Agni-5 Nuclear Capable Ballistic Missile Test Successful - Sakshi
Sakshi News home page

అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం.. 5,500 కిమీ లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం

Published Thu, Dec 15 2022 8:18 PM | Last Updated on Thu, Dec 15 2022 9:26 PM

Agni-5 Nuclear Capable Ballistic Missile Test Successful - Sakshi

భువనేశ్వర్‌: అగ్ని-5 అణు బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. డమ్మీ వార్‌హెడ్స్‌తో అగ్ని-5 క్షిపణులను ప్రయోగించారు. 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ మిసైల్స్‌  ఛేదించగలవు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యంత కీలకమైన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో  భారత శాస్త్రవేత్తలు మరో మైలురాయిని చేరుకున్నట్లయింది.

అరుణాచల్‌ ప్రదేశ్ తవాంగ్ సరిహద్దులో చైనా బలగాలలతో ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే అగ్ని-5 ప్రయోగం జరగడం గమనార్హం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మిసైల్స్.. సుదూర లక్ష్యాలను ఛేదించగలవు. ఈ ప్రయోగంపై చైనా గతంలో అభ్యతరం కూడా తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని సాకుగా చూపింది. భారత్ మాత్రం యథావిధిగా ప్రయోగాన్ని విజయవంతంగా ముగించింది.
చదవండి: గతం గతహా.. వాళ్లతో న‍న్ను పోల్చకండి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement