Bird Hit
-
Shamshabad Airport: ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి?
సాక్షి, హైదరాబాద్: ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పక్షి ఢీకొన్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొనడంతో కొంత దెబ్బతిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. సదరు ఎయిర్‌లైన్స్ అధికారులు, విమానాశ్రయ వర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించలేదు. కాగా.. మరో ఘటనలో.. ఈ నెల 18న ఉదయం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఇండిగో విమానానికి వడగళ్ల వానతో ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో పైలెట్లకు ముందు ఉన్న అద్దంతో పాటు వెనకాల కొంత పలుచోట్ల విమానం దెబ్బతిన్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.. -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత..
పాట్నా: బెంగళూరు నుంచి బిహార్ మీదుగా వెళ్తున్న గోఎయిర్ విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్టులో పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లయిట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఒక ఇంజిన్ రెక్కలు విరిగిపోవడంతో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం అర్థాంతరంగా రద్దయింది. ఘటన జరిగినప్పుడు విమానంలో 142 మంది ప్రయాణికులు, ఆరుగరు సిబ్బంది ఉన్నారు. విమానం రద్దు అయినందున ప్యాసెంజర్లు ఢిల్లీకి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు గోఎయిర్ తెలిపింది. ప్రయాణాన్ని రద్ధు చేసుకున్న వారికి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. పాట్నా ఎయిర్ పోర్టులో పక్షులు విమానాలను ఢీకొట్టిన ఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి. విమానాశ్రయానికి అతి సమీపంలో మాంసం దుకాణాలు ఉండటంతో పెద్ద పెద్ద పక్షులు ఇక్కడ సంచరిస్తున్నాయి. మాంసం దుకాణాలను వేరే చోటకు తరలించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..' -
ఆకాశ ఎయిర్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి,ముంబై: ఇటీవల విమాన సర్వీసులను ప్రారంభించిన ఆకాశ ఎయిర్ తృటిలో భారీ ప్రమాదంనుంచి తప్పించు కుంది. ముంబై నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆకాసా ఎయిర్ ఫ్లైట్ QP 1103 క్యాబిన్లో దుర్వాసన రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. తమ విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందనీ ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అకాసా ఎయిర్ ప్రతినిధి తెలిపారు. ఆకాశ ఎయిర్ అక్టోబర్ 14 శుక్రవారం ముంబై-బెంగళూరు విమానంలో పక్షి ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. దుర్వాసన వస్తోందని ఫిర్యాదులు రావడంతో సిబ్బంది అప్రత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి, తనిఖీలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణీకులందరూ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దివంగత బిలియనీర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా అకాసా ఎయిర్‌లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 7న 60 రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే ఇటీవల మీడియాకు తెలిపారు. రెండు నెలలక్రితం తొలుత ముంబై నుంచి అహ్మదాబాద్‌కు, ఆ తరువాత చెన్నై, కొచ్చి, బెంగళూరుకు విమాన సేవలందిస్తోంది ఆకాశ ఎయిర్. -
పక్షి ఎంత పని చేసింది.. విమానాన్ని ఢీ కొట్టడంతో.. !
గాంధీనగర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న గో ఫస్ట్ విమానం జీ8911కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్ మళ్లించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. ఇటీవల విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించిన సంఘటనలు పెరిగినట్లు పేర్కొంది. దేశీయ విమానాల్లో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు పెద్దవేమి కావని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గత ఆదివారం పేర్కొన్నారు డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్. గడిచిన 16 రోజుల్లో అంతర్జాతీయ విమానాల్లో సైతం 15 సాంకేతిక లోపాలతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన సంఘటనలు ఎదురైనట్లు గుర్తు చేశారు. Go First flight G8911 operating on 4th August from Ahmedabad to Chandigarh diverted to Ahmedabad after bird hit: Directorate General of Civil Aviation (DGCA) pic.twitter.com/zVRG2evG8g — ANI (@ANI) August 4, 2022 ఇదీ చదవండి: ఒకే విమానంలో కో పైలెట్లుగా తల్లి కూతుళ్లు: వీడియో వైరల్ -
ప్రతి రోజు రావడం.. రేగు పళ్లు తినడం.. ఏడాదిగా ఇదే పని
కొన్ని భయంకరమైన జంతువులను దూరం నుంచి చూడటమో లేక టీవీల్లో చూడటమో చేస్తాం. కానీ వాటిని నేరుగా చూడాలని అనుకోము. కానీ ఇక్కడొక వ్యక్తి షాపుకి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి ఒకటి ప్రతిరోజు వస్తోందట. (చదవండి: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం) అసలు విషయంలోకెళ్లితే... ఆస్ట్రేలియాలో ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని జులటెన్ నివశిస్తున్న టోనీ ఫ్లెమింగ్ అనే వ్యక్తి వడ్రంగి షాపుకి ఒక ప్రమాదకరమైన కాసోవరి అనే పక్షి రోజు వస్తోందట. పైగా ఈ కాసోవరి పక్షి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి మాత్రమే కాదు చాలా శక్తిమంతంగా దాడిచేస్తాయి. అంతేకాదు ఈ కాసోవరి పక్షి 1.8 మీటర్ల పొడవు, 70 కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పైగా వాటి గోళ్లు 10 సెం.మీ వరకు పొడవు పెరుగతాయి. అందువల్లే అది చాలా భయంకరంగా దాడిచేస్తుంది. అయితే ఈ పక్షి ఒక ఏడాది నుంచి తన షాప్‌లోకి దర్జాగా వచ్చేయడమే కాక అక్కడ ఉన్న రేగు పళ్ళను తినేసి వెళ్లిపోతుందని చెబుతున్నాడు. చాలామంది తమ చుట్టపక్కల స్నేహితులు వచ్చి ఫోటోలు తీసుకుంటారని కూడా అంటున్నాడు. పైగా అది మా ఇంటి ఆవరణలో సైతం తిరుగుతున్నట్లు గమనించామని, పైగా స్థానికులు దానికి పెంపుడు జంతువు మాదిరిగా ఆహారం పెడుతున్నారని చెప్పాడు. అయితే టోనీ ఈ పక్షి "రోంపర్ స్టాంపర్" అని పేరు కూడా పెట్టాడు. కానీ ఇది స్థానికులందరితో కలిసి ఉండదని చెబుతున్నాడు. పైగా అక్కడ నగరంలో ప్రసిద్ధి గాంచిన పబ్‌లో కూడా తిరగడమే కాక అక్కడ రోడ్డుపై వెళ్లుతున్న ఒక వ్యక్తి పై దాడి కూడా చేసిందని అన్నాడు. అయితే అతను అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడినట్లు టోనీ చెప్పుకొచ్చాడు. (చదవండి: ఆ పిల్లాడి కంటే ఈ కుక్క పిల్లే భలే మాట్లాడేస్తోంది!!!) -
పక్షి దెబ్బకు 14కోట్లు నష్టం
మేరీల్యాండ్: ప్రచ్చన్న యుద్ధ కాలంలో అమెరికా నేతలకు రక్షణ కల్పించడంతోపాటు అణుదాడులకు ఉపయోగపడిన ఓ కీలకమైన విమానం పక్షి కారణంగా దెబ్బతినడంతో రూ.14 కోట్ల మేర నష్టం కలిగింది. మేరీల్యాండ్‌లోని పట్యుక్సెంట్ రివర్ నేవల్ ఎయిర్ స్టేషన్లో ఈ నెల 2న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ–6బీ మెర్క్యురీ రకం విమానం రన్‌వేపైకి వస్తున్న క్రమంలో ఓ పక్షి ఢీకొంది. విమానాన్ని వెంటనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, పక్షి కారణంగా విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతింది. దీంతో రూ.14 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనను వైమానిక దళం ‘ఏ క్లాస్’ ప్రమాదంగా పేర్కొంది. ఈ–6బీ మెర్క్యురీ విమానం ఖరీదు రూ.10వేల కోట్లపైమాటే. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి,పట్నా: ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. విమానానికి అకస్మాత్తుగా పక్షి అంతరాయం కల్పించడంతో అత్యవసరం లాండ్ చేయాల్సి వచ్చింది. పట్నా ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఈ సంఘటన చోటు చేసుసుకుంది. ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుని సురక్షితంగా విమానం కిందికి దిగడంతో ప్రయాణీకులు, సిబ్బంది భారీ ఊరట చెందారు. దాదాపు 124 మంది ప్రయాణికులతో పట్నా - ఢిల్లీ ఎయిరిండియా విమానం ఈ భారీ ప్రమాదంనుంచి తప్పించుకుంది. కాగా కేవలం ఒక చిన్న పక్షి ఢీ కొనడం వలన పెద్ద పెద్ద విమానాలు కూలిపోయిన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
సీఎం హెలికాప్టర్ ఎమర్జన్సీ ల్యాండింగ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రమాదం తప్పింది. సోమవారం సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కర్ణాటక సీఎం.. హోంమంత్రి పరమేశ్వర, మరో ముగ్గురితో కలసి శ్రావణబెళగలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హెలికాప్టర్లో బయల్దేరారు. కాగా హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో పైలట్ వెంటనే బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పక్షి ఢీకొనడం వల్ల హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్ది నిమిషాల తర్వాత సీఎం బృందం అదే హెలికాప్టర్లో శ్రావణబెళగలకు బయల్దేరి వెళ్లింది. -
పక్షి ఢీ.. దెబ్బతిన్న విమాన ఇంజిన్
కోల్‌కతా: బెంగళూరు నుంచి బయలుదేరిన విమానానికి ప్రమాదం తప్పింది. కోల్‌కతాలోని ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా దానికి ఓ పక్షి తగిలింది. తొలుత కంగారుపడిన పైలెట్ అనంతరం సురక్షితంగా దించివేశాడు. దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు స్పందిస్తూ జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానం బెంగళూరు నుంచి వచ్చి కోల్‌కతాలో దిగుతుండగా పక్షి ఢీకొందని, దీంతో దాని కుడివైపు ఉన్న ఇంజిన్ దెబ్బతిందని, సురక్షితంగానే విమానం దిగిందని చెప్పారు. ప్రస్తుతం ఇంజిన్‌కు మరమ్మత్తులు నిర్వహిస్తున్నామని, తిరిగి వెళ్లేందుకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు వేరే విమానం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. -
పిట్ట దెబ్బకు విమానం నిలిపివేత..
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ నుంచి నెవార్క్ మీదుగా లండన్ వెళ్లాల్సిన ఏయిర్ ఇండియా ఫ్లైట్‌కు పక్షి అడ్డురావడంతో విమానాన్ని నిలిపివేశారు. ఈ హఠాత్పరిణామం బుధవారం హిత్రో విమానాశ్రయ సమీపంలో చోటుచేసుకుంది. ఏయిర్ఇండియాకు చెందిన ఏ1-171 విమానం 230 మంది ప్రయాణికులు, 50 మంది సిబ్బందితో లండన్ వెళ్తుండగా పక్షి అడ్డురావడంతో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గమనించిన పైలెట్లు విమానాన్ని హిత్రో విమానాశ్రయంలో నిలిపివేశారు. పక్షి ముక్కుతో విమానంపై దాడి చేయడంతో రాడార్ ఆంటీనా దెబ్బతిన్నదని పైలెట్లు తెలిపారు. ప్రయాణీకులందరికి మరో విమానంలో వెళ్లెలా సదుపాయం కల్పించారు. ఈ విమానంలో రిటర్న్ రావల్సిన ప్రయాణీకులకు లండన్- ముంబై విమానం ఏర్పాటు చేశామని ఏయిర్ ఇండియా తెలిపింది. విమానంలో తల్లెత్తిన సమస్యను పరిష్కరించిన తర్వాత సర్వీస్‌ను పునరుద్దరిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. -
రంజాన్ రోజు పెద్ద ప్రమాదం తప్పింది
ఖాట్మాండు: నేపాల్ ఎయిర్ లైన్స్ విమానానికి గురువారం ప్రమాదం తప్పింది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 60 మంది ప్రయాణికులతో హాంగ్ కాంగ్ కు బయలు దేరిన విమానం కొద్దిసేపటికే అత్యవసరంగా కిందకు దిగింది. నేపాల్ ఎయిర్ కార్పొరేషన్(ఎన్ఏసీ)కు చెందిన ఎయిర్ బస్ ఏ320 గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాలకే పక్షి ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కు తీసుకొచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా కిందకు దించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులెవరూ గాయపడలేదని, వారిని మరో విమానంలో పంపించినట్టు చెప్పారు. విమానం ఢీకొనడంతో విమానం ఇంజిన్ బాగా దెబ్బతిందని వెల్లడించారు. ఈ సంఘటనతో పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. రంజాన్ పర్వదినం రోజున పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
కువైట్‌లో అత్యవసరంగా దిగిన విమానం
దుబాయి : కువైట్ నుంచి ముంబై బయలుదేరిన కువైట్ ఎయిర్వేస్కి చెందిన విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో సదరు విమానాన్ని అత్యవసరంగా కువైట్ ఎయిర్ పోర్ట్‌లో దింపివేసినట్లు ఆ విమాన సంస్థ ఆదివారం వెల్లడించింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానానికి చేర్చినట్లు తెలిపింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి విమానం కాక్ పిట్‌ను ఢీ కొట్టిందని పేర్కొంది. ఈ మేరకు కువైట్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది. -
పక్షి ఢీకొని.. ఆగిపోయిన విమానం
సింగపూర్‌కు చెందిన టైగర్ ఎయిర్ వేస్ విమానం ఒకటి పక్షి ఢీకొనడంతో ఆగిపోయింది. 167 మంది ప్రయాణికులతో తిరుచిరాపల్లి నుంచి బయల్దేరాల్సిన ఈ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో పక్షీ ఢీకొనడంతో దాని ఇంజన్ దెబ్బతింది. దాంతో విమానం టేకాఫ్ తీసుకోకుండానే ఆగిపోయింది. ఇంజన్లో ఏదో సమస్య తలెత్తిందని గుర్తించిన పైలట్.. దాన్ని ఎగరనివ్వకుండా ఆపేశారు. మొత్తం ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసి వారిని ఓ హోటల్లో ఉంచారు. తర్వాత చెన్నై నుంచి ఇంజనీర్లు విడిభాగాలతో వచ్చి, సమస్యను సరిచేసిన తర్వాత అప్పుడు విమానాన్ని బయల్దేరదీశారు.