సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్‌సానిక్ క్షిపణి బ్రహ్మోస్‌ను బుధవారం భారత వాయుసేనకు చెందిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సుఖోయ్-30ఎంకేఐ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. తొలిసారిగా సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం కావడంతో వాయుసేన సైనిక పాటవం నూతన జవసత్వాలను నింపుకున్నట్లైందని అధికారులు తెలిపారు.
ఉపరితలం, సముద్ర, గగనతలం నుంచి ప్రయోగించేందుకు వీలున్న ప్రపంచశ్రేణి బ్రహ్మోస్ 2.5 టన్నుల బరువుతో సుఖోయ్ నుంచి ప్రయోగానికి అనువుగా రూపొందింది. డీఆర్‌డీఓ, రష్యాకు చెందిన ఎన్‌పీఓఎమ్ జాయింట్ వెంచర్‌తో ఈ అత్యాధునిక ఆయుధం భారత్ అమ్ములపొదిలో చేరింది.
కాగా, బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా సుఖోయ్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించిందని రక్షణ మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment