ముంబై: ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటినగరాల్లో జీవన వ్యయం చాలా ఖరీదు అనే సంగతి తెలిసిందే. ఈ నగరాల్లో సామాన్య ప్రజలు జీవించాలంటే అంత సులువు కాదు. అయితే తాజాగా ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఓ సంస్థ సీఈఓ.. ఈ నగరాల్లో కూడా ఖర్చుల పరంగా వ్యత్యాసం ఉందని నిరూపిస్తూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెంగళూరులో ఇంత దారుణమా
సాధారణంగా ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా ఈ కేటగిరిలో ఆటో డ్రైవర్ల గురించే చెప్పుకొవాలి. దూరం, ఆటోలోని మీటర్‌ను బట్టి కాకుండా ప్రాంతాన్ని బట్టి వారు ధరలను నిర్ణయిస్తుంటారు. తాజాగా ఇటువంటి ఘటనే ఓ సీఈఓకి ఎదురైంది. బెంగళూరులో కేవలం 500 మీటర్ల ప్రయాణించగా.. అతని నుంచి ఆటో డ్రైవర్ రూ.100 వసూలు చేసినట్లు తెలిపాడు. అదే తాను ముంబైలో 500 మీటర్లకు కేవలం రూ.9 ఆటో ఫేర్ చెల్లించేవాడని చెప్పుకొచ్చాడు. బెంగళూరులో మరీ ఇంత దారుణమా అంటూ వాపోయాడు.
తనకు ఎదురైన చేదు అనుభవాన్ని న్యూరల్ గ్యారేజ్ కో ఫౌండర్ కం సీఈఓ మందార్ నటేకర్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆటోలో ఏర్పాటు చేసిన మీటర్ ఫొటో కూడా పోస్ట్ చేశారు. ‘ఇది చాలా గొప్ప ఆటో మీటర్. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది, అందుకే ఏమో ఆటో డ్రైవర్లు ఎప్పుడూ వాటిని వినియోగించరు. కానీ నేను 500 మీటర్ల ప్రయాణానికి రూ.100 చెల్లించా.. అదే ముంబైలో ఇదే దూరానికి రూ.9 చెల్లిస్తే సరిపోతుంది` అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. బెంగళూరు మాత్రమే కాదు ముంబై నగర శివారుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ఇంకా ఇబ్బందిగా ఉంటుందని ఒకరు కామెంట్ చేశారు. ఈ దోపిడీ చట్టబద్ధం కాదనిపిస్తోందని కామెంట్ చేయగా, మరొక యూజర్ ..చాలా తక్కువ నగరాల్లో ఆటో-మీటర్ ఛార్జీల వ్యవస్థ ఉంది. కానీ నగరాల్లో ఇలాంటివి ఆశించకూడదని కామెంట్ పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment