౌకల నుంచి లక్ష్యాన్ని ఉదయం 9 గంటల 7 నిమిషాలకు ప్రయోగించారు. అది బాలిస్టిక్ క్షిపణి తరహాలో తీరప్రాంతం వైపు దూసుకువస్తుండగా... పీడీవీ వ్యవస్థలోని రాడార్లు దానిని ఆటోమేటిగ్గా గుర్తించి అప్రమత్తం చేశాయి. వెంటనే ‘ఐటీఆర్’ నుంచి పృథ్వీ ఇంటర్సెప్టర్ క్షిపణి బయలుదేరింది. మైక్రో నావిగేషన్, ఇన్ఫ్రారెడ్ వ్యవస్థల సహా యంతో... కొద్ది సేపట్లోనే లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టెలిమెట్రీ/రేంజ్ స్టేషన్ల ద్వారా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలించారు. రెండు దశల క్షిపణి రక్షక కవచం ‘బీఎండీ’ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా రూపొందించిన ‘పీడీవీ’ అన్ని స్థాయిల్లోనూ, ప్రమాణాల పరంగా పూర్తిగా విజయవంతం అయిందని డీఆర్డీవో శాస్త్రవేత్త రవికుమార్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా పీడీవీ రూపకల్పన, ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను డీఆర్డీవో డెరైక్టర్ జనరల్, రక్షణశాఖ మంత్రి శాస్త్ర సలహాదారు అవినాశ్ చందర్ అభినందించారు. పృథ్వీ డిఫెన్స్ వెహికల్ పనితీరు, ప్రత్యేకతలు.. 2 వేల కిలోమీటర్లకంటే ఎక్కువ సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణులు భూవాతావరణంలో దాదాపు 120 నుంచి 250 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి.. తిరిగి కిందకు వచ్చి లక్ష్యాన్ని ఛేదిస్తాయి.ఇలా వచ్చే శత్రుదేశ క్షిపణులను ‘పీడీవీ’ 120 కిలోమీటర్ల కంటే ఎత్తులో ఉండగానే గుర్తించి, ధ్వంసం చేస్తుంది.క్షిపణులను గుర్తించే రాడార్లు, పృథ్వీని ప్రయోగించే లాంచ్ప్యాడ్ ఆటోమేటిక్గా స్పందించేలా పీడీవీ వ్యవస్థకు అనుసంధానమై ఉంటాయి.లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేందుకు వీలుగా ‘పీడీవీ’లో మైక్రో, ఇనెర్షియల్ నావిగేషన్ పరికరాలు, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) సీకర్ ఉంటాయి. ‘పీడీవీ’ భూవాతావరణంలో పై పొరలకు చేరగానే.. వేడిని తట్టుకోవడం కోసం దీనికి అమర్చిన ‘హీట్ షీల్డ్స్’ విడిపోతాయి. వెంటనే ఇన్ఫ్రారెడ్ సీకర్ పరికరం పైకి తెరుచుకుని లక్ష్యం దిశగా ‘పీడీవీ’కి మార్గ నిర్దేశనం చేస్తుంది.ఇనెర్షియల్ నావిగేషన్, ఐఆర్ సీకర్తోపాటు నియంత్రణ కేంద్రాల సహకారంతో పీడీవీ లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలుగుతుంది. -
పినాక రాకెట్ల పరీక్ష విజయవంతం
బాలసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పినాక రాకెట్లను బుధవారం ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో విజయవంతంగా పరీక్షించారు. బాలసోర్కు సమీపంలోని చాందీపూర్ తీరం వద్దనున్న స్థావరం నుంచి మల్టీబ్యారెల్ రాకెట్ లాంఛర్ ద్వారా రెండు రౌండ్ల పినాకా రాకెట్లను ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. సాధారణ పరీక్షల్లో భాగంగానే ఈ ప్రయోగాలు జరిపినట్లు పేర్కొన్నాయి. 1995 నుంచి వివిధ క్లిష్ట పరీక్షలను అధిగమించిన పినాకా రాకెట్లను ఇప్పటికే సైన్యం వాడుతోంది. ఈ ఏడాది జూలైలో అధునాతన పినాకా మార్క్-2 మల్టీబ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ పరీక్షలను పశ్చిమ రాజస్థాన్లోని పోఖ్రాన్లో జరిపినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే ఈ ఆధునిక రాకెట్లను సైన్యంలోకి చేరుస్తామన్నారు. శతఘు్నలకు సహాయకంగా 40 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించేందుకు వీటిని అభివృద్ధి చేశారు.