missile test
-
వార్‌హెడ్‌తో క్షిపణి పరీక్ష: ఉ.కొరియా
సియోల్: అతిపెద్ద వార్‌హెడ్‌ను మోసుకెళ్ల గలిగిన వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా ప్రకటించుకుంది. సోమవారం పరీక్షించిన హువాసంగ్ఫొ–11 డీఏ–4.5 రకం క్షిపణికి నాలుగున్నర టన్నుల బరువున్న వార్‌హెడ్‌ను అమర్చినట్లు ఆ దేశ వార్తా సంస్థ మంగళవారం తెలిపింది.ఈ క్షిపణి గరిష్టంగా 500 కిలోమీటర్లు, కనిష్టంగా 90 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలదని కూడా వెల్లడించింది. అయితే, ఉత్తర కొరియా సోమవారం ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని నిర్జన ప్రాంతంలో కుప్పకూలినట్లు దక్షిణ కొరియా సైన్యం మంగళవారం తెలిపింది. -
నేడు ఉత్తర కొరియాకు పుతిన్
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. కిమ్ ఆహా్వనం మేరకు పుతిన్ మంగళ, బుధవారాల్లో తమ దేశంలో పర్యటించనున్నట్టు కొరియన్ సెంట్రల్ అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనను ఇరు దేశాలు ««ధ్రువీకరించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్ క్షిపణుల పరీక్షల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించడం సంచలనమైంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రమైన దాడులు చేస్తుండటంతో రష్యాకు అవసరమైన ఆయుధ సంపత్తిని ఉత్తర కొరియా సరఫరా చేస్తోందని, అందుకు బదులుగా రష్యా నుంచి అణు సాంకేతికతను పొందుతోందని దక్షిణ కొరియాతోపాటు అమెరికా ఆరోపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా.. ఉత్తర కొరియాతో ఆయుధ వాణిజ్యం చేస్తే యూఎన్ తీర్మానాలను ఉల్లంఘించడమేనని అంటున్నాయి. అయితే, ఉత్తర కొరియా, రష్యా ఈ కథనాలను ఖండించాయి. కాగా, రష్యా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో పర్యటించడం 24 ఏళ్లలో ఇది ప్రథమం. పుతిన్ మొదటిసారి జూలై 2000లో ఉత్తర కొరియాలో పర్యటించారు. మొదటి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత, అప్పుడు ఉత్తర కొరియాను పాలిస్తున్న కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌తో సమావేశమయ్యారు. పుతిన్ కోసం విలాసవంతమైన వేడుక 1991లో సోవియట్ పతనం తర్వాత ఉత్తర కొరియాతో రష్యా సంబంధాలు బలహీనపడ్డాయి. కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా 2019లో రష్యాలోని తూర్పు నౌకాశ్రయం వ్లాడివోస్టాక్‌లో పుతిన్‌తో సమావేశమయ్యారు. మళ్లీ పుతిన్, కిమ్‌లు ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పుతిన్.. కిమ్‌కు హై–ఎండ్ ఆరస్సెనాట్ కారును పంపారు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య అనుబంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపేందుకు పుతిన్ కోసం విలాసవంతమైన వేడుకను కిమ్ సిద్ధం చేస్తున్నారు. రాజధాని ప్యాంగ్యాంగ్లోని ఒక చౌరస్తాలో భారీ కవాతు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు తెలుపుతున్నాయని ఓ న్యూస్ వెబ్సైట్ విశ్లేíÙంచింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తరువాత పుతిన్‌ను స్వాగతించే దేశాలు తక్కువగా ఉన్నా.. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన కిమ్ విజయం అంటున్నారు ఉత్తరకొరియా రాజకీయ విశ్లేషకులు. మాస్కోతో ఆర్థిక, ఇతర సహకారాలను పెంపొందించుకోవడానికి ఈ పర్యటనలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. -
రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: ఆకాశంలో నుంచి భూమి పైనున్న లక్ష్యాలపైకి ప్రయోగించే రుద్ర ఎం–2 మిస్సైల్‌ను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి ఎస్‌యూ–30 ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన రుద్ర నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అందుకుందని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. రుద్ర ఎం–2 మిస్సైల్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. డీఆర్డీఓకు చెందిన పలు లాబోరేటరీలు రూపొందించిన సాంకేతికతలను ఇందులో వాడారు. నేలపై ఉన్న పలురకాల శత్రు లక్ష్యాలను చేధించేందుకు రుద్ర క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్ర ఎం–2ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు. రుద్ర ఎం–2 క్షిపణి పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధబలగాల బలాన్ని రెట్టింపు చేస్తుందని పేర్కొన్నారు. -
Mission Divyastra: శత్రువుకు వణుకే...!
ఖండాంతర లక్ష్యాలను అతి కచి్చతత్వంతో ఛేదించగల రేంజ్, బహుళ సామర్థ్యం. అత్యాధునిక పరిజ్ఞానం. వీటన్నింటి మేలు కలయికగా అగ్ని–5 క్షిపణి రూపుదిద్దుకుంది. ఇందుకోసం డీఆర్డీఓ సైంటిస్టులు ఏళ్ల తరబడి నిరంతర తపస్సే చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొన్నేళ్లుగా భారత్ సాధిస్తున్న అద్భుత ప్రగతి ఇందుకు తోడైంది. 5,000 కిలోమీటర్ల పై చిలుకు రేంజ్‌తో కూడిన అగ్ని–5 క్షిపణి రాకతో దేశ రక్షణ వ్యవస్థ దురి్నరీక్ష్యంగా మారింది... ఆద్యంతం ఆత్మనిర్భర్... ► చైనా వద్ద ఉన్న డాంగ్‌ఫెంగ్ తదితర క్షిపణుల రేంజ్ 10 వేల నుంచి 15 వేల కి.మీ. దాకా ఉంది! ► వాటిని దృష్టిలో ఉంచుకుని, లక్ష్యఛేదనలో కచ్చితత్వానికి పెద్దపీట వేస్తూ అగ్ని–5ని అభివృద్ధి చేశారు. ► దీని తయారీకి అవసరమైన వైమానిక వ్యవస్థలను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. ► అంతేగాక అత్యంత కచి్చతత్వంతో కూడిన సెన్సర్లను కూడా ఈ వ్యవస్థలో అమర్చారు. ► వీటి సాయంతో అణు వార్హెడ్లు లక్ష్యాన్ని అణుమాత్రమైనా తేడా లేకుండా ఛేదించగలవు. గురి తప్పదంతే! అగి్న–5లో వాడిన మలి్టపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వీ) సాంకేతికత దీన్ని మరింత విధ్వంసకంగా, ప్రమాదకారిగా మారుస్తోంది. ఒకే క్షిపణి ప్రయోగంతో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించేందుకు వీలు కలి్పంచడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీ 1960ల్లో తొలుత తెరపైకి వచి్చంది. 1968లో అమెరికా దీన్ని అభివృద్ధి చేసింది. మైన్యూట్‌మ్యాన్–3 క్షిపణి వ్యవస్థలో దీన్ని వాడింది. 1970ల నుంచి ఎంఐఆర్వీ సాంకేతికత ఖండాంతర క్షిపణుల్లో పూర్తిస్థాయిలో వాడకంలోకి వచి్చంది. ► ఖండాంతర క్షిపణుల తయారీ, పేలోడ్ వ్యవస్థ తదితరాల్లో విప్లవాత్మక మార్పులకు ఎంఐఆర్వీ శ్రీకారం చుట్టింది. ► ఈ పరిజ్ఞానం సాయంతో ఒకే క్షిపణి ద్వారా ఒకటికి మించిన సంఖ్యలో సంప్రదాయ, అణు వార్హెడ్లను ప్రయోగించవచ్చు. ► ఇందుకోసం ఒకే పెద్ద వార్‌హెడ్ బదులుగా పలు చిన్న చిన్న వార్హెడ్లను క్షిపణికి సంధిస్తారు. ► వీటిలో ప్రతి వార్‌హెడ్ స్వతంత్రంగా భిన్న లక్ష్యంపై దాడి చేయగలదు. ► తద్వారా ఒకే క్షిపణి ద్వారా ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించవచ్చు. ► ఒకటికి మించిన వార్హెడ్ల కారణంగా శత్రు దేశాల మిసైల్ డిఫెన్ వ్యవస్థలను ఏమార్చడంతో పాటు వాటి ఖండాంతర క్షిపణి విధ్వంస దాడులను తట్టుకుని లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఛేదించే సంభావ్యత ఎంతగానో పెరుగుతుంది. ► అంతేగాక లక్ష్యఛేదన కచ్చితత్వంతో జరిగేలా చూడటం ఎంఐఆర్వీ ప్రత్యేకత. ► అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వద్ద మాత్రమే ఈ సాంకేతికత ఉంది. ► పాకిస్తాన్ కూడా ఈ సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇటీవల అబాబీల్ మధ్య శ్రేణి క్షిపణి ప్రయోగంలో దీన్ని ప్రయతి్నంచి చూశారు. -
ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం
సియోల్: ఉత్తరకొరియా ఆదివారం సముద్ర జలాలపైకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ దీన్ని ధ్రువీకరించాయి. డిసెంబర్ 18న కూడా అమెరికా ప్రధాన భూభాగంపై సైతం దాడి చేయగల సామర్థ్యమున్న ఘన ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసంగ్–18ని ఉత్తర కొరియా ప్రయోగించింది. ఏప్రిల్‌లో దక్షిణకొరియాలో, నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఉత్తరకొరియా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
సింథియా(విశాఖ పశి్చమ): భారత నావికాదళంలోని తూర్పు నావికా విభాగం బ్రహ్మోస్ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలో పరీక్షలో భాగంగా నావికాదళానికి చెందిన విధ్వంసకనౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి నిర్దేశించిన కచి్చత పరామితులను అందుకుందని ఇండియన్ నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. పరీక్ష తాలూకు ఫొటోను భారత నేవీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది. -
ఘన ఇంధన బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించాం
సియోల్: మొట్టమొదటిసారిగా ఘన ఇంధనాన్ని వినియోగించి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తరకొరియా శుక్రవారం ప్రకటించింది. వేగంగా ప్రయాణించే కొత్త రకం క్షిపణిని ఆ దేశం గురువారం ప్రయోగించినట్లు దక్షిణకొరియా, జపా¯Œ పేర్కొనడం తెలిసిందే. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోని వేదికపై నుంచి చేపట్టిన ఈ ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్, ఆయన భార్య, కుమార్తె, సోదరి తిలకించినట్లు అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఈ క్షిపణి మూడు దశలుగా ప్రయాణించి, లక్ష్యాన్ని ఛేదించినట్లు వివరించింది. ఇప్పటి వరకు ద్రవ ఇంధనంతో పనిచేసే క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా తాజాగా ఘన ఇంధనం వాడినట్లు ప్రకటించడం ముందడుగేనని నిపుణులంటున్నారు. అమెరికాను నేరుగా భయపెట్టే అణ్వాయుధాలను సమకూర్చుకోవాలనే లక్ష్యంలో ఇది పురోగతిగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ తాజా క్షిపణి సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అది ప్రయాణించిన దూరం, ఎత్తు, తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఎలా ఛేదించింది, వార్ హెడ్ అమరిక వంటి వివరాలను వెల్లడించకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. -
ఫైటర్ జెట్ నుంచి దూసుకెళ్లిన ‘బ్రహ్మోస్’ మిసైల్
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలు పెరుగుతున్న వేళ రక్షణ రంగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది భారత్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి పరీక్షించింది భారత వాయుసేన. గగనతలం నుంచి దూసుకెళ్లిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. ‘సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బంగాళకాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భూతల, సముద్రంలోని సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్ధ్యాన్ని వైమానిక దళం సాధించింది. సుఖోయ్-30ఎంకేఐతో ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ మిసైల్‌ను జత చేయడం ద్వారా భారత వైమానిక దళానికి వ్యూహాత్మక బలాన్ని చేకూర్చింది. భవిష్యత్తులో ఎదురయ్యే యుద్ధాల్లో పైచేయి సాధించే అవకాశాన్ని కల్పించింది.’ - భారత రక్షణ శాఖ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత వాయుసేన ట్విట్టర్లో షేర్ చేసింది. ఎయిర్‌ఫోర్స్, నేవీ, డీఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు భారత వాయుసేన తెలిపింది. మరోవైపు.. యుద్ధ విమానం నుంచి క్షిపణులను పరీక్షించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు. 290 కిలోమీటర్ల రేంజ్ నుంచి 350 కిలోమీటర్లుకు పెంచిన మిసైల్‌ను సుఖోయ్ ఫైటర్ నుంచి ప్రయోగించి విజయం సాధించింది వాయుసేన. The IAF successfully fired the Extended Range Version of the Brahmos Air Launched missile. Carrying out a precision strike against a Ship target from a Su-30 MKI aircraft in the Bay of Bengal region, the missile achieved the desired mission objectives. pic.twitter.com/fiLX48ilhv — Indian Air Force (@IAF_MCC) December 29, 2022 ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
అగ్ని-5 ప్రయోగం విజయవంతం.. 5,500 కిమీ లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం
భువనేశ్వర్: అగ్ని-5 అణు బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. డమ్మీ వార్‌హెడ్స్‌తో అగ్ని-5 క్షిపణులను ప్రయోగించారు. 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ మిసైల్స్ ఛేదించగలవు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యంత కీలకమైన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత శాస్త్రవేత్తలు మరో మైలురాయిని చేరుకున్నట్లయింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సరిహద్దులో చైనా బలగాలలతో ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే అగ్ని-5 ప్రయోగం జరగడం గమనార్హం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మిసైల్స్.. సుదూర లక్ష్యాలను ఛేదించగలవు. ఈ ప్రయోగంపై చైనా గతంలో అభ్యతరం కూడా తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని సాకుగా చూపింది. భారత్ మాత్రం యథావిధిగా ప్రయోగాన్ని విజయవంతంగా ముగించింది. చదవండి: గతం గతహా.. వాళ్లతో నన్ను పోల్చకండి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్!
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియాలో ఏం జరిగినా.. పొరుగున ఉన్న దక్షిణ కొరియా నిఘా ఏజెన్సీలు వెల్లడిస్తేనే బయటి ప్రపంచానికి తెలిసేది!. కేవలం తమ దర్పం ప్రదర్శించే వ్యవహారాలను మాత్రమే ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ అధికారికంగా ప్రదర్శిస్తుంటుంది. అలాంటిది ఎవరూ ఊహించని రీతిలో ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్!. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడి వ్యక్తిగత విషయాల గురించి బయటి ప్రపంచానికి తెలిసి చాలా చాలా తక్కువే. ఈ క్రమంలో ఆయన ఇప్పుడు తన కూతురిని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు!. శుక్రవారం ఉత్తర కొరియా వాసాంగ్-17 ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ను శుక్రవారం పరీక్షించింది. ఆ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని పరిశీలించేందుకు కూతురిని వెంట పెట్టుకుని మరీ వెళ్లాడట కిమ్ జోంగ్ ఉన్. ఆ చిన్నారి చెయ్యి పట్టుకుని మరీ క్షిపణి ప్రయోగ ప్రాంగణం అంతా కలియదిరిగాడు కిమ్. ఈ ఇద్దరూ ప్రయోగ వేదిక వద్ద హల్ చల్ చేసిన ఫొటోలు కొరియా న్యూస్ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చాయి. అయితే ఆ చిన్నారి పేరును ప్రకటించకపోయినా.. కూతురిని మీడియా ముందుకు, అదీ క్షిపణి ప్రయోగానికి తీసుకురావడం ఆశ్చర్యకరపరిణామని వర్ణించింది కొరియా న్యూస్ ఏజెన్సీ. ఇక.. కిమ్‌కు ముగ్గురు సంతానం అని, అందులో ఇద్దరు అమ్మాయిలేనని కథనాలు చక్కర్లు కొడుతుంటాయి. సెప్టెంబర్ నేషనల్ హాలీడే సందర్భంగా పిల్లలతో ఆయన సరదాగా గడపగా.. అందులో కిమ్ పిల్లలు కూడా ఉన్నారంటూ కథనాలు ప్రచారం అయ్యాయి. మరోవైపు కిమ్ వివాహంపై రకరకాల ప్రచారాలు చక్కర్లు కొడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి కూతురు అయ్యి ఉండకపోవచ్చనే వాదనా వినిపిస్తోంది ఇప్పుడు. So, Kim Jong-un just decided to reveal his daughter for the first time publicly at an ICBM launch??? pic.twitter.com/tiE8gWixAJ — Joseph Dempsey (@JosephHDempsey) November 18, 2022 North Korean state media pictures of Kim Jong Un attending Friday's launch of the Hwasong-17 ICBM: pic.twitter.com/A6DMsifz8h — William Gallo (@GalloVOA) November 18, 2022 -
హిందూ సాగరంలోకి చైనా నిఘా నౌక.. భారత క్షిపణి పరీక్ష వాయిదా!
న్యూఢిల్లీ: చైనాకు చెంది నిఘా నౌక యువాన్ వాంగ్-5 ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టుకు చేరుకున్న క్రమంలో భారత్-చైనాల మధ్య దౌత్యపరమైన సమస్య తలెత్తింది. ఇప్పుడు మళ్లీ చైనాకు చెందన మరో నిఘా నౌక వల్ల భారత్ చేపట్టబోయే క్షిపణి పరీక్షపై ప్రభావం పడుతోంది. డ్రాగన్‌కు చెందన నిఘా నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిందని, దాని కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. నవంబరు 10-11 తేదీల్లో దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టనున్నట్లు ఇటీవలే నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసింది భారత్. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. 2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి.. శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. అయితే నోటమ్ జారీ చేసిన తర్వాత చైనాకు చెందిన యువాన్ వాంగ్-6 అనే నిఘా, పరిశోధక నౌక.. హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత క్షిపణులు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఆ నిఘా నౌకకు ఉండటమే అందుకు కారణం. ఈ నౌక ఇండోనేషియాలోని బాలీ తీరం నుంచి శుక్రవారం ఉదయమే బయల్దేరింది. భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను హిందూ మహా సముద్రంలోకి పంపించడం.. మన ఆయుధ పాటవంపై కన్నేసి ఉంచడానికే డ్రాగన్ చేసిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: లక్ష ఉద్యోగాలు.. ఓపీఎస్ పునరుద్ధరణ.. మహిళలకు రూ.1,500: కాంగ్రెస్ హామీల వర్షం -
కిమ్ రూటే సెపరేట్: క్షిపణి ప్రయోగం చేసిన స్థావరంలోనే..
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా మిసైల్ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ తాజాగా మిసైల్ ప్రయోగ స్థావరంలోనే గ్రీన్ హౌస్ ఫామ్‌కి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పూర్వ రియోనిఫో వైమానికి స్థావరంలో ఈ గ్రీన్హౌస్ ఫాంని ప్రారంభించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రారంభోత్సవానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరయ్యారు. ఇది ఉత్తర కొరియాలో అతిపెద్ద కూరగాయాల ఫాంలో ఒకటిగా పేరుగాంచనుంది. దీన్ని ఉత్తర కొరియాలో ప్రభలంగా ఉన్న ఆహార కొరత సమస్యలను పరిష్కరించడానికి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మించిన ప్రాంతంలోనే 2019, 2021 వరసగా కెఎన్ 25, కెఎన్ 23 వంటి స్వల్స బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. ఈ ఫాం హౌస్‌ని ఉత్తర కొరియాలో ప్రధాన సెలవు దినమైన పాలకుల వర్కర్స్ పార్టీ స్థాపన వార్షికోత్సవం రోజున ప్రారంభించింది. ఉత్తరకొరియా ప్రజల కోసం గత డిసెంబర్లోనే ఈ ఫామ్‌ను ఆటోమెటెడ్‌గా మార్చే ప్రాజెక్టుని ప్రారంభించింది. ఈ వ్యవసాయ క్షేత్రంలో సుమారు 280 హెక్టారుల విస్తీర్ణంలో 850కి పైగా గ్రీన్హౌస్ ఫామ్‌లు ఉన్నాయి. అంతేగాదు ఈ ఫాం హౌస్‌ని కొద్దినెలల్లోనే పూర్తి చేసినందుకు కార్మికులను, సైనికులను కిమ్ ప్రశంసించారు. అంతేగాదు ఇలాంటి మరిన్ని ఫామ్ హౌస్‌లను అభివృద్ధి చేయాలని శాస్త్రీయ పద్ధతుల్లో కూరగాయలను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. ఒకపక్క దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నౌకదళ విన్యాసాలు చేశాయన్న అక్కసుతో మిసైల్ దూకుడుతో కవ్వింపు చర్యలకు దిగింది. మరోవైపు దేశ ప్రజల ఆహార కొరత సమస్యను పరిష్కరించే దిశగా వైమానిక ప్రయోగా స్థావరాల్లోనే ఫామ్ హౌస్‌లను ఏర్పాటు చేసి ఆశ్చర్యపరించింది. ఏదైనా కిమ్కే చెల్లింది. (చదవండి: ఐరాసలో రష్యాకు భారత్ షాక్.. కీలక ఓటింగ్‌లోనూ భారీ షాక్ ఇస్తుందా?) -
వీఎల్–ఎస్ఆర్ఎస్ఏఎం పరీక్ష సక్సెస్
బాలసోర్: ఒడిశా తీరం చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి శుక్రవారం చేపట్టిన వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్ఆర్ఎస్ఏఎం) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. నేవీ షిప్ నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఛేదించిందని అధికారులు తెలిపారు. ఈ ఆయుధ వ్యవస్థ అత్యంత సమీపంలోని వివిధ రకాల లక్ష్యాలను అడ్డుకుంటుందని, రాడార్ తదితరాలకు దొరక్కుండా తప్పించుకునే వాటిని కూడా ఎదుర్కొంటుందని వెల్లడించారు. ఈ క్షిపణి హై స్పీడ్ ఏరియల్ టార్గెట్‌ను ఛేదించడాన్ని అంచనా వేసేందుకు పలు ట్రాకింగ్ వ్యవస్థలను వినియోగించినట్లు చెప్పారు. ఈ ప్రయోగం డీఆర్డీవో, నేవీ ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందన్నారు. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన డీఆర్డీవో, నేవీలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ విజయంతో భారత నావికాదళం గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ నేవీ, డీఆర్డీవో బృందాల కృషిని ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందాలను డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి అభినందించారు. భారత నావికా దళం సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ ఇనుమడింప జేస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన ‘‘ఆత్మనిర్భర్ భారత్’’లో ఇది మరో మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. -
ఐదేళ్ల తర్వాత.. నార్త్ కొరియా అధ్యక్షుడి ఆనందతాండవం
ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడితే.. ఉత్తర కొరియా మాత్రం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. చివరికి తిండి దొరక్కపోవడంతో తినడం తగ్గించాలంటూ దేశ ప్రజలకు ఆ దేశ నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక సందేశం ఇచ్చాడంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది.. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన సంబురాల్లో మునిగిపోయాడు. చిందులేశాడు. అందుకు కారణం జనాల సంతోషం ఏమాత్రం కాదు. ఆర్థిక సంక్షోభం ఏమాత్రం పట్టన్నట్లు.. ఉత్తర కొరియా ఈమధ్యకాలంలో వరుసగా ఆయుధ పరీక్షలు చేపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళలోనూ.. నార్త్ కొరియా మాత్రం తన ఆయుధ సంపత్తికి మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించిందని, అందుకే కిమ్ అంత సంతోషంగా ఉన్నాడని కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఒక ప్రకటన వెలువరించగా.. జపాన్ సైతం ఈ మిస్సైల్ టెస్ట్‌ను నిర్ధారించింది. ఎక్కడి నుంచి ప్రయోగించిందో అనే సమాచారం లేదు. కానీ, సదరు ఖండాతర క్షిపణి సుమారు 1,100 కిలోమీటర్లు, గంటకు పైగా ప్రయాణించి జపాన్ సముద్ర జలాల్లో పడిపోయిందని తెలుస్తోంది. ఈ క్షిపణి ప్రయోగానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. నిషేధిత ఖండాంతర క్షిపణిని 2017 తర్వాత ఉత్తర కొరియా ఇప్పుడే ప్రయోగించింది. అది సక్సెస్ కావడంతోనే కిమ్ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మునుపెన్నడూ చూడని జోష్‌తో ఆయన అంతా కలియదిరిగారట. పైగా ఈ నెల 16వ తేదీన ఉత్తర కొరియా ఒక భారీ క్షిపణిని ప్రయోగించగా, అది రాజధాని ప్యాంగ్ యాంగ్ గగనతలంలోనే పేలిపోయి తునాతునకలైంది. ఈ ఫెయిల్యూర్‌ను అధిగమించేలా.. ప్రస్తుత క్షిపణి సక్సెస్ కావడంతో అధికార వర్గాలు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నాయి. కిమ్ మాట తప్పాడు లాంగ్ రేంజి మిస్సైళ్లను పరీక్షంచబోమని, అణు పరీక్షలు జరపబోమని 2018లో కిమ్ జాంగ్ ఉన్ మారటోరియం విధించుకున్నారు. అయితే అది 2020లో పటాపంచలైంది. మారటోరియంను తాము ఎక్కువకాలం అమలు చేయలేమని స్పష్టం చేసిన ఉత్తరకొరియా అధినేత మళ్లీ అమెరికాకు, ప్రపంచదేశాలకు సవాళ్లు విసరడం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి నిషేధిత జాబితాలో ఉందని, తద్వారా కిమ్ జోంగ్-ఉన్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన మాటను తప్పాడని విమర్శిస్తోంది దక్షిణ కొరియా. ఇంతకు మించే.. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా హాసంగ్-14 లాంగ్ రేంజి క్షిపణులను రూపొందించింది. ఇవి 8,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు. వీటి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. కానీ, ఈ తరహా భూతల క్షిపణులు కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అయితే ఇంతకు మించిన రాక్షస మిస్సైల్‌ను 2017లోనే ఉత్తర కొరియా ప్రయోగించింది. సుమారు 13,000 కిలోమీటర్లకు పైగా రేంజ్లో ప్రయాణించగల ఆ మిస్సైల్స్ గనుక ప్రయోగిస్తే గురి తప్పకుండా అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా చేరుకోగల సామర్థ్యం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ప్చ్! కనీసం భారత్ భూభాగంలో పడి విఫలమైనా బావుండుసార్!
ప్చ్! కనీసం భారత్ భూభాగంలో పడి విఫలమైనా బావుండుసార్! -
Sakshi Cartoon: ఏడాదిలో 8వ క్షిపణి ప్రయోగించిన నార్త్ కొరియా
ఏడాదిలో 8వ క్షిపణి ప్రయోగించిన నార్త్ కొరియా -
జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
సియోల్: ఉత్తరకొరియా మంగళవారం సముద్రజలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇప్పటికే కొరియా ద్వీపకల్పంలో సాగుతున్న ఉద్రిక్తతలకు ఈ పరిణామం మరింత ఆజ్యం పోసినట్లయింది. జలాంతర్గామి నుంచి ప్రయోగించేందుకు వీలున్న ఒక ఆయుధాన్ని ఉ.కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మిలటరీ ప్రకటించింది. సిన్పో నౌకాశ్రయం సమీపంలోని సముద్ర జలాల్లో సబ్మెరీన్ పైనుంచి తక్కువ శ్రేణి క్షిపణిని ఉ.కొరియా ప్రయోగించినట్లు భావిస్తున్నట్లు తెలిపింది. దక్షిణ కొరియా, అమెరికా ఆర్మీ తాజా పరిస్థితులపై విశ్లేషణ జరుపుతున్నాయి. కాగా, ఉ.కొరియా రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించినట్లు తెలిసిందని జపాన్ మిలటరీ పేర్కొంది. అవి జలాంతర్గామి నుంచి ప్రయోగించినవా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టాక ఉ.కొరియా అతి ముఖ్యమైన ఆయుధ బల ప్రదర్శన ఇదే. ఉ.కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలకు సిద్ధమంటూ అమెరికా పునరుద్ఘాటించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. చివరిసారిగా ఉత్తరకొరియా 2019లో జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించింది. -
ఉ.కొరియా క్షిపణి ప్రయోగం.. ద.కొరియా అత్యవసర సమావేశం
సియోల్: ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం జరిపింది. ఆ దేశం మంగళవారం ఉదయం సముద్రంపైకి స్వల్ప శ్రేణి క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించిందని దక్షిణ కొరియా తెలిపింది. తాజా పరిణామంతో, దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమంటూ ఇటీవలే ప్రకటించుకున్న ఉ.కొరియా చిత్తశుద్ధిపై పొరుగుదేశాలు అనుమానాలను వ్యక్తం చేశాయి. ఉ.కొరియా దుందుడుకు చర్య నేపథ్యంలో ద.కొరియా జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది. చదవండి: (పాక్ 12 ఉగ్ర సంస్థలకు నిలయం) పొరుగుదేశం చర్యను తీవ్రంగా ఖండించింది. ఉ.కొరియా బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు భావిస్తున్నామని జపాన్ ప్రధాని యోషిహిడే సుగా అన్నారు. ఉ.కొరియా క్షిపణి ప్రయోగంతో అమెరికా ప్రజలకు ఎటువంటి తక్షణ ముప్పులేదని అమెరికా ఇండో–పసిఫిక్ కమాండ్ పేర్కొంది. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించకుండా భద్రతామండలి ఆంక్షలు విధించినప్పటికీ ఉ.కొరియా 6 నెలల క్రితం కూడా క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించింది. చదవండి: (డ్రాగన్ దుశ్చర్య.. 55 గుర్రాలపై భారతీయ భూభాగంలోకి..) -
8 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించిన మిస్సైల్
న్యూఢిల్లీ : భారత్ మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఏయిర్ మెస్సైల్(క్యూఆర్ఎస్ఏఎమ్)ను ఉపయోగించి వాహనాన్ని ధ్వంసం చేసింది. శుక్రవారం ఒరిస్సాలోని బాలాషోర్ తీర ప్రాంతంనుంచి ప్రయోగాన్ని చేపట్టింది. నిన్న మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో చంఢీపుర్ ఐటీఆర్‌నుంచి క్షిపణిని గాల్లోకి ప్రయోగించగా ఎనిమిది సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 25-30 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 13 సెకన్ల నిడివి కలిగిన వీడియోలో క్షిపణి ప్రయోగించిన వెంటనే దట్టమైన పొగతో గాల్లోకి దూసుకుపోతున్న దృశ్యాలు ఉన్నాయి. ( సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి ) కాగా, భారత నౌకాదళం గత నెలలో తూర్పు నౌకాదళ పరిధిలో బంగాళాఖాతంలో క్షిపణి సామర్ధ్య యుద్ధనౌక ఐఎన్ఎస్ కోరా నుంచి నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అది గరిష్ట దూరంలోని తన లక్ష్యాన్ని సమర్ధవంతంగా ఛేదించింది. క్షిపణి ఢీకొట్టడంతో నౌక ధ్వంసమైంది. ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నేవీ వర్గాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
క్షిపణి ప్రయోగం సక్సెస్.. నేవీ ట్వీట్
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం శుక్రవారం చేసిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. తూర్పు నౌకాదళ పరిధిలో బంగాళాఖాతంలో క్షిపణి సామర్ధ్య యుద్ధనౌక ఐఎన్ఎస్ కోరా నుంచి ప్రయోగించిన నౌకా విధ్వంసక క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ‘ఇది గరిష్ట దూరంలోని తన లక్ష్యాన్ని సమర్ధవంతంగా ఛేదించింది. క్షిపణి ఢీకొట్టడంతో నౌక ధ్వంసమైంది. క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది..’ అని ప్రయోగం అనంతరం భారత నౌకాదళం ట్వీట్ చేసింది. ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోని నేవీ వర్గాలు విడుదల చేశాయి. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. (చదవండి: అందుకే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: ధనోవా) ఇటీవల అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ ప్రబల్ యుద్ధనౌక నుంచి ప్రయోగించిన యాంటీ షిప్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలో వీలర్ ఐలాండ్‌లో ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ వెహికల్ని ప్రయోగించింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, న్యూక్లియర్ పవర్ కలిగిన శౌర్య సూపర్ సోనిక్ మిస్సైల్, మిస్సైల్ సహాయక టార్పెడో.. మొదలైన ప్రయోగాలు కూడా విజయవంతం కావడంతో నౌకాదళవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత సమర్థమైన మిసైల్స్‌ని దేశీయంగా తయారు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. #IndianNavy #MissionDeployed & #CombatReady.#StrikeFirst #StrikeHard #StrikeSure#हरकामदेशकेनाम https://t.co/hf8cn3IkXL pic.twitter.com/Q7gb1sov5y — SpokespersonNavy (@indiannavy) October 30, 2020 -
రుద్రం.. శత్రు రాడార్లు ఇక ధ్వంసం
బాలాసోర్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి మన దేశం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వరసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ భారత వాయుసేనను బలోపేతం చేస్తోంది. శత్రు దేశాల రాడార్లను సర్వ నాశనం చేసే యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్–30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి కచ్చితంగా తన లక్ష్యాలను ఛేదించడం ఒక మైలురాయిగా నిలి చిపోయింది. దూర ప్రాంతాల నుంచి శత్రువుల రాడార్ వ్యవస్థ, ట్రాకింగ్, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్రం ప్రయోగం విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేసి, శాస్త్రవేత్తలను అభినందించారు. ఇప్పటికే నిర్భయ, శౌర్య వంటి క్షిపణుల్ని ప్రయోగించి చూసిన భారత్ ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి ప్రయోగంతో శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రుద్రం ప్రత్యేకతలు ► దీన్ని సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలతో ప్రయోగించవచ్చు. ► శత్రువుల రాడార్, సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్వీర్వం చేయగలదు. ► 0.6 మాక్ నుంచి 2 మాక్ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ► న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ (ఎన్‌జీఏఆర్‌ఎం) 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదిస్తుంది ► గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే ఈ వ్యూహాత్మక క్షిపణిలోని పాసివ్ హోమింగ్ హెడ్ శత్రు దేశ రక్షణ వ్యవస్థ రేడియేషన్‌ను తట్టుకుంటూ లక్ష్యాలను ఛేదిస్తుంది. ► ఐఎన్ఎస్–జీపీఎస్ ద్వారా దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. ► దీని ప్రయోగానంతరం శత్రుదేశాలు తమ రాడార్ వ్యవస్థను నిలిపివేసినా, ఇది లక్ష్యాలను నాశనం చేయగలదు. ► 2017లో అమెరికా ఈ తరహా యాంటీ రేడియేషన్ క్షిపణిని నావికా రంగంలో ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యం సాధించిన మూడేళ్లలోనే భారత్ అలాంటి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం విశేషం. -
భారత అమ్ములపొదిలో మరో అద్భుతం
భువనేశ్వర్: ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోలను భారత వైమానికి దళం విడుదల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువస్త్రా అని నామకరణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలసోర్‌లో జూలై 15, 16 తేదీల్లో క్షిపణి ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. హెలీనా (హెలికాప్టర్ ఆధారిత నాగ్ మిస్సైల్) ప్రత్యక్ష హిట్ మోడ్‌తో పాటు టాప్ అటాక్ మోడ్‌లోనూ లక్ష్యాలను చేధించగలదని అధికారులు వెల్లడించారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన హెలీనా ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ ఆయుధాలలో ఒకటి. ఇందులో అమర్చిన యాంటీ ట్యాంక్ గైడెడె వ్యవస్థ ద్వారా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. లాక్-ఆన్ బిఫోర్-లాంచ్ మోడ్‌లో పనిచేసే ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ (ఐఐఆర్) ద్వారా దీనికి మార్గదర్శకాలు అందుతాయి. దీనిలో అమర్చిన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా యుద్ధ ట్యాంకులను విచ్చిన్నం చేయగలదు. దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి హెలీనా సహాయపడుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. భారత వైమానిక దళంలో మరో కీలక ఆయుధంగా హెలీనా (ధ్రువస్త్రా)ని అభివర్ణిస్తున్నారు. (లద్దాఖ్‌కు యుద్ధ విమానాలు ) #WATCH Trials of Helicopter-launched Nag Missile (HELINA), now named Dhruvastra anti-tank guided missile in direct and top attack mode. The flight trials were conducted on 15&16 July at ITR Balasore (Odisha). This is done without helicopter. pic.twitter.com/Jvj6geAGLY — ANI (@ANI) July 22, 2020 -
అమెరికా క్షిపణి ప్రయోగం సక్సెస్
వాషింగ్టన్/మాస్కో: మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణిని అగ్రరాజ్యం అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. అణు సామర్ధ్యమున్న ఆయుధాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన కొద్ది వారాల్లోనే అమెరికా ఈ ప్రయోగం చేపట్టడం గమనార్హం. లాస్ఏంజెలెస్ సమీపంలోని సాన్ నికొలస్ దీవిలో ఆదివారం ఈ ప్రయోగం చేపట్టినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. భూమిపై నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిందని పేర్కొంది. అయితే, ఈ క్షిపణిలో అణ్వాయుధాలు లేవని పేర్కొంది. అమెరికా చర్యపై రష్యా, చైనా మండిపడ్డాయి. అమెరికా చర్య ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీస్తుందని విమర్శించాయి. -
భారత్‌ను సమర్థించిన అమెరికా
వాషింగ్టన్: ఉపగ్రహాలను కూల్చివేయగల క్షిపణి సామర్థ్యాన్ని భారత్ సమకూర్చుకోవడాన్ని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ పేర్కొంది. అంతరిక్షంలో ఎదురయ్యే ప్రమాదాలపై భారత్ అప్రమత్తంగా ఉందని కితాబునిచ్చింది. మార్చి 27వ తేదీన భారత్ శాస్త్రవేత్తలు తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని భూమి నుంచి ప్రయోగించిన క్షిపణితో ఢీకొట్టి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ శక్తి కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా సరసన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. భారత్ ప్రయోగంపై అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ కమాండర్ జనరల్ జాన్ ఈ.హైటెన్ సెనేట్ కమిటీ ఎదుట ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. ‘అంతరిక్షం నుంచి తమ దేశానికి ముప్పు పొంచి ఉందని భావించిన భారత్ ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగంతో తనను తాను రక్షించుకోగల సామర్థ్యం ఉందని ఆ దేశం భావిస్తోంది. భారత్ మన మిత్ర దేశం అయినందున, ఇలాంటి వాటిపై వ్యతిరేకంగా మాట్లాడలేం’ అని పేర్కొన్నారు. ‘అంతరిక్షాన్ని సురక్షితంగా మార్చేందుకు అంతర్జాతీయ సమాజం కొన్ని నిబంధనలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఆ శకలాల్లో అధిక భాగం అమెరికా కారణంగా ఏర్పడినవే’ అని తెలిపారు. ఏశాట్ ప్రయోగం కారణంగా అంతరిక్షంలో 400 శకలాలు ఏర్పడ్డాయని, వీటిలో 24 శకలాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు ముప్పుగా మారాయంటూ ఇటీవల నాసా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు జరిగాయన్నారు. (చదవండి: ‘శక్తి’మాన్ భారత్) -
అవి 45 రోజుల్లో మాయం
న్యూఢిల్లీ: అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంస క్షిపణి ప్రయోగం ‘మిషన్ శక్తి’తో అంతరిక్షానికి ముప్పు ఉంటుందన్న నాసా వాదనల్ని భారత్ మరోసారి కొట్టిపారేసింది. ఈ ప్రయోగం కోసం తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్యను ఎంచుకున్నామని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి చెప్పారు. దీంతో అంతరిక్షంలోని నిర్మాణాలు, ఇతర ఆస్తులకు శకలాల బెడద లేదని వివరణ ఇచ్చారు. రాబోయే 45 రోజుల్లో ఆ శకలాలు నిర్వీర్యమవుతాయని అన్నారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో సతీశ్ రెడ్డి మాట్లాడుతూ కొత్త ఇంటర్సెప్టార్ క్షిపణితో భూమి నుంచి 300 కి.మీ ఎత్తులోని కక్ష్య(ఎల్ఈవో)లో ఏశాట్ ప్రయోగం నిర్వహించామని తెలిపారు. కొన్ని శకలాలు పైకక్ష్యలోకి వెళ్లే అవకాశాలున్నాయని, కానీ వాటితో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వచ్చే ముప్పేమీ లేదని చెప్పారు. ప్రయోగం ముగిసిన తొలి పది రోజులు కీలకమని, ఆ గడువు సజావుగా ముగిసిందని ఆయన వెల్లడించారు. ఆ క్షిపణికి వేయి కిలో మీటర్ల పరిధిలో గల లక్ష్యాలను కూడా తాకే సామర్థ్యం ఉందని వెల్లడించారు. ఒకే సారి ఒకటి కన్నా ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే సత్తా ఏశాట్‌కు ఉందా? అని ప్రశ్నించగా, బహుళ లాంచర్లతో అది సాధ్యమేనని అన్నారు. అంతకుముందు, ఉదయం ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశమై ఏశాట్ ప్రయోగం గురించి వివరించినట్లు తెలిపారు. తెలివితక్కువ ప్రభుత్వాలే రక్షణ శాఖ రహస్యాలను బహిర్గతం చేస్తాయన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఏశాట్ గమనాన్ని ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నారని, ఇలాంటి ప్రయోగాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్నారు. ఆరు నెలలు.. 150 మంది శాస్త్రవేత్తలు: మార్చి 27న ఏశాట్ క్షిపణితో భారత్ తన సొంత ఉపగ్రహాన్ని కూప్పకూల్చి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా రష్యా, అమెరికా, చైనా సరసన నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం 40 మంది మహిళలు సహా మొత్తం 150 మంది శాస్త్రవేత్తలు ఆరు నెలల పాటు రేయింబవళ్లు శ్రమించారు. 50 ప్రైవేట్ సంస్థల నుంచి ఇందుకు అవసరమైన సామగ్రిని సమకూర్చాం. ప్రయోగం నిర్వహించాలని కేంద్రానికి 2014లో ఆలోచన వచ్చినా 2016లో అనుమతిరావడంతో ఏర్పాట్లు చేశారు. ప్రయోగం విజయవంతంగా ముగిశాక అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా స్పందిస్తూ ఏశాట్ ప్రయోగంతో అంతరిక్షంలో 400 శకలాలు పోగయ్యాయని ఆక్షేపించిన సంగతి తెలిసిందే. -
‘మిషన్ శక్తి’తో ఐఎస్ఎస్కు ముప్పు
వాషింగ్టన్: శత్రుదేశాల ఉపగ్రహాలు కూల్చేసేందుకు ఇటీవల భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి (ఏశాట్) పరీక్ష వల్ల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికే (ఐఎస్ఎస్) ముప్పు వాటిల్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించింది. ఆ ప్రయోగం వల్ల అంతరిక్షంలో దాదాపు 400 వ్యర్థ శకలాలు పోగుపడ్డాయని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టిన్ తెలిపారు. దీంతో ఐఎస్ఎస్ను వ్యర్థాలు ఢీకొనే ప్రమాదం 44 శాతం పెరిగిందన్నారు. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాలను కూల్చేయగల చరిత్రాత్మక ‘మిషన్ శక్తి’ని విజయవంతంగా భారత్ ప్రయోగించినట్లు ప్రధాని మోదీ మార్చి 27న వెల్లడించడం తెల్సిందే. 60 వ్యర్థ శకలాలను గుర్తించామని, అందులో 24 ఐఎస్ఎస్కు అతి దగ్గరలో ఉన్నాయని బ్రైడెన్‌స్టిన్ చెప్పారు. ‘అంతరిక్షంలోకి వ్యర్థాలను పంపడం చాలా ఘోరమైన చర్య. అది కూడా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి దగ్గరగా పంపడం దారుణం. భవిష్యత్తులో మానవులు అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలకు ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయి’అని చెప్పారు. మిషన్ శక్తిలో భాగంగా భారత్ తన ప్రయోగాన్ని వాతావరణ దిగువ పొరల్లోనే చేయడం వల్ల శకలాలు కొన్ని వారాల వ్యవధిలోనే వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసినా అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. భారత్ ఏశాట్ పరీక్షకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయం నుంచి మాట్లాడిన తొలి వ్యక్తి బ్రైడెన్‌స్టిన్ కావడం గమనార్హం. శకలాల వల్ల ఐఎస్ఎస్కు ముప్పు పొంచి ఉందనే విషయాన్ని నాసా నిపుణులు, జాయింట్ స్పేస్ ఆపరేషన్స్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెప్పినట్లు బ్రైడెన్‌స్టిన్ తెలిపారు. 2007లో చైనా ఇలాంటి ప్రయోగమే చేపట్టడం వల్ల పోగుపడ్డ శకలాలు ఇంకా అంతరిక్షంలోనే ఉన్నాయని గుర్తు చేశారు. -
భారత్‌పై నిఘా పెట్టలేదు
వాషింగ్టన్: భారత్ ఇటీవల చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ–శాట్ పరీక్షపై నిఘా పెట్టినట్లు వస్తున్న వార్తలను అమెరికా రక్షణశాఖ ఖండించింది. భారత్ ఏ–శాట్ ప్రయోగాన్ని చేపడుతుందన్న విషయం తమకు ముందుగానే తెలుసని అమెరికా రక్షణశాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్.డబ్ల్యూ.ఈస్ట్‌బర్న్ చెప్పారు. ‘ప్రయోగం గురించి మాకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రయోగం కోసం నిర్ణీత ప్రాంతంలో విమానాల రాకపోకలను భారత్ నిషేధించింది. ఈ విషయాన్ని ముందురోజే చెప్పింది’ అని అన్నారు. 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని గత గురువారం∙ఏశాట్ క్షిపణి కూల్చివేసింది. దీంతో అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అయితే ఈ ప్రయోగం జరిగిన కొన్ని నిమిషాలకే అమెరికాకు చెందిన ‘ఆర్సీ–135ఎస్ కోబ్రా బాల్’ నిఘా విమానం బంగాళాఖాతంపై ప్రయాణిస్తూ వివరాలను సేకరించింది. మోదీపై బీఎస్ఎఫ్ జవాన్ పోటీ ఛండీగఢ్: జవాన్లకు నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ రెండేళ్ల క్రితం వీడియో పోస్ట్ చేసి ఉద్యోగం కోల్పోయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్‌బహదూర్ యాదవ్ వారణాసిలో ప్రధాని మోదీపై పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని, ఒకవేళ గెలుపొందితే సాయుధ బలగాల్లో అవినీతి నిర్మూలనకు కృషిచేస్తానని ఆయన శుక్రవారం చెప్పారు. అవినీతి గురించి గళం విప్పినందుకే తనకు ఉద్వాసన పలికారని అన్నారు. నియంత్రణ రేఖ వెంట విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ 2017లో యాదవ్ ఆన్లైన్లో పోస్ట్ పెట్టగా, క్రమశిక్షణా చర్యల కింద ఆర్మీ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీకి ఈసీ క్లీన్చిట్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి శుక్రవారం ఊరట లభించింది. ఉపగ్రహ విధ్వంస క్షిపణి(ఏ–శాట్) ప్రయోగంపై ప్రధాని ప్రసంగం ఎన్నికల నిబంధనలకు లోబడే ఉందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ప్రధాని ప్రసంగం ఎక్కడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఉన్నతాధికారులతో తాము ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేయగల ఏ–శాట్ క్షిపణిని ‘మిషన్ శక్తి’ పేరుతో విజయవంతంగా పరీక్షించినట్లు మోదీ బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. భూదిగువ కక్ష్యలో 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని ఏ–శాట్ కేవలం 3 నిమిషాల్లో కూల్చివేసిందని వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం సంతరించుకున్న నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని పేర్కొన్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాని ఈ ప్రసంగం ద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ప్రతిపక్షాలు ఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదుచేశాయి. -
అస్త్ర క్షిపణి ప్రయోగం సక్సెస్
బాలాసోర్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన, గగనతలం నుంచి గగనతలంలోని సుదూర లక్ష్యాలను ఛేదించగల ‘అస్త్ర’ క్షిపణిని శాస్త్రవేత్తలు బుధవారం విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమబెంగాల్లోని కలైకుండా ఐఏఎఫ్ స్థావరం నుంచి సుఖోయ్–30యుద్ధవిమానం నుంచి దీన్ని ప్రయోగించగా నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)తో పాటు మరో 50 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ క్షిపణి రూపకల్పనలో పాల్గొన్నాయి. ఈ ఆయుధాన్ని ప్రయోగించేందుకు వీలుగా సుఖోయ్–30 విమానాన్ని హాల్ ఆధునీకరించింది. 154 కిలోల బరువు, 3.57 మీటర్ల పొడవున్న అస్త్ర క్షిపణి 20 కి.మీ నుంచి 110 కి.మీ దూరంలో ఉన్న గాల్లోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 15 కేజీల వార్‌హెడ్‌ను మోసుకుని 4.5 మ్యాక్(గంటకు 5556.6 కి.మీ) వేగంతో వెళ్తుంది. -
సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్: తక్కువ ఎత్తులో దూసుకొచ్చే బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగల స్వదేశీ సూపర్సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణిని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రయోగంలో భాగంగా పృథ్వీని శత్రు క్షిపణిలా మార్చి సూపర్సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణికి లక్ష్యంగా నిర్దేశించారు. అబ్దుల్ కలాం దీవిలో ఏఏడీ (అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్) సూపర్సోనిక్ క్షిపణిని మోహరించారు. దీనిలోని రాడార్ల ద్వారా పృథ్వీకి సంబంధించిన సంకేతాలు అందుకున్న ఇంటర్సెప్టార్ క్షిపణి గాలిలోనే పృథ్వీని ఢీకొట్టింది. 7.5 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణిలో అధునాతన వ్యవస్థలున్నాయి. -
ఏపీలో క్షిపణి పరీక్ష కేంద్రానికి గ్రీన్ సిగ్నల్..!
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్రం ఏర్పాటుకు న్యాయశాఖ నుంచి పూర్తి అనుమతులు వచ్చినట్లు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో పర్యావరణ శాఖ నుంచి కూడా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి అనుమతులు రానున్నాయని వెల్లడించారు. మొత్తం 1600 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు మరో మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం శుంకుస్థాపన చేయనుంది. కాగా, క్షిపణి ప్రయోగాల్లో అగ్రదేశాలకు ధీటుగా దూసుకుపోతున్న భారత్‌లో ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో అబ్దుల్ కలాం క్షిపణి ప్రయోగ కేంద్రం ఒక్కటే ఉండడం విశేషం. -
‘ఎయిర్ క్యావల్రీ’ ప్రయోగం
జైపూర్: శత్రుసైన్యంపై మరింత వ్యూహాత్మకంగా దాడి చేసేందుకు భారత ఆర్మీ ‘ఎయిర్ క్యావల్రీ’ అనే నూతన విధానాన్ని ఇటీవల పరీక్షించింది. భూమిపై ఉన్న శత్రువులను కనిపెట్టి వారిపై దాడి చేసేందుకు వియత్నాం యుద్ధం సమయంలో అమెరికా ఈ విధానాన్ని ఉపయోగించింది. భవిష్యత్తు కాలానికి అను గుణంగా రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడం కోసం భారత సైన్యం ఎయిర్ క్యావల్రీ విధానాన్ని రాజస్తాన్‌లోని ఎడారి ప్రాంతంలో ఈ పరీక్ష జరిపింది. ‘విజయ్ ప్రహార్’ పేరుతో భారత సైన్యం నైరుతి విభాగం ఈ కొత్త పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించిందని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ ఓజా చెప్పారు. ఈ విధానంలో భూమిపై ఉన్న యుద్ధ ట్యాంకులు, దళాలతో సమన్వయం చేసుకుంటూ హెలికాప్టర్లు శత్రు సైన్యం, శిబిరాలపై దాడులు చేస్తాయి. -
పాక్‌కు ‘పవర్ఫుల్’ క్షిపణి
బీజింగ్: శత్రు దేశాల క్షిపణులను గుర్తించి ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ చైనా నుంచి అత్యంత శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసినట్లు తెలిసింది. బహుళ వార్హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల అభివృద్ధికి నాలుగు టెలిస్కోపులతో కూడిన అత్యాధునికమైన ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నారు. కొత్త క్షిపణులను పరీక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ ఇప్పటికే దీన్ని రహస్య ప్రదేశంలో వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడైంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (సీఏఎస్) పరిశోధకుడు ఒకరిని ఉటంకిస్తూ హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ గురువారం ఈ విషయాలను కథనం రూపంలో ప్రచురించింది. అయితే పాకిస్తాన్ ఈ కొనుగోలు ఒప్పందానికి ఎంత వెచ్చించిందో వెల్లడించలేదు. అత్యాధునిక క్షిపణి నిఘా వ్యవస్థను పాకిస్తాన్‌కు చైనా అమ్మినట్లు సీఏఎస్ పరిశోధకుడు జెంగ్ మెంగ్వెయ్ రూఢీ పరచినట్లు ఆ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్‌కు అంతటి శక్తివంతమైన ఆయుధాన్ని సమకూర్చిన తొలి దేశం చైనాయేనని సీఏఎస్ వెబ్సైట్లో సమాచారం ఉంది. భారత్ ఇటీవల అగ్ని–5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలోనే పాక్‌కు చైనా ఈ ఆయుధా న్ని అమ్మిందని భావిస్తున్నట్లు పేర్కొంది. సాధారణంగా క్షిపణి నిఘా వ్యవస్థలకు రెండు టెలిస్కోపులు ఉంటాయని.. కానీ, పాక్ కొనుగోలు చేసిన వ్యవస్థకు నాలుగు టెలిస్కోపులు ఉన్నాయంది. దీంతో ఏకకాలంలో వేర్వేరు దిక్కుల నుంచి వస్తున్న క్షిపణులను గుర్తించడం సులభమవుతుందని పేర్కొంది. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
పోఖ్రాన్: రాజస్థాన్‌లోని పోఖ్రాన్ క్షిపణి కేంద్రం నుంచి బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించారు. సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి చివరిసారిగా 2017 నవంబర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం సుఖోయి -30 ఎంకేఐ నుంచి పరీక్షించారు. గత సంవత్సరం దుబాయ్ ఎయిర్ షోలో కూడా బ్రహ్మోస్ ప్రదర్శన జరిగింది. పలు దేశాల సైనికాధికారులు కూడా వీటిని కొనేందుకు చాలా ఆసక్తి చూయించారు. బ్రహ్మోస్ గురించి కొన్ని వాస్తవాలు - బ్రహ్మోస్ ఒక మాధ్యమ శ్రేణి రామ్‌జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. - భూమి, గాలి మరియు సముద్రం నుండి దీనిని ప్రయోగించవచ్చు. - ఇది భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), రష్యన్ ఫెడరేషన్ ఎన్పీఓ మాషినోస్రోయేనియాల ఉమ్మడి వెంచర్. - బ్రహ్మోస్ అనే పదం భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది(Brahmaputra) మొదటి నాలుగు అక్షరాలు, రష్యాలోని మాస్కోవా నది(Moskva) పేరులోని మొదటి మూడు అక్షరాలన నుంచి వచ్చింది. - గతంలో బ్రహ్మోస్ 2.8 నుంచి 3.0 మాక్‌ల వేగంతో ప్రయాణించేది. ఇప్పుడు దీని వేగం 5.0 మాక్‌లకు అప్‌గ్రేడ్ చేశారు. (మాక్ = 1234.8 కిలోమీటర్/అవర్)ఇది మాక్ - ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి. - ఇది 2006 నుంచి సేవలందింస్తోంది. -
వహ్వా...బ్రహ్మోస్!
దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచే కృషిలో మేలిమలుపుగా భావించే కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. మన వాయుసేనకు అందించబోయే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను శాస్త్రవేత్తలు తొలిసారి విజయవంతంగా ప్రయో గించారు. సుఖోయ్ యుద్ధ విమానంతో అనుసంధానించిన ఈ క్షిపణి ప్రయోగించిందే తడవుగా ధ్వనిని మించి మూడు రెట్ల వేగంతో దూసుకుపోయి బంగా ళాఖాతంలోని లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేసిన కృషిని స్మరించుకోవాలి. శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు మన దేశ రక్షణకు పటిష్టమైన క్షిపణి వ్యవస్థ అవసరమని పాలకులను ఒప్పించింది ఆయనే. 1998లో రష్యాతో బ్రహ్మోస్ క్షిపణులపై ఒడంబడిక కుదరడంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. మన బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లు అనుసంధానించి ఈ ప్రాజెక్టుకు ‘బ్రహ్మోస్’ అని పేరుపెట్టారు. ఇప్పటికే బ్రహ్మోస్ మన సైనిక, నావికా దళాల అస్త్ర తూణీరంలో చేరింది. వాస్తవానికి వాయుసేనకు సైతం 2012కల్లా దీన్ని అందించాలని మొదట్లో అనుకున్నారు. అయితే అందులోని సాధకబాధకలు తక్కువేమీ కాదు. క్షిపణిని మోసుకెళ్లడానికి అనువుగా సుఖోయ్ యుద్ధ విమానాలను తీర్చిదిద్దడం ఒక సవాలు. అదే సమ యంలో అటు క్షిపణి బరువు కూడా తగ్గాలి. మన శాస్త్రవేత్తలు ఈ రెండూ సాధించగలిగారు. సుఖోయ్ యుద్ధ విమానానికి అవసరమైన మార్పుల్ని వాటిని సరఫరా చేసిన రష్యా రక్షణ రంగ సంస్థ సాంకేతిక తోడ్పాటు అవసరం లేకుండానే నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) శాస్త్రవేత్తలు సవ రించారు. అలాగే సైనిక, నావికాదళాల అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మోస్ క్షిపణుల బరువు 3,000 కిలోలుంటే, సుఖోయ్‌కి అమర్చింది 2,500 కిలోలు మించలేదు. బ్రహ్మోస్ క్షిపణిని సుఖోయ్ యుద్ధ విమానం అవలీలగా మోసుకెళ్లడం, అది లక్ష్యాన్ని ఛేదించడం వెనక ఇంతటి విస్తృతమైన కృషి ఉంది. ఇది ఇంతటితో అయిపోలేదు. ఒక్క సుఖోయ్ మాత్రమే కాదు... వాయుసేన వద్ద ఉన్న మిగ్–29 యుద్ధ విమానాలకూ, నావికాదళం వినియోగించే మిగ్–29కె యుద్ధ విమానా లకూ, భవిష్యత్తులో మనకు సమకూరబోయే రాఫెల్ జెట్ విమానాలకు సైతం బ్రహ్మోస్ క్షిపణులు అమర్చడానికి మన శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాదు... ప్రస్తుత బ్రహ్మోస్ లక్షిత దూరం 290 కిలోమీటర్లనూ 450 కిలోమీటర్లకు పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అసలు మూడు బ్రహ్మోస్ క్షిపణులు మోసుకెళ్లగలిగే రీతిలో సుఖోయ్ యుద్ధ విమానాలను రూపొందించాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. సుఖోయ్ రెక్కలవద్ద చెరొకటి, మధ్యలో ఒకటి ఈ క్షిపణులు అమర్చవచ్చునని, అదే జరిగితే యుద్ధ విమానం ఒకసారి గాల్లోకి లేచాక మూడు లక్ష్యాలను దెబ్బతీసే సామర్ధ్యాన్ని సంత రించుకుంటుందని భావించారు. అయితే వివిధ అధ్యయనాల తర్వాత ఆ స్థాయి మార్పులు సాంకేతికంగా క్షేమకరం కాదని, అటు ఆర్ధికంగా కూడా పెనుభార మవుతుందని తేల్చారు. అందుకే ఆ యోచనను విరమించుకుని ఒకసారి ఒక క్షిపణిని తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. నిరుడు సుఖోయ్‌కు బ్రహ్మోస్ క్షిపణిని అమర్చి తొలిసారి వినువీధికి పంపారు. ఇప్పుడు దాన్ని ప్రయోగించి చూశారు. అటు సుఖోయ్ యుద్ధ విమానమూ, ఇటు బ్రహ్మోస్ క్షిపణి సామాన్యమైనవి కాదు. శత్రువు తేరుకుని స్పందించేలోపునే దాడి చేసి వెనక్కు రాగల సామర్ధ్యం సుఖోయ్‌ల సొంతం. క్షిపణుల్ని అల్లంత దూరాన ఉండగానే పసిగట్టి వాటిపై ఎదురుదాడి చేయగల నౌకలు చాలా దేశాలకున్నాయి. కానీ బ్రహ్మోస్ క్షిపణి ముందు వాటి ఆటలు సాగవు. అవి దాడికి దిగేలోపే ఆ నౌకలను బ్రహ్మోస్ భగ్గున మండించి మసి చేస్తుంది. లోతైన బంకర్లలో దాగిన విధ్వంసక ఆయుధ సామగ్రి, అణ్వాయుధాలు, జీవ ఆయుధాల గిడ్డంగులను సైతం కనిపెట్టి ధ్వంసం చేయడం బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత. ప్రపంచంలోని ఏ యుద్ధ నౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు. అమెరికా తోమహక్, హర్పూన్ క్షిపణుల కంటే కూడా బ్రహ్మోస్ మేలైనది. ఎంతటి సంక్లిష్ట మార్గంలోనైనా వెళ్లగలగడం, పరిసరాల్లో ఎలాంటి విధ్వంసం సృష్టించకుండా కేవలం నిర్దేశించిన లక్ష్యాన్ని మాత్రమే దెబ్బతీయడం బ్రహ్మోస్ విశిష్టత. బ్రహ్మోస్ క్షిపణì కేవలం స్వీయ రక్షణకు మాత్రమే కాదు.... దాన్ని వేరే దేశాలకు విక్రయించడం కూడా భారత్–రష్యాల మధ్య కుదిరిన ఒడంబడికలోని కీలకాంశం. ఆ క్షిపణుల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి, మార్కెటింగ్ చేయాలన్నది ఆ ఒడంబడిక సారాంశం. బ్రహ్మోస్ క్షిపణులను దక్షిణాఫ్రికా, వియత్నాం, యూఏఈలకు విక్రయించడంపై ఇప్పటికే అంగీకారం కుదిరింది. వాణిజ్యపరంగా కూడా ఇది లాభసాటి కావడం శుభ పరిణామం. 1990 నాటి గల్ఫ్ యుద్ధం సమ యంలో క్రూయిజ్ క్షిపణుల అవసరం అందరికీ తెలిసివచ్చింది. ఈ క్షిపణుల కోసం ఎవరిపైనో ఆధారపడే పరిస్థితి ఉండరాదని డాక్టర్ అబ్దుల్ కలామ్ మొదట్నించీ పట్టుబట్టారు. అందుకే సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి, ఉత్పత్తి చేసు కోవడానికి అనువుగా రష్యాతో కలిసి సంయుక్త రంగంలో బ్రహ్మోస్ ప్రాజెక్టును ప్రారంభించారు. రక్షణ రంగంలో పటిష్టంగా ఉన్నప్పుడే శత్రు దేశాలు దాడికి జంకుతాయి. నిజానికి ఆ విషయంలో చాలా దేశాలకన్నా మన దేశం ఇంకా వెన కబడే ఉంది. రక్షణ కొనుగోళ్లకు సంబంధించి ప్రయత్నాలు సాగించినప్పుడల్లా కుంభకోణాల కథనాలు గుప్పుమనడం మన దేశంలో రివాజుగా మారింది. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం, బరాక్ క్షిపణుల స్కాం మొదలుకొని అన్నిటి విషయంలోనూ ఇదే వరస. అందుకే రక్షణ రంగంలో స్వావలంబన సాధించి సాధ్యమైనంతవరకూ దిగుమతులపై ఆధారపడకుండా చూసుకోగలగాలి. అలా చూస్తే మన బ్రహ్మోస్ విజయవంతమైన ప్రాజెక్టు . ఇది మరిన్ని రక్షణ రంగ ప్రాజె క్టులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, మన దేశాన్ని ఆ రంగంలో అగ్రగామిగా నిలుపు తుందని ఆశించాలి. -
అమెరికాను ధిక్కరించి క్షిపణి పరీక్ష
టెహ్రాన్: అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఇరాన్ శనివారం మధ్య శ్రేణి క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఖోరంషాహ్ర్ అనే ఈ క్షిపణిని శుక్రవారమే ఇరాన్ సైనిక కవాతులో ప్రదర్శించింది. 2,000 కిలో మీటర్ల లోపు దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదనీ, బహుళ సంఖ్యలో వార్హెడ్లను మోసుకెళ్లగలదని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్ శత్రుదేశాలైన ఇరాక్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. 2015లో ఇరాన్‌కు, ఇతర ప్రధాన దేశాలకు అణు పరీక్షల నిషేధంపై ఒప్పందం కుదిరింది. అమెరికాతోపాటు బ్రిటన్, చైనా, రష్యా, యూరోపియన్ కూటమి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2025 వరకు అమలులో ఉండే ఈ ఒప్పందం ప్రకారం అణ్వస్త్ర పరీక్షలు జరపకుండా ఇరాన్‌పై ఆంక్షలున్నాయి. క్షిపణి పరీక్షలను జరిపితే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని అమెరికా హెచ్చరిస్తున్నా ఇరాన్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఐరాస సర్వసభ్య సమావేశంలోనూ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్ అశాంతిని రగిలిస్తోందనీ, అది రక్తపాతం, కల్లోలం, హింసను ఎగుమతి చేసే ధూర్త దేశం అని నిప్పులు చెరగడం తెలిసిందే. -
పారిపోండి.. జపనీయులను వణికించిన కిమ్
టోక్యో : సాధ్యమైనంతమేరకు కేకలు, పెద్ద పెద్ద అరుపులు.. అంతకు మించి భారీ లౌడ్ స్పీకర్ల శబ్దాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.. అణు క్షిపణి వస్తోంది.. అణు క్షిపణి వస్తోంది అంటూ అందులో హాహాకారాలు మాదిరి హెచ్చరికలు వినిపించాయి. వీలైతే భవనాల్లోకి వెళ్లండి లేదంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోండి అంటూ సూచనలు వచ్చాయి. ఇవి సరిగ్గా ఉత్తర కొరియా మరోసారి ప్రపంచ హెచ్చరికలు లెక్కచేయకుండా ఖండాంతర అణు క్షిపణిని పరీక్షించినప్పుడు అది వెళ్లిన జపాన్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు వ్యక్తం చేసిన భయాందోళనలు. ఉదయం నుంచే ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష చేస్తుందట అంటూ అత్యవసర ఫోన్ కాల్లు చేసుకోవడం, లౌడ్ స్పీకర్ల ద్వారా సమాచారం అందించుకోవడం చేసుకున్నారు. దాదాపు జపాన్‌లోని మిలియన్ల మంది వేకువ జామునే వణికి పోయారు. ప్రపంచ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర అణు క్షిపణి ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. తాజాగా చేసిన క్షిపణి లక్షిత దూరం 3,700 కిలోమీటర్లు. అంటే సరిగ్గా అమెరికాకు చెందిన భూభాగం గ్వామ్‌ను చేరి ధ్వంసం చేసేంత. అయితే, ఈ క్షిపణిని మరోసారి కూడా ఉత్తర కొరియా జపాన్ మీదుగానే ప్రయోగించింది. దీంతో అది ఎక్కడ తమపై కూలిపోతుందో అని జపాన్ ప్రజలు బెంబేలెత్తిపోయారు. వారి భయం ప్రకారమే అది నిజంగా పడితే జరిగే ధ్వంసం ఊహించలేం. ముఖ్యంగా ఎరిమో, హోక్కైడోవంటి నగరాల ప్రజలు మాత్రం దాదాపు ప్రాణాలు అరచేతబట్టుకున్నారంట, 'ఒక భారీ క్షిపణి తమ నగరంపై నుంచి ప్రయాణిస్తుందనే విషయం విని మేం నిలకడగా ఉండలేకపోయాం. అది వినడానికే భయంగా ఉంది' అని ఓ జపాన్ పౌరుడు చెప్పగా.. నిజంగా మేం చాలా భయపడ్డాం. అది 2000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్‌లో పడుతుందని విన్నాను. సరిగ్గా అది వెళ్లే మార్గంలో పడిపోయే మార్గంలో నావి 16 నౌకలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా సురక్షితమైన భవనాల్లోకి వెళ్లండి అని చెప్పింది.. కానీ, మేం ఆ సమయంలో ఏం చేయలేకపోయాం. ఇప్పటకే రెండుసార్లు ఇలా జరిగింది. ఇక నుంచి మాకు విశ్రాంతి ఉండదేమో' అంటూ మరొకరు చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు ఉత్తర కొరియా క్షిపణితో దాదాపు వణికిపోయారు. -
రాజుకుంటున్నకొరియా కొలిమి!
-
రాజుకుంటున్నకొరియా కొలిమి!
► మరో క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా! ‘క్షిపణి, అణ్వాయుధ పరీక్షలతో కవ్వింపు చర్యలకు దిగొద్దని ఎంత చెప్పినా వినకుండా ‘ధూర్తదేశం’ యుద్ధానికి రమ్మంటూ అడుక్కుంటోంది’ అంటూ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నికీ హేలీ ఉత్తర కొరియాకు చేసిన హెచ్చరిక పనిచేయడం లేదు. తాజాగా ఉత్తర కొరియా తన పశ్చిమ తీరానికి ఖండాంతర క్షిపణిలా కనిపిస్తున్న రాకెట్‌ను తరలించినట్టు దక్షిణ కొరియా తెలిపింది. దీనిని ఎప్పుడు పరీక్షిస్తారనే సమాచారం తమవద్ద లేదంది. ఉత్తర కొరియా ఆదివారం ఆరో అణు పరీక్ష జరపడం అమెరికా ఆగ్రహానికి కారణమైంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అణుయుద్ధానికి కిమ్ ఏ క్షణాన్నైనా తెరలేపవచ్చనే భయాందోళనలు ప్రపంచదేశాలను చుట్టుముడుతున్నాయి. కిమ్ బెదిరిస్తున్నట్టుగా అమెరికా భూభాగాన్నిగాని, మిత్రదేశాలనుగాని లక్ష్యంగా చేసుకుని ఉత్తరకొరియా క్షిపణులను ప్రయోగిస్తే భారీ సైనిక స్పందన తప్పదని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ హెచ్చరించారు. కిమ్ ఆగడాలకు అమెరికా ప్రతిచర్య క్రూరంగా ఉంటుందని ఆ దేశ ఆర్మీ రిటైర్డ్ జనరల్ అన్నారు. అగ్రరాజ్య నేతలు ఇలా తీవ్రపదజాలంతో కిమ్‌ను దారిలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. దక్షిణ కొరియా పక్కలో బల్లెం కమ్యూనిస్ట్ కొరియా! ఉత్తర కొరియా ఎంతగా కవ్విస్తున్నా లిబియా, ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో మాదిరిగా సాయుధ దాడికి అమెరికా దిగటం లేదు. ఇందుకు ప్రధాన కారణం మిత్రదేశం దక్షిణ కొరియాపై కిమ్ ప్రభుత్వం ఎక్కుపెట్టిన మారణాయుధాలే. దాయాది దేశమైన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా తన సరిహద్దుల్లో నిలిపిన భారీ ఫిరంగులు, రాకెట్లు ఇతర దూరశ్రేణి ఆయుధాలే అమెరికాకు అడ్డంకిగా మారాయి. అగ్రరాజ్యం దాడికి దిగిన వెంటనే కిమ్ ఈ ఆయుధాలను ప్రయోగిస్తే రెండు కోట్ల 50 లక్షల జనాభా ఉన్న సియోల్ వల్లకాడుగా మారుతుంది. పౌరులు అంచనావేయలేనంత భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతారు. కిమ్ దేశంపై ప్రతీకార దాడి చేయడానికి అమెరికా ఈ కారణంగానే వెనుకాడుతోందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం సాధ్యమేనా? అమెరికా అండతో ఆర్థికశక్తిగా ఎదిగిన దక్షిణ కొరియాకు ఆయుధాల సరఫరా ఆపి, ఏటా చేస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలకు స్వస్తి పలకాలనేది ఉత్తర కొరియా డిమాండ్. క్షిపణి, అణు పరీక్షల ద్వారా అమెరికాను తన డిమాండ్లకు ఒప్పుకునేలా చేయడమే కిమ్ వ్యూహం. ఒకవేళ అమెరికా నాయకత్వాన దక్షిణ కొరియా, జపాన్‌లు కిమ్ రాజ్యంపై యుద్ధం ప్రారంభిస్తే భారత్ సహా దక్షిణాసియా దేశాలకు ఆర్థికంగా నష్టం తప్పదు. అనేక శక్తిమంతమైన దేశాలతో ఉత్తర కొరియాకు వాణిజ్య సంబంధాలున్నాయి. కొరియా ద్వీపకల్పంలో యుద్ధానికి దిగి విజయం సాధించి, కిమ్ సర్కారును కూల్చే స్థితిలో అమెరికా లేదు. యుద్ధమే వస్తే దక్షిణ కొరియాలో ఉన్న సేనలు, ఆయుధాలు అమెరికా దాడి చేయడానికి సరిపోవు. అదనపు బలగాలు, ఆయుధాలు, యుద్ధ సామగ్రిని దక్షిణ కొరియాకు తరలించడానికి వారాలు, నెలలు పడుతుంది. అమెరికా చేసే తొలి దాడికి బీ2, బీ–52, ఎఫ్–22 స్టెల్త్ ఫైటర్ విమానాలు అవసరమౌతాయి. గ్వామ్‌లోని అమెరికా వైమానిక స్థావరం నుంచి ఈ తరహా విమానాలతో దాడులు చేయాల్సి ఉంటుంది. ‘‘వారం క్రితంతో పోల్చితే యుద్ధానికి ఇప్పుడు దగ్గరగా లేము. పదేళ్ల కిందటి పరిస్థితితో పోల్చితే మాత్రం ఉత్తర కొరియాతో పోరుకు సమీపంలో ఉన్నామని చెప్పగలం’’ అని అమెరికా సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో, ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు, ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఆర్ మెకాస్టర్లు మీడియాకు చెప్పిన మాటలద్వారా తక్షణం యుద్ధప్రమాదం లేదని అనుకోవచ్చు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జపాన్‌కు వణుకు పుట్టిస్తున్న కిమ్
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. జపాన్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి అచ్చం గల్ఫ్ యుద్ధ సమయంలోని స్కడ్ మిసైల్ తరహాలోనిదే. ఇది ఏకంగా 450 కిలోమీటర్ల దూరం వెళ్లి సరిగ్గా జపాన్ వాళ్ల ప్రత్యేక ఆర్థికమండలిలో ల్యాండ్ అయింది. అంటే, తాము ఏ క్షణంలోనైనా జపాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒకరకంగా కిమ్ హెచ్చరించినట్లే అయింది. గడిచిన మూడు వారాల్లో ఉత్తరకొరియా ఇలా క్షిపణి పరీక్షలు చేయడం ఇది మూడోసారి. తమ ఆయుధ సామర్థ్యం ఇదీ అని కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఈసారి ప్రయోగించిన ఖండాంతర క్షిపణి మాత్రం తమ విమానాలు, నౌకల భద్రతకు పెనుముప్పు కలిగిస్తుందని జపాన్ చీఫ్ కేబినెట్ కార్యదర్శి యొషిహిడె సుగా వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాలను అది స్పష్టంగా ఉల్లంఘిస్తోందని ఆయన చెప్పారు. ఉత్తరకొరియాను అణిచేసేందుకు తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని జపాన్ ప్రధాని షింజో అబె చెప్పారు. ఇటలీలో జరిగిన జి-7 దేశాల సమావేశం నుంచి తిరిగి వస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాజా క్షిపణి పరీక్ష గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కూడా సమాచారం వెళ్లింది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ క్షిపణిని ప్రయోగించారు. ఉత్తరకొరియా తూర్పు తీరంలోని వాన్సాన్ నగర సమీపంలో గల ఒక వైమానిక క్షేత్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఆరు నిమిషాల్లో అది జపాన్ సమీపంలో సముద్రంలో లక్ష్యాన్ని చేరిందని, అప్పటివరకు దాన్ని ట్రాక్ చేశారని పసిఫిక్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తరకొరియా తాజా పరీక్షలతో దక్షిణ కొరియా కూడా అప్రమత్తమైంది. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాల్సిందిగా సైనిక దళాల జాయింట్ చీఫ్‌లకు కొత్త అద్యక్షుడు మూన్ జే ఇన్ తెలిపారు. అవసరమైతే తాము అమెరికా ప్రధాన భూభాగం మీద కూడా అణు దాడి చేయగలమని గతంలో ఉత్తరకొరియా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా కంటే దక్షిణ కొరియా మీదే కిమ్ దృష్టి ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా జనాభాలో సగం వరకు సియోల్ ప్రాంతంలోనే ఉంటుంది. అదంతా ఉత్తరకొరియా ఆర్టిలరీ ఫైరింగ్ రేంజిలోనే ఉండటం గమనార్హం. దాంతో సంప్రదాయ ఆయుధాలతోనే దక్షిణ కొరియా మీద విరుచుకుపడే సామర్థ్యం కిమ్ సైన్యానికి ఉంటుంది. తాను అధికారం చేపట్టిన తర్వాత ఈ ఐదున్నరేళ్లలో కిమ్ జోంగ్ ఉన్న ఏకంగా 78 క్షిపణి పరీక్షలు నిర్వహించారు. ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 17 సంవత్సరాలు పాలించినా కేవలం 16 క్షిపణి పరీక్షలే చేయడం గమనార్హం. కిమ్ ప్రయోగించిన 78 క్షిపణుల్లో ఇప్పటివరకు 61 విజయవంతం అయ్యాయి. అంటే, 78 శాతం విజయాల రేటు ఉందని అర్థం. -
శత విధాలుగా యత్నిస్తున్న కిమ్..
సియోల్: ఉత్తర కొరియా తీరుతో ఏ క్షణం ఏం జరగుతుందోనని ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. జపాన్కైతే కిమ్ రాజ్య ప్రవర్తన అసలు నచ్చడం లేదు. సోమవారం మరోమారు క్షిపణి పరీక్ష చేసింది ఉత్తర కొరియా. జపాన్ జలాల వైపు ప్రయాణించిన క్షిపణి ఆ దేశ మారిటైమ్ సెజ్‌లో కూలిపోయింది. ఈ మేరకు దక్షిణ కొరియా, జపాన్ అధికారులు విడివిడిగా ప్రకటనలు విడుదల చేశారు. అమెరికాపై అణుదాడి చేస్తామని పదేపదే హెచ్చరిస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. ఆ దేశాన్ని చేరగలిగే లాంగ్ రేంజ్ మిస్సైల్ కోసం విస్తృత పరిశోధనలు చేయిస్తున్నాడు. అణు సామర్ధ్యం కలిగిన క్షిపణిని తయారు చేసేందుకు ఉత్తరకొరియా పరిశోధకులు శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విపరీతంగా ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి వాటిలో గత ఆదివారం చేసిన ప్రయోగంతో మీడియం రేంజ్ మిస్సైల్స్ సామర్ధ్యం ఉన్ రాజ్య సొంతమైంది. తాజా ప్రయోగించిన క్షిపణి 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీనిపై స్పందించిన జపాన్ తమ మారిటైమ్ ఎకనమిక్ జోన్లో క్షిపణి పడినట్లు ధ్రువీకరించింది. ఈ ఘటనలో ఓడలకు, విమానాలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని తెలిపింది. -
‘ఉత్తర కొరియాకా మాకా... తేల్చుకోండి’
-
‘ఉత్తర కొరియాకా మాకా.. తేల్చుకోండి’
-
‘ఉత్తర కొరియాకా మాకా.. తేల్చుకోండి’
న్యూయార్క్: మరో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందంటూ వస్తున్న ఊహాగానాలు, నిత్యం అణుక్షిపణుల పరీక్షలతో ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పుతున్న ఉత్తర కొరియా తీరు చూసిన అమెరికాకు ఆగ్రహం వచ్చింది. ఉత్తర కొరియాకు మద్దతిచ్చే నగరాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి ద్వారా ఉమ్మడిగా చేసుకున్న ఒప్పందాలను మర్చిపోయారా అంటు నిలదీసింది.‘మీరు ఉత్తర కొరియాకు మద్దతు ఇస్తారా.. లేక మాకు మద్దతు ఇస్తారా’ అని అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న నిక్కీ హేలీ సూటిగా ప్రశ్నించారు. త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో హేలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే ఉత్తర కొరియా చేసిన బాలిస్టిక్ రాకెట్ పరీక్షను భద్రతామండలి తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. తాము కొత్తగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ రాకెట్‌ను పరీక్షించామంటూ ఉత్తర కొరియా చెప్పిన నేపథ్యంలో అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. -
ఆ పరీక్షలో నార్త్ కొరియా ఫెయిల్
-
ఆ పరీక్షలో నార్త్ కొరియా ఫెయిల్
సియోల్, దక్షిణకొరియా : అమెరికా, దక్షిణ కొరియాలకు దడపుట్టిస్తూ నార్త్ కొరియా లాంచ్ చేసిన క్షిపణి పరీక్ష ఫెయిల్ అయింది. నార్త్ కొరియా పరీక్షించిన కొత్త క్షిపణి లాంచ్ చేసిన సెకన్ల వ్యవధుల్లోనే ఫెయిల్ అయినట్టు దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 22 బుధవారం ఉదయం వాన్ సాన్ ఎయిర్‌బేస్ నుంచి నార్త్ కొరియా ఓ క్షిపణి లాంచ్ చేసింది, కానీ అది విఫలమైనట్టు దక్షిణ కొరియా, అమెరికాలు తెలుసుకోవాల్సి ఉందని సియోల్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఇది ఏ రకమైన క్షిపణో పరిశీలిస్తున్నామని అధికారి చెప్పారు. నార్త్ కొరియా లాంచ్ చేసే అదనపు క్షిపణి పరీక్షలకు దక్షిణ కొరియా సన్నద్ధమై ఉందని పేర్కొన్నారు. బుధవారం ఉదయం నార్త్ కొరియా నగరం వాన్ సాన్ నుంచి వివిధ రకాల క్షిపణులను నార్త్ కొరియా లాంచ్ చేసినట్టు జపనీస్ క్యోడో వార్తా సంస్థ అంచనావేస్తోంది. ప్రీక్వెన్సీని పెంచుతూ నార్త్ కొరియా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ వస్తోంది. క్షిపణి టెక్నాలజీలో తాము ముందున్నామనే విషయాన్ని నార్త్ కొరియా ఈ పరీక్షల ద్వారా అమెరికాకు చాటిచెబుతోంది. జపాన్ లో నీటిలోకి 1000 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వెళ్లే విధంగా నాలుగు క్షిపణులను నార్త్ కొరియా ఈ నెల మొదట్లో పరీక్షించిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ కొరియా ఎలాంటి క్షిపణి పరీక్షలు నిర్వహించకుండా అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను ఉల్లంఘించి నార్త్ కొరియా ఇటీవల పలుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, జపాన్ లకు దడపుట్టిస్తోంది. -
ఉత్తర కొరియా దూకుడు.. మరి ట్రంప్ స్పందన!
సియోల్: ఉత్తర కొరియా తన దూకుడు కొనసాగిస్తోంది. ఆదివారం మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఉదయం 7:55 గంటలకు ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని బాంగ్యోన్ ఎయిర్‌బేస్ నుంచి ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను నిర్వహించిందని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరీక్షించిన క్షిపణి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో జపాన్ సముద్రంలో పడిందని ఉత్తర కొరియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే.. ఇది ఏ తరహాకు చెందిన క్షిపణి అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఒబామా అయినా ట్రంప్ అయినా తమ విధానం మారదని.. తన క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో.. ట్రంప్ స్పందనను తెలుసుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ట్రంప్ వేటు.. ఇరాన్ క్షిపణి పరీక్ష!
దుబాయ్: తాము ఓ కొత్త అణు క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, అణు ఒప్పందాన్ని మాత్రం ఉల్లంఘించలేదని చెప్పింది. ఏడు ఇస్లామిక్ దేశాలకు చెందిన ముస్లింలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ఈ సమయంలోనే ఇరాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలు ఇరాన్ మంత్రి హోసెయిన్ దెహ్గాన్ చెబుతూ తాము పరీక్ష నిర్వహించింది వాస్తవమేనని, అయితే, అణు కార్యక్రమానికి సంబంధించిన నిబంధనలుగానీ ఉల్లంఘించడంగానీ, ఐక్యరాజ్యసమితి జాతీయ భద్రాతా మండలి తీర్మాణానికి వ్యతిరేకంగాగానీ చేయలేదని స్పష్టం చేశారు. ఇరాన్ ఆదివారం 1,010కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణిని పరీక్షించినట్లు అమెరికా అధికారులు అన్నారు. ఆ క్షిపణి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత పేలిందని కూడా తెలిపారు. -
'మా మిసైల్ టెస్ట్ ఓ గొప్ప విజయం'
సియోల్: ఓ పక్క అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఉత్తర కొరియా చర్యలపట్ల తీవ్ర ఆగ్రహం చేస్తుండగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ మాత్రం ఆ మాటలేమి పట్టించుకోకుండా జలాంతర్గాముల ద్వారా తమ దేశం జరిపిన అణు పరీక్షలు 'చాలా గొప్ప విజయం' అంటూ అభివర్ణించారు. ఆ దేశం అణ్వాయుధాలు పెంచుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ఖండిస్తుండగా వాటి విషయంలో ఆయన కనీసం ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు. బుధవారం ఉత్తర కొరియా జలాంతర్గాముల ద్వారా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఈ క్షిపణి జపాన్ మీదుగా 500 కిలో మీటర్లు ప్రయాణించింది. దీనిపై జపాన్ తీవ్రంగా హెచ్చరికలు చేయగా ఐక్యరాజ్య సమితికి చెందిన కొందరు అధికారులు రెండుగంటలపాటు సమావేశమై ఉత్తర కొరియా చేస్తున్న రెచ్చగొట్టే చర్యలపై చర్చించారు. -
ఆయన మళ్లీ నవ్వాడు..!
సిన్పో: దీపావళి టపాసుల వెలుగులు చూస్తూ పిల్లలు గంతేసినట్లు.. ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తిమంతమైన మిస్సైళ్లు పేల్చుతూ ఆనందిస్తాడు కిమ్ జాంగ్ ఉన్. మొదటిది సంతోషమైతే, రెండోది క్రూరత్వం.. ఉన్మాదం తలకెక్కిన నియంతృత్వం! 'మిస్సైళ్లు పేల్చకయ్యా..!' అని పొరుగుదేశాలు అభ్యర్థించిన కొద్ది గంటలకే ఉత్తరకొరియా నియంత నేత మళ్లీ రెచ్చిపోయాడు. ఉత్తరకొరియా తీరపట్టణం సిప్నోలోని జలాంతర్గామి క్షేత్రం నుంచి బుధవారం ఉదయం మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణిని.. నియంత నేత కిమ్ జాంగ్ సమక్షంలో కొరియన్ నేవీ విజయవంతంగా పరీక్షించింది. జలాంతర్గామి నుంచి సముద్రపు నీటిని చీల్చుకుంటూ గాలిలోకి ఎగిరిన ఈ క్షిపణి సరాసరి జపాన్ సరిహద్దులో పడింది. దీంతో జపాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. ఆదివారమే కొరియాను తీవ్రంగా తప్పుపట్టిన జపాన్ అధ్యక్షుడు షిజో అబే బుధవారం మరోసారి కిమ్ జాంగ్ చర్యను తూర్పారపట్టారు. 'ఇది క్షమించరాని చర్య'అని ఉత్తరకొరియాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు దక్షిణకొరియా కూడా కిమ్ జాంగ్ వరుస క్షిపణి పరీక్షలపై ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఉత్తరకొరియా దూకుడుకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఒక్కతాటిపైకి రావాలని జపాన్, దక్షిణకొరియా, చైనాలు నిర్ణయించుకున్నాయి. -
ఆయన మళ్లీ నవ్వాడు..!
-
దూకుడు కొనసాగిస్తున్న ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని ఒత్తిడిలు ఎదురౌతున్నా ఉత్తర కొరియా మాత్రం తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. బుధవారం రెండు మధ్యతరహా 'ముసుడాన్' క్షిపణులను ఉత్తరకొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా, అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఈ తరహా ప్రయోగాలను ఇంతకు ముందు నాలుగుసార్లు ఉత్తర కొరయా నిర్వహించినప్పటికీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో మరోసారి ఈ ప్రయోగాలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు క్షిపణి ప్రయోగాలు కూడా ఉత్తర కొరయాకు నిరాశనే మిగిల్చినట్లు తెలుస్తోంది. ఇవాళ్టి ప్రయోగంలో మొదటి క్షిపణి ప్రయోగం పూర్తిగా విఫలం కాగా.. రెండో క్షిపణి మాత్రం కేవలం 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు సౌత్ కోరియా జాయింట్ చీఫ్ స్టాఫ్ వెల్లడించింది. మధ్యతరహా క్షిపణుల 3,500 కిలోమీటర్ల లక్ష్యానికి ఉత్తర కొరియా చాలా దూరంలోనే నిలిచిపోయినట్లు వారు వెల్లడించారు. -
మరోసారి ఉత్తర కొరియా బొక్కబోర్లా..!
ప్యాంగ్ యాంగ్: ఉత్తర కొరియా మరోసారి పరాభవాన్ని చవిచూసింది. మంగళవారం ఉదయం రెండు అణు క్షిపణులు పరీక్షించిన ఆ దేశానికి భంగపాటు ఎదురైంది. ఉత్తర కొరియా ఉదయం 5.20గంటల ప్రాంతంలో ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు విఫలమయ్యాయని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. గత జనవరిలో అణ్వాయుధ పరీక్షలు జరిపినప్పటి నుంచి ఈశాన్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అంతటితో ఆగని ఆ దేశంలో శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రాంలు, వివిధ క్షిపణులు పరీక్షిస్తూ ఇతర దేశాల ఆందోళనలను బేఖాతరు చేస్తోంది. ఇప్పటికే ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగిస్తుందని తెలిసి జపాన్ కూడా అప్రమత్తమైంది. తమ సరిహద్దులో ఒక్క మిసైల్ పడిన దానికి తగిన బుద్ధి చెప్పాలని తమ సైన్యానికి ఆదేశించింది. అయితే తాజా ప్రయోగం తర్వాత అలాంటిదేం ఇప్పటి వరకు జరగలేదని జపాన్ అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర కొరియా తన అణుపరీక్షలను వదిలేసి ఆలోచనేది చేసేందుకు సుముఖంగా లేనందున తాము అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తామని జపాన్ మరోసారి స్పష్టం చేసింది. వరుస వైఫల్యాలు తమ వద్ద జపాన్ లోని ఏ ప్రాంతంనైనా.. అమెరికాలోని ఏ ప్రాంతంనైనా ధ్వంసం చేయగల ముసుదాన్ అణుక్షిపణులు ఉన్నాయని చెబుతూ వచ్చిన ఉత్తర కొరియా వాటి పరీక్షల్లో మాత్రం ఇప్పటి వరకు విజయం సాధించలేదు. దాదాపు 20 నుంచి 30 ముసుదాన్ క్షిపణులు ఉత్తర కొరియా వద్ద ఉన్నట్లు దక్షిణ కొరియా చెబుతుంది. అయితే, వీటి సామర్థ్యం విషయంలో మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి. గత నెలలో నిర్వహించిన పరీక్షల్లో కూడా ఇవి విఫలం అయ్యాయి. -
పృథ్వి-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
గగనతలంలో భారత్ తన సామర్థ్యాన్ని మరోమారు సగర్వంగా నిరూపించుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన, అణు సామర్థ్యం కలిగిన పృథ్వి-2 క్షిపణిని ఒడిసాలోని ఓ సైనిక స్థావరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. భూమి మీద నుంచి భూమ్మీద ఉండే లక్ష్యాల మీదకు సంధించగలిగే ఈ బాలిస్టిక్ క్షిపణిని సోమవారం తెల్లవారుజామున ప్రయోగించారు. ఈ క్షిపణి సామర్థ్యం 350 కిలోమీటర్లు. భువనేశ్వర్‌కు 230 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలో గల చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి నుంచి దీన్ని ప్రయోగించారు. భారత సైనిక దళాలు తమ సాధారణ విన్యాసాల్లో భాగంగానే దీన్ని ప్రయోగించినట్లు అధికారులు చెబుతున్నారు. సరిహద్దుల్లో పదే పదే ఉద్రిక్తతలు నెలకొంటుండటంతో, తమ సామర్థ్యాన్ని అంతర్జాతీయ యవనికపై మరో్మారు ప్రదర్శించి తీరాలన్న నిర్ణయానికే భారత్ వచ్చినట్లుందని, అందుకే మరోమారు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పృథ్విని ప్రయోగించినట్లు భావిస్తున్నారు.