Indian Air Force: ‘నైట్‌ విజన్‌ గాగుల్స్‌’తో విమానం ల్యాండింగ్‌ | Indian Air Force conducts night vision goggles-aided landing at Eastern sector | Sakshi
Sakshi News home page

Indian Air Force: ‘నైట్‌ విజన్‌ గాగుల్స్‌’తో విమానం ల్యాండింగ్‌

Published Fri, May 24 2024 4:56 AM | Last Updated on Fri, May 24 2024 4:59 AM

Indian Air Force conducts night vision goggles-aided landing at Eastern sector


మరో ఘనత సాధించిన భారత వాయుసేన  

న్యూఢిల్లీ: భారత వాయుసేన(ఐఏఎఫ్‌) మరో అరుదైన ఘనత సాధించింది. నైట్‌ విజన్‌ గాగుల్స్‌(ఎన్‌వీజీ) సాయంతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో సీ–130జే రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్‌ చేసింది. తూర్పు సెక్టార్‌లోని అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది. ఒక వీడియోలో ఎన్‌వీజీ టెక్నాలజీతో విమానం సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయిన దృశ్యాలు, మరో వీడియోలో విమానంలో లోపలి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

ఎన్‌వీజీ విజువల్స్‌ కావడంతో ఈ దృశ్యాలు ఆకుపచ్చ రంగులో విభిన్నంగా ఉన్నాయి. మన దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకొనే ప్రక్రియలో భాగంగా తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నామని భారత వాయుసేన పేర్కొంది. నైట్‌ విజన్‌ గాగుల్స్‌ టెక్నాలజీతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో, రాత్రిపూట విమానాలను సురక్షితంగా ల్యాండ్‌ చేయడానికి, సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహించడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement