పక్షి ఢీ.. దెబ్బతిన్న విమాన ఇంజిన్ | Flight suffers bird hit while landing in Kolkata | Sakshi
Sakshi News home page

పక్షి ఢీ.. దెబ్బతిన్న విమాన ఇంజిన్

Published Thu, Apr 6 2017 1:49 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

పక్షి ఢీ.. దెబ్బతిన్న విమాన ఇంజిన్

పక్షి ఢీ.. దెబ్బతిన్న విమాన ఇంజిన్

కోల్‌కతా: బెంగళూరు నుంచి బయలుదేరిన విమానానికి ప్రమాదం తప్పింది. కోల్‌కతాలోని ఎన్‌ఎస్‌సీ బోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా దానికి ఓ పక్షి తగిలింది. తొలుత కంగారుపడిన పైలెట్‌ అనంతరం సురక్షితంగా దించివేశాడు.

దీనిపై ఎయిర్‌పోర్ట్‌ అధికారులు స్పందిస్తూ జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం బెంగళూరు నుంచి వచ్చి కోల్‌కతాలో దిగుతుండగా పక్షి ఢీకొందని, దీంతో దాని కుడివైపు ఉన్న ఇంజిన్‌ దెబ్బతిందని, సురక్షితంగానే విమానం దిగిందని చెప్పారు. ప్రస్తుతం ఇంజిన్‌కు మరమ్మత్తులు నిర్వహిస్తున్నామని, తిరిగి వెళ్లేందుకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు వేరే విమానం ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement