![నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81413526574_625x300.jpg.webp?itok=9QCKOLAx)
నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
భూమి మీద నుంచి, నీళ్ల మీద నుంచి, వాయు మార్గం నుంచి ఎలాగైనా చేయగల నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. 850 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఇది సునాయాసంగా ఛేదించగలదు. ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్రూయిజ్ మిసైళ్ల సామర్థ్యం గల దేశాల సరసన భారత్ కూడా చేరింది.
మొబైల్ లాంచర్ ద్వారా ఎక్కడినుంచైనా ప్రయోగించగల నిర్భయ్.. సగం మిసైల్ గాను, సగం విమానరూపంలోను ప్రయాణం చేస్తుంది. భూమిక అతి తక్కువ ఎత్తులో ఇది ప్రయాణిస్తుంది కాబట్టి.. రాడార్ నిఘా నుంచి కూడా ఇది తప్పించుకోగలదు. అందువల్ల శత్రువుల కంటబడకుండా వెళ్లే సామర్థ్యం దీనికి ఉంటుంది.