test fire
-
Mission Divyastra: అమ్ములపొదిలో దివ్యాస్త్రం
బాలాసోర్/న్యూఢిల్లీ: మన అమ్ములపొదిలోకి తిరుగులేని ‘దివ్యాస్త్రం’ చేరింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో అద్భుతం చేసింది. ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి అత్యంత కచి్చతత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5ను తొలిసారి ప్రయోగించింది. నిర్దేశించిన ఒకటికి మించిన లక్ష్యాలను అది విజయవంతంగా ఛేదించింది! శత్రు దేశాలకు వణకు పుట్టించగల ఈ ‘దివ్యాస్త్రం’ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిచ్చేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. దీనిలో తొలిసారిగా వాడిన మలి్టపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వీ) సాంకేతికత ద్వారా ఒకే క్షిపణితో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్ హెడ్లను పూర్తి కచి్చతత్వంతో ప్రయోగించవచ్చు. 5,000 నుంచి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను అగ్ని–5 ఛేదించగలదు. తక్కువ బరువున్న వార్హెడ్లను అమర్చే పక్షంలో క్షిపణి రేంజ్ ఏకంగా 8,000 కి.మీ. దాకా పెరుగుతుంది! ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరిట జరిగిన ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సోమవారం జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మిషన్ దివ్యాస్త్రను దిగ్విజయం చేసిన డీఆర్డీఓ సైంటిస్టులకు హృదయపూర్వక అభినందనలు. వారి ఘనతను చూసి గరి్వస్తున్నా’’అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అతి కొద్ది దేశాల సరసన... అగ్ని–5 పరీక్ష విజయవంతం కావడంతో ఎంఐఆర్వీ సామర్థ్యమున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘దేశ దీర్ఘకాలిక రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అగ్ని–5ని అభివృద్ధి చేశాం. భారత శాస్త్ర, సాంకేతిక నైపుణ్యానికి ఇది మచ్చుతునక. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ మహిళ కావడం విశేషం. రక్షణ రంగంలోనూ దేశ ప్రగతికి నారీ శక్తి ఎంతగా దోహదపడుతోందో చెప్పేందుకు ఇది తాజా తార్కాణం’’ అని వివరించాయి. అగ్ని–1 నుంచి అగ్ని–4 దాకా ఇప్పటిదాకా అభివృద్ధి చేసిన క్షిపణుల రేంజ్ 700 కి.మీ. నుంచి 3,500 కి.మీ. దాకా ఉంది. ఇవిప్పటికే రక్షణ దళంలో చేరాయి. భూ వాతావరణ పరిధిలోనూ, దాని ఆవల కూడా ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంతో పాటు విజయవంతంగా అడ్డగించే సామర్థ్యాల సముపార్జనలో భారత్ ఏటేటా ప్రగతి సాధిస్తూ వస్తోంది. మొత్తం ఆసియా ఖండంతో పాటు యూరప్‌లో కూడా పలు ప్రాంతాలు అగ్ని–5 పరిధిలోకి వస్తాయి! అణు దాడులు చేయడమే గాక వాటిని అడ్డుకునే సత్తా దీని సొంతం. -
అగ్ని-5 ప్రయోగం విజయవంతం.. 5,500 కిమీ లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం
భువనేశ్వర్: అగ్ని-5 అణు బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. డమ్మీ వార్‌హెడ్స్‌తో అగ్ని-5 క్షిపణులను ప్రయోగించారు. 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ మిసైల్స్ ఛేదించగలవు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యంత కీలకమైన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత శాస్త్రవేత్తలు మరో మైలురాయిని చేరుకున్నట్లయింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సరిహద్దులో చైనా బలగాలలతో ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే అగ్ని-5 ప్రయోగం జరగడం గమనార్హం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మిసైల్స్.. సుదూర లక్ష్యాలను ఛేదించగలవు. ఈ ప్రయోగంపై చైనా గతంలో అభ్యతరం కూడా తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని సాకుగా చూపింది. భారత్ మాత్రం యథావిధిగా ప్రయోగాన్ని విజయవంతంగా ముగించింది. చదవండి: గతం గతహా.. వాళ్లతో నన్ను పోల్చకండి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
పాక్ దూకుడు.. అర్ధరాత్రి రహస్యంగా...
ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి రహస్యంగా యుద్ధ క్షిపణిని పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల స్వల్పశ్రేణి యుద్ధ క్షిపణి ‘ఘజ్నవి’ని పాకిస్థాన్ ప్రయోగించింది. గురువారం తెల్లవారుజామున బలూచిస్తాన్‌లోని సోన్మియాని టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం జరిగినట్టు పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రయోగానికి సంబంధించిన 30 సెకన్ల వీడియోను షేర్ చేశారు. నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్(ఎన్డీసీ) తయారు చేసిన ఘజ్నవి క్షిపణి 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని ఆయన తెలిపారు. ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, జాతికి ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అభినందనలు తెలిపారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా ఏకాకిగా మారిన పాకిస్తాన్ కొద్దిరోజులుగా మాటల యుద్ధానికి దిగింది. భారత్‌తో యుద్ధానికి సిద్ధమంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం రాబోతోందని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం రావల్పిండిలో వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై ఎంతవరకైనా వెళ్తామని, అణు యుద్ధానికి వెనుకాడబోమని అంతకుముందు ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్షిపణిని ప్రయోగించడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: భారత్‌పై పాక్ నిషేధం; గందరగోళం) -
స్క్రామ్‌జెట్ పరీక్ష సక్సెస్
బాలాసోర్: హైపర్సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్(హెచ్ఎస్టీడీవీ) అనే మానవరహిత విమానాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ స్క్రామ్‌జెట్ విమానాన్ని ఒడిశాలోని కలామ్ ద్వీపం నుంచి బుధవారం ఉదయం డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. హెచ్ఎస్టీడీవీ ఓ పునర్వినియోగ వాహనమనీ, దీంతో ఉపగ్రహాలను చవకగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని రక్షణరంగ నిపుణుడొకరు చెప్పారు. దీంతో శత్రుదేశాలపై క్రూయిజ్ క్షిపణులనూ ప్రయోగించవచ్చన్నారు. హెచ్ఎస్టీడీవీ 20 సెకన్లలో 32.5 కి.మీ ఎత్తుకు చేరుకోగలదనీ, గంటకు 7,408 కి.మీ(6 మ్యాక్‌ల) వేగంతో దూసుకుపోగలదన్నారు. తాజాగా ప్రయోగంతో ఇలాంటి సాంకేతికత ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరిందన్నారు. హెచ్‌ఎస్‌టీడీ తొలుత ఘనఇంధన మోటార్‌తో నిర్ణీత ఎత్తులోకి చేరుకుంటుంది. సరైన వేగం అందుకున్నాక హెచ్‌ఎస్‌టీడీలోని క్రూయిజ్ వాహనం విడిపోతుందనీ, స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను మండించడం ద్వారా ఇది లక్ష్యం దిశగా దూసుకెళుతుందని పేర్కొన్నారు. -
డెడ్లీ కాంబినేషన్: సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష
సాక్షి,న్యూఢిల్లీ: భారత్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్ర్తమైన బ్రహ్మోస్ క్షిపణి అత్యాధునిక వెర్షన్‌ని తొలిసారిగా సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఈవారంలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే సర్జికల్ దాడుల్లో ఈ అత్యాధునిక క్షిపణి బ్రహ్మోస్ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుంది.సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం డెడ్లీ కాంబినేషన్‌గా రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. గగనతల ఉపరితల లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ క్షిపణులు ప్రత్యర్థి భూభాగంలోని ఉగ్ర శిబిరాలను గుర్తించి రెప్పపాటులో నాశనం చేయడంతో పాటు అణు బంకర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సముద్రంపై యుద్ధ విమానాల వంటి సైనిక లక్ష్యాలను అవలీలగా ధ్వంసం చేస్తాయని చెబుతున్నారు. గత పదేళ్లుగా 290 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణులను సాయుధ దళాలు సమీకరించాయి. మరోవైపు ఆర్మీ, నేవీ, వాయుసేనలు రూ 27,150 కోట్ల విలువైన ఆర్డర్లను ఇవ్వడం బ్రహ్మోస్ పట్ల భారత సేనల ఆసక్తిని స్పష్టం చేస్తున్నాయి. -
ఖండాంతర క్షిపణి ప్రయోగం
► విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా ► అమెరికా సహా పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యం సియోల్: ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను ఉత్తర కొరియా మరోసారి బేఖాతరు చేసింది. అమెరికాతో పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యమున్న తన తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని మంగళవారం విజయవంతంగా పరీక్షించామని ప్రకటించింది. వాసోంగ్–14 క్షిపణి పరీక్షను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని ఉ.కొరియా టీవీ చానల్ పేర్కొంది. ‘కిమ్ ఈ పరీక్షకు ఆదేశించారు. క్షిపణి 2,802 కి.మీ.ఎత్తుకు చేరుకుని 933 కి.మీ ప్రయాణించింది. 39 నిమిషాల పయనం తర్వాత జపాన్ సముద్రంలో పడిపోయింది. పూర్తి స్థాయి అణుశక్తి దేశమైన ఉ.కొరియా వద్ద ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ఉంది. అమెరికా నుంచి అణు యుద్ధ ముప్పునకు ఇది ముగింపు పలుకుతుంది’ అని తెలిపింది. ఉ.కొరియా క్షిపణి ఒకటి 2,802 కి.మీ ఎత్తుకు వెళ్లడం ఇదే తొలి సారి. ఉ.కొరియాలోని ఉత్తర ఫియోంగాన్ రాష్ట్రంలో ఈ పరీక్ష జరిపారని దక్షిణ కొరియా తెలిపింది. ఇది భూమిపై నుంచి ప్రయోగించిన మధ్యశ్రేణి క్షిపణి అని, అమెరికాకు దీనివల్ల ముప్పులేదని అమెరికా పసిఫిక్ కమాండ్ పేర్కొంది. ఐసీబీఎం 6,700 కి.మీ. వరకు దూసుకెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉ.కొరియా ఈ ఏడాదిలో క్షిపణి పరీక్ష నిర్వహించ డం ఇది 11వసారి. అమెరికా స్వాతంత్య్రదినమైన జూలై4న ఐసీబీఎంను పరీక్షించడం గమనార్హం. ఇంకో మంచి పని లేదా?: ట్రంప్ ఉ.కొరియా క్షిపణి పరీక్షపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ‘ఇతనికి తన జీవితంలో చేయాల్సిన మంచిపనేదీ లేదా?’ అని ఉ.కొరియా నేత కిమ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఉ.కొరియాపై ఒత్తిడి తెచ్చి, ఈ పిచ్చిపనులను మానిపించాలని ఆ దేశానికి మిత్రదేశమైన చైనాకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అమెరికా సహా సంబంధిత పక్షాలన్నీ సంయమనం పాటించాలని చైనా కోరింది. -
దూసుకెళ్లిన అగ్ని-3
-
దూసుకెళ్లిన అగ్ని-3
భువనేశ్వర్: భారత అమ్ముల పొదిలోని విలువైన అణు అస్త్రం అగ్ని క్షిఫణి మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. సాధారణ పరీక్షల్లో భాగంగా డీఆర్డీవో గురువారం ఒడిశాతీరంలోని వీలర్ ఐలాండ్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నాలుగో ప్రయోగ క్షేత్రం నుంచి ఉదయం 9.55గంటలకు అగ్ని క్షిపణి-3ని పరీక్షించగా విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మేరకు డీఆర్డీవో అధికారులు వివరాలు వెల్లడించారు. ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించిన ఈ క్షిపణి దాదాపు 3వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించే సామర్ధ్యం కలది. ఈ సందర్భంగా టెస్ట్ రేంజ్ డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ అగ్ని-3క్షిపణి 1.5 టన్నుల సాంప్రదాయ, అణు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని చెప్పారు. ఇక ఈ క్షిపణి 16 మీటర్ల పొడవును కలిగిఉండి దాదాపు 48 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో రెండు దశల సాంధ్ర ఇంధనం నింపి ఉంటుంది. వాతావరణంతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ క్షిపణిని ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. మరోపక్క, అగ్ని మిస్సైల్‌కు పోటీగా పాకిస్థాన్ గురువారమే ఘోరీ బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించింది. -
శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: 'నిర్భయ్' క్షిపణి విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ రక్షణ విభాగాన్ని మరింత పటిష్ట పరచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిర్భయ్ క్షిపణి సక్సెస్ కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ' ఇది దేశ రక్షణ విభాగం మరింత బలోపేతం కావడానికి మనం సాధించిన గొప్ప ఘన విజయం' అని ఓ సందేశాన్ని విడుదల చేశారు. భూ ఉపరితలంపై నుంచే కాకుండా నీళ్ల పై నుంచి వాయు మార్గాల్లో దాడి చేయగల సత్తా ఉన్న నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈ క్షిపణి 700 కిలోమీటర్ల కు పైగా దూరంలోని లక్ష్యాన్ని కూడా ఇది సునాయాసంగా ఛేదించగలదు. ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్రూయిజ్ మిసైళ్ల సామర్థ్యం గల దేశాల సరసన భారత్ కూడా చేరింది. -
అమెరికా క్షిపణులకంటే 'నిర్భయ్' మేలైంది
హైదరాబాద్ : భారత్ అమ్ముల పొదిలో నిర్భయ్ క్షిపణి తిరుగులేని అస్త్రమని సైంటిస్ట్ సతీష్ రెడ్డి అన్నారు. క్షిపణి తయారీలో పాలుపంచుకున్న ఆయన చాందీపూర్ నుంచి ప్రయోగం వివరాలను శుక్రవారం 'సాక్షి'కి అందించారు. అతి తక్కువ ఎత్తులో నిర్భయ్ ప్రయాణించగలదని సతీష్ రెడ్డి వెల్లడించారు. క్షిపణి తయారీలో హైదరాబాద్‌కు చెందిన రక్షణ ప్రయోగశాల కీలక పాత్ర వహించిందన్నారు. అమెరికా దగ్గరున్న క్షిపణులకంటే నిర్భయ్ చాలా మేలైనదన్నారు. సముద్రం అలలపై నుంచి 5 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణించగలన్నారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్నీ చేధించగలదని, 16 పాయింట్లను టచ్ చేసుకుంటూ క్షిపణి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందన్నారు. కాగా చాందీపూర్ నుంచి ప్రయోగించిన నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. -
నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
భూమి మీద నుంచి, నీళ్ల మీద నుంచి, వాయు మార్గం నుంచి ఎలాగైనా చేయగల నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. 850 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఇది సునాయాసంగా ఛేదించగలదు. ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్రూయిజ్ మిసైళ్ల సామర్థ్యం గల దేశాల సరసన భారత్ కూడా చేరింది. మొబైల్ లాంచర్ ద్వారా ఎక్కడినుంచైనా ప్రయోగించగల నిర్భయ్.. సగం మిసైల్ గాను, సగం విమానరూపంలోను ప్రయాణం చేస్తుంది. భూమిక అతి తక్కువ ఎత్తులో ఇది ప్రయాణిస్తుంది కాబట్టి.. రాడార్ నిఘా నుంచి కూడా ఇది తప్పించుకోగలదు. అందువల్ల శత్రువుల కంటబడకుండా వెళ్లే సామర్థ్యం దీనికి ఉంటుంది. -
అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం
భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించగల అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణి పృథ్వి-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషాలోని ఓ సైనిక స్థావరం నుంచి దీన్ని వరుసగా రెండు నెలల్లో మూడోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజి 350 కిలోమీటర్లు. దీన్ని బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ టెస్టురేంజి నుంచి ప్రయోగించారు. ప్రయోగం నూటికి నూరుశాతం విజయవంతం అయ్యిందని ప్రధాన లక్ష్యాలన్నింటినీ ఇది చేరిందని టెస్టు రేంజి డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ తెలిపారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్.ఎఫ్.సి.) ఈ పరీక్షను నిర్వహించిందన్నారు. ఇంతకుముందు అక్టోబర్ 7, 8 తేదీలలో కూడా ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. పూర్తిగా భారత్‌లోనే తయారైన వాటిలో ఇది మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి. ఇది 500 కిలోల బరువున్న అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. 483 సెకండ్లలోనే 43.5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్తుంది. ఇది రాడార్ల కంటిని తప్పించుకుని మరీ వెళ్లి, లక్ష్యాలను కొద్ది మీటర్ల కచ్చితత్వంతో ఛేదించగలదు.