న్యూఢిల్లీ: రష్యా సహకారంతో భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అన్ని వెర్షన్లు ఆశించిన రీతిలో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు.. భారత వాయుసేన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ మిస్సైల్ ను పరీక్షించింది.
బంగాళాఖాతం సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి కచ్చితత్వంతో తాకిందని భారత వాయుసేన వెల్లడించింది. ‘‘డైరెక్ట్ హిట్’’.. అంటూ సంతోషం వ్యక్తం చేసింది. తాజా పరీక్షలో ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణి రేంజిని మరింత వృద్ధి చేశారు. రేంజ్ పొడిగించిన తర్వాత బ్రహ్మోస్ ను పరీక్షించడం ఇదే తొలిసారి. గతంలో బ్రహ్మోస్ క్షిపణి రేంజి 290 కిలోమీటర్లు కాగా, దాన్ని 350 కిమీకి పెంచారు.
తాజా ప్రయోగం ద్వారా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భూతల, సముద్రతల లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలిగే సామర్ధ్యాన్ని భారత వాయుసేన సముపార్జించుకున్నట్లయ్యింది. కిందటి నెలలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ నావికాదళ వెర్షన్ ను విజయవంతంగా పరీక్షించడం తెలిసిందే.
The Extended Range version of Brahmos air launched missile was successfully fired from a Su-30 MkI aircraft today.
— Indian Air Force (@IAF_MCC) May 12, 2022
The successful firing was the first ever for the air launched version from a Su-30 MkI & the missile met all the laid down parameters while hitting the target. pic.twitter.com/WZk8zZkWKX
Comments
Please login to add a commentAdd a comment