యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి | IAF jet drops air store near Pokhran due to technical error | Sakshi
Sakshi News home page

యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి

Published Thu, Aug 22 2024 6:34 AM | Last Updated on Thu, Aug 22 2024 11:13 AM

IAF jet drops air store near Pokhran due to technical error

జైపూర్‌: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన యుద్ధ విమానం గాల్లో దూసుకెళ్తుండగా అనూహ్యమైన సంఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో పలురకాల వైమానిక సామగ్రి జారిపడింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. 

యుద్ధ విమానం అనుకోకుండా నిర్మానుష్య ప్రాంతంలో సామగ్రిని జారవిడిచినట్లు అధికారులు తెలియజేశారు. ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జారిపడిన సామగ్రి ఏమిటన్నది బయటపెట్టలేదు. సైనిక భాషలో బాంబు, క్షిపణులు, ఆయుధాలు, చమురు ట్యాంక్‌లను కూడా వైమానిక సామగ్రిగా పిలుస్తుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement