IAF Successfully Test Fires Extended Range Version Of Brahmos Air Launched Missile - Sakshi
Sakshi News home page

Brahmos: ‘బ్రహ్మోస్‌’ ప్రయోగం సక్సెస్‌.. సుదూర లక్ష్యాన్ని ఛేదించిన మిసైల్‌

Published Thu, Dec 29 2022 7:03 PM | Last Updated on Thu, Dec 29 2022 7:51 PM

IAF Fired Extended Range Version Of Brahmos Air Launched Missile - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలు పెరుగుతున్న వేళ రక్షణ రంగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది భారత్‌. బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వెర్షన్‌ను సుఖోయ్‌-30 యుద్ధ విమానం నుంచి పరీక్షించింది భారత వాయుసేన. గగనతలం నుంచి దూసుకెళ్లిన ఈ బ్రహ్మోస్‌ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది.

‘సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ మిసైల్‌ బంగాళకాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భూతల, సముద్రంలోని సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్ధ్యాన్ని వైమానిక దళం సాధించింది. సుఖోయ్‌-30ఎంకేఐతో ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వర్షన్‌ మిసైల్‌ను జత చేయడం ద్వారా భారత వైమానిక దళానికి వ్యూహాత్మక బలాన్ని చేకూర్చింది. భవిష్యత్తులో ఎదురయ్యే యుద్ధాల్లో పైచేయి సాధించే అవకాశాన్ని కల్పించింది.’

- భారత రక్షణ శాఖ

బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత వాయుసేన ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఎయిర్‌ఫోర్స్‌, నేవీ, డీఆర్‌డీఓ, హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు భారత వాయుసేన తెలిపింది. మరోవైపు.. యుద్ధ విమానం నుంచి క్షిపణులను పరీక్షించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు. 290 కిలోమీటర్ల రేంజ్‌ నుంచి 350 కిలోమీటర్లుకు పెంచిన మిసైల్‌ను సుఖోయ్‌ ఫైటర్‌ నుంచి ప్రయోగించి విజయం సాధించింది వాయుసేన. 

ఇదీ చదవండి: కోవిడ్‌ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement