safe landing
-
‘ఎయిర్ కెనడా’ విమానానికి తప్పిన ముప్పు
టొరంటో: ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. జూన్ 5న కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ఆఫ్ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో చిన్న పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా విమానం రెక్కల వద్ద మంటలు లేచాయి. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్లు గాల్లోకి లేచిన 30 నిమిసాల్లోనే విమానాన్ని పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. పేలుడు జరిగి మంటలంటుకున్న సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 400 మంది దాకా ఉన్నారు. ఘటన జరిగినపుడు విమానంలో ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయి. మరోపక్క వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య విమానాన్ని సురక్షితంగా వెనక్కు మళ్లించి ల్యాండ్ చేసిన పైలట్లను అందరూ అభినందిస్తున్నారు. Superb work by the pilots and their air traffic controllers, dealing with a backfiring engine on takeoff. Heavy plane full of fuel, low cloud thunderstorms, repeated compressor stalls. Calm, competent, professional - well done!Details: https://t.co/VaJeEdpzcn @AirCanada pic.twitter.com/7aOHyFsR29— Chris Hadfield (@Cmdr_Hadfield) June 7, 2024 -
Indian Air Force: ‘నైట్ విజన్ గాగుల్స్’తో విమానం ల్యాండింగ్
న్యూఢిల్లీ: భారత వాయుసేన(ఐఏఎఫ్) మరో అరుదైన ఘనత సాధించింది. నైట్ విజన్ గాగుల్స్(ఎన్వీజీ) సాయంతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో సీ–130జే రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. తూర్పు సెక్టార్‌లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఒక వీడియోలో ఎన్వీజీ టెక్నాలజీతో విమానం సాఫ్ట్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు, మరో వీడియోలో విమానంలో లోపలి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్వీజీ విజువల్స్ కావడంతో ఈ దృశ్యాలు ఆకుపచ్చ రంగులో విభిన్నంగా ఉన్నాయి. మన దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకొనే ప్రక్రియలో భాగంగా తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నామని భారత వాయుసేన పేర్కొంది. నైట్ విజన్ గాగుల్స్ టెక్నాలజీతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో, రాత్రిపూట విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి, సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడనుంది. -
టాప్ విరిగిన విమానం, భయంతో కేకలు: ఈ షాకింగ్ ఘటన ఎక్కడ?
విమాన ప్రయాణంలో పొరపాటున కిటికీ ఓపెన్ చేస్తేనే చాలా ప్రమాదం. అలాంటిది ఒక విమానం ముందు భాగం పై భాగంలో కొంత లేచి పోతే.. పరిస్థితి ఏంటి? మిరాకిల్ ఏంటంటే ఇది సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఒక్కరు తప్ప అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఏంటి నమ్మలేక పోతున్నారా? అసలు ఊహించడానికే కష్టంగా ఉందా? కానీ షాకింగ్ ఘటన నిజంగానే చోటు చేసుకుంది. ఏప్రిల్ 28, 1988, విమానయాన చరిత్రలో అత్యంత దిగ్భ్రాంతికరమైన రోజు. బోయింగ్ 737-297 విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు, సిబ్బంది మాత్రమే, ఎవరు తలచుకున్నా వెన్నులో వణుకు పుట్టే ఘటన ఇది. అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243 89 మంది ప్రయాణికులు , ఆరుగురు సిబ్బందిని హవాయి బిగ్ ఐలాండ్‌లోని హిలో నుండి ఓహులోని హోనోలులు వరకు 300కిమీల హాప్లో తీసుకువెళుతోంది ఇంతలో ఫ్యూజ్లేజ్లోని పైభాగం మధ్యలోసగం భాగం ఎగిరిపోయింది. ట్విన్-ఇంజన్, 110-సీట్ బోయింగ్ జెట్ 40 నిమిషాల ఫ్లైట్‌లో సగం దూరంలో ఉండగా, అకస్మాత్తుగా క్యాబిన్ కంట్రోల్ పోయింది. ఫ్యూజ్‌లేజ్‌లో కొంత భాగం విరిగిపోయింది. అంతే ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా 24వేల అడుగుల ఎత్తులో విపరీతమైన గాలులకు ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. భయంతో కేకలు వేశారు. ల్యాండ్ అయ్యే లోపే కూలిపోవడం ఖాయమని దాదాపు అందరూ వణికిపోయారు. భారీ సీలింగ్ ప్యానెల్లు ప్రయాణీకుల తలపై పడ్డాయి. అందరికీ దెబ్బలు, రక్త స్రావాలు. ఆక్సిజన్ మాస్క్‌లు పెట్టుకున్నా.. ఏం లాభం లేదు.. ఉరుములు, తుఫానులాంటి వాతావరణం. కానీ ఆశ్చర్యకరంగా ఈ విపత్కర పరిస్థితి సంభవించిన పదమూడు నిమిషాల తర్వాత మౌయిలోని కహులుయ్ విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అంతగా డ్యామేజ్ అయిన విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడం చూసి గ్రౌండ్ ఎమర్జెన్సీ సిబ్బంది కూడా తమను తాము నమ్మలేకపోయారు. Let’s take a moment to remember Aloha Airlines Flight 243. On April 28th 1988 the roof ripped off the Boeing 737 at 24,000 ft. The chief flight attendant (the only fatality) fell from the plane and debris struck the tail section. Amazingly the pilot still managed to land safely… pic.twitter.com/TAXzlW6KNo — Mothra P.I. (@Hardywolf359) November 17, 2022 ఇప్పటికీ దొరకని ఎయిర్‌హోస్టెస్ మృతదేహం విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంఘటన నుండి బయటపడ్డారు. 95 మందిలో కేవలం ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమిటంటే ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఫ్లైట్ అటెండెంట్ క్లారాబెల్లె లాన్సింగ్ ప్రాణం మాత్రం గాల్లోనే కలిసిపోయాయి. ఆమె మృతదేహం ఇప్పటికీ లభ్యం కాలేదు. ''అకస్మాత్తుగా, పెద్ద శబ్దం, చప్పుడు వినిపించింది, కానీ పేలుడు కాదు, ఒత్తిడిలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది. పైకి చూసాను , విమానం యొక్క ఎడమ ఎగువ భాగం విచ్ఛిన్నం కావడం, విరగడం, ముక్కలు దూరంగా ఎగిరిపోవడం చూశాను. ఇది ఒక గజం వెడల్పు గల రంధ్రంతో ప్రారంభమై, అలా విరుగుతూనే ఉంది’’ అని విమానం వెనుక కూర్చున్న ఒక ప్రయాణీకుడు ఎరిక్ బెక్లిన్ ది వాషింగ్టన్ పోస్ట్‌తో తన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ది మిరాకిల్ ల్యాండింగ్ ఆఫ్ అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243గా సినిమాగా కూడా తెరకెక్కింది ఈ స్టోరీ. నిజమైన హీరోలంటూ ప్రశంసలు పర్స్సర్ క్లారాబెల్లె లాన్సింగ్తోపాటు, జేన్ సటో-టోమిటా , మిచెల్ హోండా విమానంలో క్యాబిన్ సిబ్బందిగా ఉన్నారు. కెప్టెన్ రాబర్ట్ స్కోర్న్స్టెయినర్కు కాక్‌పిట్‌లో ఫస్ట్ ఆఫీసర్. కోపైలట్ మాడెలైన్ టాంప్కిన్స్ ఉన్నారు. ఈ ఘటనలో వీళ్లు నిజమైన హీరోలంటూ పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. ఇదిఇలా ఉంటే యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) నివేదిక ప్రకారం, డికంప్రెషన్, స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వల్ల జరిగింది. విమానంలో ఎడమ ఇంజిన్ కూడా విఫలమైంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ప్రకారం బోర్డింగ్ సమయంలో విమానం ఫ్యూజ్‌లేజ్‌లో పగుళ్లను ఒకామె గమనించింది. అయితే ఆమె టేకాఫ్‌కి ముందు సిబ్బందికి చెప్పలేదు. -
జాబిల్లిపై మరోసారి ‘విక్రమ్’ ల్యాండింగ్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 మిషన్ ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. జాబిల్లి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండర్ ‘విక్రమ్’ను మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. మొదట దిగిన ప్రాంతంలో కాకుండా మరో చోట విక్రమ్ క్షేమంగా దిగినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘ఎక్స్’లో వెల్లడించింది. తాము ఇచి్చన ఆదేశాలకు విక్రమ్ చురుగ్గా స్పందించినట్లు తెలియజేసింది. ల్యాండర్ తొలిసారిగా ఆగస్టు 23న చందమామ ఉపరితలంపై విజయవంతంగా దిగిన సంగతి తెలిసిందే. చంద్రయాన్–3 మిషన్ లక్ష్యంలో భాగంగా ల్యాండర్‌ను తాజాగా మరోచోట దించారు. కమాండ్ ఇచి్చన తర్వాత ల్యాండర్‌లోని ఇంజిన్లు ఫైర్ అయ్యాయని, తర్వాత ల్యాండర్ 40 సెంటీమీటర్ల మేర పైకి లేచిందని, 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ఉపరితలంపై దిగిందని ఇస్రో స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మానవ సహిత ప్రయోగాలను నిర్వహించినపుడు వ్యోమగాములను క్షేమంగా తిరిగి భూమిపైకి తీసుకురావడానికి కిక్ స్టార్ట్ వంటిదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను ఇస్రో విడుదల చేసింది. నిద్రాణ స్థితిలోకి ‘విక్రమ్’ చందమామపై మరో రెండు మూడు రోజుల్లో లూనార్ నైట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ల్యాండర్ విక్రమ్‌ను నిద్రాణ స్థితి(స్లీప్ మోడ్)లోకి మార్చినట్లు ఇస్రో ప్రకటించింది. సోమవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలియజేసింది. ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచడంతో అందులోని పేలోడ్స్ డీయాక్టివ్ అయినట్లు వివరించింది. ల్యాండర్ రిసీవర్స్ మాత్రం చురుగ్గా పని చేస్తున్నట్లు తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై సౌరశక్తి తగ్గిపోయి, బ్యాటరీ అయిపోయిన తర్వాత ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ పూర్తిగా స్లీప్ మోడ్‌లో ఉంటాయని ఇస్రో స్పష్టం చేసింది. చంద్రుడిపై రాత్రి ముగిసిపోయి, తిరిగి పగలు మొదలయ్యాక 22న ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాయని ఇస్రో అంచనా వేస్తోంది. లూనార్ డే మొదలైన తర్వాత ల్యాండర్, రోవర్ మళ్లీ పనిచేస్తాయా అంటే చెప్పలేమని ఇస్రో సైంటిస్టులు అంటున్నారు. మళ్లీ పని చేస్తే చంద్రయాన్–3 ప్రయోగం కొనసాగుతుంది. లేనిపోతే కథ ముగిసినట్లే. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెనుప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే.. ఎయిర్‌పోర్ట్‌లో సేప్‌గా ల్యాండ్ చేశాడు పైలట్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. -
180 మంది ప్రయాణీకులతో సేఫ్ ల్యాండింగ్..
కోల్‌కతా : 180 మంది ప్రయాణీకులతో సిలిగురి నుంచి కోల్‌కతా బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్యలతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిలిగురిలోని బదోగ్రా ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు టేకాఫ్ తీసుకున్న విమానం ఇంజన్లో సమస్యలు తలెత్తడంతో కొద్దిసేపటికే వెనుదిరిగి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎయిర్‌బస్ ఏ 320 నియోలో తరచూ ఇంజన్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సమస్యతో ఇదే ఇంజన్‌ను వాడుతున్న పలు ఇండిగో విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం పరిపాటిగా మారింది. దీంతో వచ్చే ఏడాది జనవరి 31 నాటికి తన ఎయిర్‌బస్ ఏ 320 నియో విమానాల ఇంజన్లను సవరించాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఇండిగోను ఆదేశించింది. -
పక్షి ఢీ.. దెబ్బతిన్న విమాన ఇంజిన్
కోల్‌కతా: బెంగళూరు నుంచి బయలుదేరిన విమానానికి ప్రమాదం తప్పింది. కోల్‌కతాలోని ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా దానికి ఓ పక్షి తగిలింది. తొలుత కంగారుపడిన పైలెట్ అనంతరం సురక్షితంగా దించివేశాడు. దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు స్పందిస్తూ జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానం బెంగళూరు నుంచి వచ్చి కోల్‌కతాలో దిగుతుండగా పక్షి ఢీకొందని, దీంతో దాని కుడివైపు ఉన్న ఇంజిన్ దెబ్బతిందని, సురక్షితంగానే విమానం దిగిందని చెప్పారు. ప్రస్తుతం ఇంజిన్‌కు మరమ్మత్తులు నిర్వహిస్తున్నామని, తిరిగి వెళ్లేందుకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు వేరే విమానం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. -
గాల్లో విమానం.. స్టీరింగ్ స్టక్!
చెన్నై విమానాశ్రయంలో ఓ ఎయిరిండియా విమానానికి పెనుముప్పు త్రుటిలో తప్పింది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ 429 గాల్లో ఉండగానే దాని స్టీరింగ్ పనిచేయడం మానేసి, స్టక్ అయిపోయింది. ఆ సమయానికి విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. అయితే డ్రైవర్ అత్యంత జాగ్రత్తగా విమానాన్ని రన్‌వే మీద ల్యాండ్ చేశారు. దాంతో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. దాదాపు అరగంట తర్వాత వేరే వాహనం సాయంతో విమానాన్ని బోర్డింగ్ పాయింట్ వద్దకు తీసుకెళ్లారు.