deploye
-
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి
జైపూర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం గాల్లో దూసుకెళ్తుండగా అనూహ్యమైన సంఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో పలురకాల వైమానిక సామగ్రి జారిపడింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. యుద్ధ విమానం అనుకోకుండా నిర్మానుష్య ప్రాంతంలో సామగ్రిని జారవిడిచినట్లు అధికారులు తెలియజేశారు. ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జారిపడిన సామగ్రి ఏమిటన్నది బయటపెట్టలేదు. సైనిక భాషలో బాంబు, క్షిపణులు, ఆయుధాలు, చమురు ట్యాంక్‌లను కూడా వైమానిక సామగ్రిగా పిలుస్తుంటారు. -
డ్రాగన్ దూకుడుకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన కొద్ది నెలల అనంతరం భారత నౌకాదళం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో యుద్ధ నౌకను మోహరించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం వద్ద తాము కీలక యుద్ధ నౌకను మోహరించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని ఆదివారం ఓ జాతీయ వార్తాఛానెల్ పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం ఆవల గస్తీ కాస్తున్న అమెరికన్ యుద్ధ నౌకలతో భారత యుద్ధనౌక సంప్రదింపులు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కి ఇక వివాదాస్పద ప్రాంతంలో భారత యుద్ధ నౌకల కదలికలపై డ్రాగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో భారత యుద్ధవిమానాల మోహరింపు ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ప్రాబల్యం కలిగిన చైనా ఆ ప్రాంతంలో ఇతర దేశాల యుద్ధవిమానాల ఉనికిని వ్యతిరేకిస్తోంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి : చైనా దూకుడు: మిస్సైల్ బేస్‌ల నిర్మాణం! -
వీధివీధిన ఖాకీల బూట్ల చప్పుడు
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతటా ఖాకీ బూట్లు చప్పుళ్లు చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేక పోలీసు టీంలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక బృంద పోలీసులు కూడా ఇందులో ఉండటం గమనార్హం. జేఎన్‌యూ వివాదానికి సంబంధించి పోలీసులు కేసులు పెట్టిన విద్యార్థుల్లో కొంతమంది అరెస్టులకు భయపడి కనిపించకుండా పోయిన విషయం తెలిసింది. ముఖ్యంగా ఇందులో ఉమర్ ఖలీద్ అనే పీహెచ్డీ స్కాలర్ పై దేశ ద్రోహం ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు అంగుళం వదిలిపెట్టకుండా గాలిస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు విడుదల చేసిన వారు వారిని ఎలాగైనా అదుపులోకి తీసుకునేందుకు అన్ని మార్గాలు అనుసరిస్తున్నారు. వారు విదేశాలకు పారిపోతారేమోనని ఇప్పటికే అన్ని విమానాశ్రయాల్లో అప్రమత్తం విధించారు. వారికి అసలు పాస్‌పోర్ట్‌లే లేవని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తుండగా ఉండిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పోలీసులు విద్యార్థుల సమాచారం అందించారు.