సాక్షి,న్యూఢిల్లీ: భారత్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్ర్తమైన బ్రహ్మోస్ క్షిపణి అత్యాధునిక వెర్షన్‌ని తొలిసారిగా సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఈవారంలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే సర్జికల్ దాడుల్లో ఈ అత్యాధునిక క్షిపణి బ్రహ్మోస్ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుంది.సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం డెడ్‌లీ కాంబినేషన్‌గా రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. గగనతల ఉపరితల లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ క్షిపణులు ప్రత్యర్థి భూభాగంలోని ఉగ్ర శిబిరాలను గుర్తించి రెప్పపాటులో నాశనం చేయడంతో పాటు అణు బంకర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సముద్రంపై యుద్ధ విమానాల వంటి సైనిక లక్ష్యాలను అవలీలగా ధ్వంసం చేస్తాయని చెబుతున్నారు.
గత పదేళ్లుగా 290 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణులను సాయుధ దళాలు సమీకరించాయి. మరోవైపు ఆర్మీ, నేవీ, వాయుసేనలు రూ 27,150 కోట్ల విలువైన ఆర్డర్లను ఇవ్వడం బ్రహ్మోస్ పట్ల భారత సేనల ఆసక్తిని స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment