సాక్షి,ముంబై: ఇటీవల విమాన సర్వీసులను ప్రారంభించిన ఆకాశ ఎయిర్ తృటిలో భారీ ప్రమాదంనుంచి తప్పించు కుంది. ముంబై నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆకాసా ఎయిర్ ఫ్లైట్ QP 1103 క్యాబిన్‌లో దుర్వాసన రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. తమ విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందనీ ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అకాసా ఎయిర్ ప్రతినిధి తెలిపారు.
ఆకాశ ఎయిర్ అక్టోబర్ 14 శుక్రవారం ముంబై-బెంగళూరు విమానంలో పక్షి ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. దుర్వాసన వస్తోందని ఫిర్యాదులు రావడంతో సిబ్బంది అప్రత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి, తనిఖీలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణీకులందరూ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దివంగత బిలియనీర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా అకాసా ఎయిర్‌లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 7న 60 రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే ఇటీవల మీడియాకు తెలిపారు. రెండు నెలలక్రితం తొలుత ముంబై నుంచి అహ్మదాబాద్‌కు, ఆ తరువాత చెన్నై, కొచ్చి, బెంగళూరుకు విమాన సేవలందిస్తోంది ఆకాశ ఎయిర్.
Comments
Please login to add a commentAdd a comment