వార్‌హెడ్‌తో క్షిపణి పరీక్ష: ఉ.కొరియా | North Korea brags of new missile with super large warhead | Sakshi
Sakshi News home page

వార్‌హెడ్‌తో క్షిపణి పరీక్ష: ఉ.కొరియా

Published Wed, Jul 3 2024 4:26 AM | Last Updated on Wed, Jul 3 2024 4:26 AM

North Korea brags of new missile with super large warhead

సియోల్‌: అతిపెద్ద వార్‌హెడ్‌ను మోసుకెళ్ల గలిగిన వ్యూహాత్మక బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా ప్రకటించుకుంది. సోమవారం పరీక్షించిన హువాసంగ్‌ఫొ–11 డీఏ–4.5 రకం క్షిపణికి నాలుగున్నర టన్నుల బరువున్న వార్‌హెడ్‌ను అమర్చినట్లు ఆ దేశ వార్తా సంస్థ మంగళవారం తెలిపింది.

ఈ క్షిపణి గరిష్టంగా 500 కిలోమీటర్లు, కనిష్టంగా 90 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలదని కూడా వెల్లడించింది. అయితే, ఉత్తర కొరియా సోమవారం ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌ సమీపంలోని నిర్జన ప్రాంతంలో కుప్పకూలినట్లు దక్షిణ కొరియా సైన్యం మంగళవారం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement