Sukhoi Su-30
-
ఫైటర్ జెట్ నుంచి దూసుకెళ్లిన ‘బ్రహ్మోస్’ మిసైల్
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలు పెరుగుతున్న వేళ రక్షణ రంగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది భారత్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి పరీక్షించింది భారత వాయుసేన. గగనతలం నుంచి దూసుకెళ్లిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. ‘సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బంగాళకాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భూతల, సముద్రంలోని సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్ధ్యాన్ని వైమానిక దళం సాధించింది. సుఖోయ్-30ఎంకేఐతో ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ మిసైల్‌ను జత చేయడం ద్వారా భారత వైమానిక దళానికి వ్యూహాత్మక బలాన్ని చేకూర్చింది. భవిష్యత్తులో ఎదురయ్యే యుద్ధాల్లో పైచేయి సాధించే అవకాశాన్ని కల్పించింది.’ - భారత రక్షణ శాఖ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత వాయుసేన ట్విట్టర్లో షేర్ చేసింది. ఎయిర్‌ఫోర్స్, నేవీ, డీఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు భారత వాయుసేన తెలిపింది. మరోవైపు.. యుద్ధ విమానం నుంచి క్షిపణులను పరీక్షించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు. 290 కిలోమీటర్ల రేంజ్ నుంచి 350 కిలోమీటర్లుకు పెంచిన మిసైల్‌ను సుఖోయ్ ఫైటర్ నుంచి ప్రయోగించి విజయం సాధించింది వాయుసేన. The IAF successfully fired the Extended Range Version of the Brahmos Air Launched missile. Carrying out a precision strike against a Ship target from a Su-30 MKI aircraft in the Bay of Bengal region, the missile achieved the desired mission objectives. pic.twitter.com/fiLX48ilhv — Indian Air Force (@IAF_MCC) December 29, 2022 ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరియల్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బుధవారం వెల్లడించింది. సుఖోయ్ యుద్ధ విమానం ఎస్యు–30 ఎంకేఐ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. 2.5 టన్నుల బరువుండి, ఆకాశం నుంచి భూ ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. తద్వారా ఐఏఎఫ్ యుద్ధ సామర్థ్యాలను కూడా ఇది పెంచుతుందని మిలిటరీ అధికారులు చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది. ‘విమానం నుంచి ఈ క్షిపణిని ఏ సమస్యలూ లేకుండా ప్రయోగించగలిగాం. నిర్దేశించిన మార్గంలో అది ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించింది’ అని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు. -
ఆ విమానం కూలిపోయింది
గువాహటి: నాలుగు రోజుల క్రితమైన అదృశ్యమైన భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం కూలిపోయినట్టు గుర్తించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని దండకారణ్యంలో విమాన శకలాలను కనుగొన్నట్టు వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడికి చేరుకోవడం ఆలస్యమవుతుందని వెల్లడించింది. విమానంలోని ఇద్దరు పైలట్లు చనిపోయివుంటారని భావిస్తున్నారు. చైనా సరిహద్దు సమీపంలో గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది. దీని ఆచూకీ కనిపెట్టేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. రెండు ఐఏఎఫ్, ఐదు సైనిక బృందాలతో పాటు రెండు రాష్ట్రాల సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఎలెక్ట్రో పెలోడ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్‌హెచ్) ప్రత్యేక హెలికాప్టర్ సహాయంతో గాలించారు. తేజ్‌పూర్‌కు ఉత్తర దిక్కులో 60 కిలో మీటర్ల దూరంలో చివరిసారిగా దీని జాడలు రికార్డయ్యాయి. అననుకూల వాతావరణం కారణంగానే విమానం కూలిపోయినట్టు భావిస్తున్నారు.