విమాన ప్రయాణంలో పొరపాటున కిటికీ ఓపెన్ చేస్తేనే చాలా ప్రమాదం. అలాంటిది ఒక విమానం ముందు భాగం పై భాగంలో కొంత లేచి పోతే.. పరిస్థితి ఏంటి? మిరాకిల్ ఏంటంటే ఇది సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఒక్కరు తప్ప అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఏంటి నమ్మలేక పోతున్నారా? అసలు ఊహించడానికే కష్టంగా ఉందా? కానీ షాకింగ్ ఘటన నిజంగానే చోటు చేసుకుంది.
ఏప్రిల్ 28, 1988, విమానయాన చరిత్రలో అత్యంత దిగ్భ్రాంతికరమైన రోజు. బోయింగ్ 737-297 విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు, సిబ్బంది మాత్రమే, ఎవరు తలచుకున్నా వెన్నులో వణుకు పుట్టే ఘటన ఇది. అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243 89 మంది ప్రయాణికులు , ఆరుగురు సిబ్బందిని హవాయి బిగ్ ఐలాండ్‌లోని హిలో నుండి ఓహులోని హోనోలులు వరకు 300కిమీల హాప్‌లో తీసుకువెళుతోంది
ఇంతలో ఫ్యూజ్‌లేజ్‌లోని పైభాగం మధ్యలోసగం భాగం ఎగిరిపోయింది. ట్విన్-ఇంజన్, 110-సీట్ బోయింగ్ జెట్ 40 నిమిషాల ఫ్లైట్‌లో సగం దూరంలో ఉండగా, అకస్మాత్తుగా క్యాబిన్ కంట్రోల్ పోయింది. ఫ్యూజ్‌లేజ్‌లో కొంత భాగం విరిగిపోయింది. అంతే ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా 24వేల అడుగుల ఎత్తులో విపరీతమైన గాలులకు ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. భయంతో కేకలు వేశారు. ల్యాండ్ అయ్యే లోపే కూలిపోవడం ఖాయమని దాదాపు అందరూ వణికిపోయారు. భారీ సీలింగ్ ప్యానెల్లు ప్రయాణీకుల తలపై పడ్డాయి. అందరికీ దెబ్బలు, రక్త స్రావాలు. ఆక్సిజన్ మాస్క్‌లు పెట్టుకున్నా.. ఏం లాభం లేదు.. ఉరుములు, తుఫానులాంటి వాతావరణం.
కానీ ఆశ్చర్యకరంగా ఈ విపత్కర పరిస్థితి సంభవించిన పదమూడు నిమిషాల తర్వాత మౌయిలోని కహులుయ్ విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అంతగా డ్యామేజ్ అయిన విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడం చూసి గ్రౌండ్ ఎమర్జెన్సీ సిబ్బంది కూడా తమను తాము నమ్మలేకపోయారు.
Let’s take a moment to remember Aloha Airlines Flight 243.
— Mothra P.I. (@Hardywolf359) November 17, 2022
On April 28th 1988 the roof ripped off the Boeing 737 at 24,000 ft. The chief flight attendant (the only fatality) fell from the plane and debris struck the tail section. Amazingly the pilot still managed to land safely… pic.twitter.com/TAXzlW6KNo
ఇప్పటికీ దొరకని ఎయిర్‌హోస్టెస్ మృతదేహం
విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంఘటన నుండి బయటపడ్డారు. 95 మందిలో కేవలం ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమిటంటే ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఫ్లైట్ అటెండెంట్ క్లారాబెల్లె లాన్సింగ్ ప్రాణం మాత్రం గాల్లోనే కలిసిపోయాయి. ఆమె మృతదేహం ఇప్పటికీ లభ్యం కాలేదు.
''అకస్మాత్తుగా, పెద్ద శబ్దం, చప్పుడు వినిపించింది, కానీ పేలుడు కాదు, ఒత్తిడిలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది. పైకి చూసాను , విమానం యొక్క ఎడమ ఎగువ భాగం విచ్ఛిన్నం కావడం, విరగడం, ముక్కలు దూరంగా ఎగిరిపోవడం చూశాను. ఇది ఒక గజం వెడల్పు గల రంధ్రంతో ప్రారంభమై, అలా విరుగుతూనే ఉంది’’ అని విమానం వెనుక కూర్చున్న ఒక ప్రయాణీకుడు ఎరిక్ బెక్లిన్ ది వాషింగ్టన్ పోస్ట్‌తో తన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ది మిరాకిల్ ల్యాండింగ్ ఆఫ్ అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243గా సినిమాగా కూడా తెరకెక్కింది ఈ స్టోరీ.
నిజమైన హీరోలంటూ ప్రశంసలు
పర్స్సర్ క్లారాబెల్లె లాన్సింగ్‌తోపాటు, జేన్ సటో-టోమిటా , మిచెల్ హోండా విమానంలో క్యాబిన్ సిబ్బందిగా ఉన్నారు. కెప్టెన్ రాబర్ట్ స్కోర్న్‌స్టెయినర్‌కు కాక్‌పిట్‌లో ఫస్ట్ ఆఫీసర్. కోపైలట్ మాడెలైన్ టాంప్‌కిన్స్ ఉన్నారు. ఈ ఘటనలో వీళ్లు నిజమైన హీరోలంటూ పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు.
ఇదిఇలా ఉంటే యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) నివేదిక ప్రకారం, డికంప్రెషన్, స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వల్ల జరిగింది. విమానంలో ఎడమ ఇంజిన్ కూడా విఫలమైంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ప్రకారం బోర్డింగ్ సమయంలో విమానం ఫ్యూజ్‌లేజ్‌లో పగుళ్లను ఒకామె గమనించింది. అయితే ఆమె టేకాఫ్‌కి ముందు సిబ్బందికి చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment