పుణె: ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ప్రదీప్ వసంత్ నాయక్ సతీమణి ఓటు గల్లంతయింది. ఓటర్ల జాబితా నుంచి తన భార్య మధుబాల పేరు తొలగించడంపై ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రదీప్ వసంత్ నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సోమవారం ఉదయం పుణెలోని సాప్లింగ్ స్కూల్ బ్యానర్ రోడ్‌లోని పోలింగ్ బూత్ నంబరు26లో ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ఏసీఎం నాయక్, తన భార్య, కుమారుడు వినీత్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే తన భార్య పేరు ఓటరు జాబితాలో కనిపించలేదు. విషయాన్ని అక్కడి అధికారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు, ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారని ఏసీఎం నాయక్ పీటీఐకి చెప్పారు.
“మేము పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు స్థానిక కార్పొరేటర్ ఇచ్చిన ఓటరు స్లిప్పులు మా వద్ద ఉన్నాయి. కానీ నా భార్య పేరు జాబితాలో లేదు”అని ఎయిర్స్ ఫోర్స్ మాజీ చీఫ్ వాపోయారు. పుణె సిట్టింగ్ ఎంపీ గిరీష్ బాపట్ మరణం తర్వాత బీజేపీ మాజీ మేయర్ మురళీధర్ మోహోల్‌ను పుణె లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. గత ఏడాది జరిగిన కస్బా అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించిన రవీంద్ర ధంగేకర్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది.
Comments
Please login to add a commentAdd a comment