శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు | Narendra Modi congratulates scientists on successful missile launch | Sakshi
Sakshi News home page

శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు

Published Fri, Oct 17 2014 4:33 PM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

Narendra Modi congratulates scientists on successful missile launch

న్యూఢిల్లీ: 'నిర్భయ్' క్షిపణి విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ రక్షణ విభాగాన్ని మరింత పటిష్ట పరచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిర్భయ్ క్షిపణి సక్సెస్ కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ' ఇది దేశ రక్షణ విభాగం మరింత బలోపేతం కావడానికి మనం సాధించిన గొప్ప ఘన విజయం' అని ఓ సందేశాన్ని విడుదల చేశారు.
 

భూ ఉపరితలంపై నుంచే కాకుండా నీళ్ల పై నుంచి వాయు మార్గాల్లో  దాడి చేయగల సత్తా ఉన్న నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈ క్షిపణి 700  కిలోమీటర్ల కు పైగా దూరంలోని లక్ష్యాన్ని కూడా ఇది సునాయాసంగా ఛేదించగలదు. ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్రూయిజ్ మిసైళ్ల సామర్థ్యం గల దేశాల సరసన భారత్ కూడా చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement