Auto fare
-
సీఈఓకు చేదు అనుభవం.. ఆటోలో ప్రయాణం, బెంగళూరులో ఇంత దారుణమా!
ముంబై: ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటినగరాల్లో జీవన వ్యయం చాలా ఖరీదు అనే సంగతి తెలిసిందే. ఈ నగరాల్లో సామాన్య ప్రజలు జీవించాలంటే అంత సులువు కాదు. అయితే తాజాగా ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఓ సంస్థ సీఈఓ.. ఈ నగరాల్లో కూడా ఖర్చుల పరంగా వ్యత్యాసం ఉందని నిరూపిస్తూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులో ఇంత దారుణమా సాధారణంగా ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా ఈ కేటగిరిలో ఆటో డ్రైవర్ల గురించే చెప్పుకొవాలి. దూరం, ఆటోలోని మీటర్‌ను బట్టి కాకుండా ప్రాంతాన్ని బట్టి వారు ధరలను నిర్ణయిస్తుంటారు. తాజాగా ఇటువంటి ఘటనే ఓ సీఈఓకి ఎదురైంది. బెంగళూరులో కేవలం 500 మీటర్ల ప్రయాణించగా.. అతని నుంచి ఆటో డ్రైవర్ రూ.100 వసూలు చేసినట్లు తెలిపాడు. అదే తాను ముంబైలో 500 మీటర్లకు కేవలం రూ.9 ఆటో ఫేర్ చెల్లించేవాడని చెప్పుకొచ్చాడు. బెంగళూరులో మరీ ఇంత దారుణమా అంటూ వాపోయాడు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని న్యూరల్ గ్యారేజ్ కో ఫౌండర్ కం సీఈఓ మందార్ నటేకర్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆటోలో ఏర్పాటు చేసిన మీటర్ ఫొటో కూడా పోస్ట్ చేశారు. ‘ఇది చాలా గొప్ప ఆటో మీటర్. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది, అందుకే ఏమో ఆటో డ్రైవర్లు ఎప్పుడూ వాటిని వినియోగించరు. కానీ నేను 500 మీటర్ల ప్రయాణానికి రూ.100 చెల్లించా.. అదే ముంబైలో ఇదే దూరానికి రూ.9 చెల్లిస్తే సరిపోతుంది` అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. బెంగళూరు మాత్రమే కాదు ముంబై నగర శివారుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ఇంకా ఇబ్బందిగా ఉంటుందని ఒకరు కామెంట్ చేశారు. ఈ దోపిడీ చట్టబద్ధం కాదనిపిస్తోందని కామెంట్ చేయగా, మరొక యూజర్ ..చాలా తక్కువ నగరాల్లో ఆటో-మీటర్ ఛార్జీల వ్యవస్థ ఉంది. కానీ నగరాల్లో ఇలాంటివి ఆశించకూడదని కామెంట్ పెట్టాడు. చదవండి ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు! -
Hyderabad: క్యాబ్‌లు, ఆటోల్లో అడ్డగోలు వసూళ్లు.. ప్రేక్షకపాత్రలో రవాణాశాఖ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జూబ్లీబస్‌స్టేషన్‌కు మధ్య దూరం కేవలం రెండున్నర కిలోమీటర్లు. ఆర్టీసీ చార్జీ రూ.10 ఉంటుంది. కానీ కాస్త లగేజీతో ఉన్న ప్రయాణికుడు ఏదో ఒక ఆటో బుక్ చేసుకోవాలనుకొని ఆశిస్తే కనీసం రూ.100 సమర్పించుకోవలసిందే. రాత్రి ఎనిమిది దాటినా, తెల్లవారు జామున ఐదైనా ఈ చార్జీ కాస్తా రూ.150 కూడా దాటొచ్చు. ► ఉప్పల్ బస్టాండ్ నుంచి మెట్రో స్టేషన్ వరకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోలో వెళ్లాంటే రూ.80 పైనే వసూలు చేస్తారు. ► ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పజగుట్ట, తదితర మెట్రో స్టేషన్ల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడికెళ్లినా సరే రూ.100 పైన సమర్పించుకోవలసిందే. ► ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో, మెట్రో రైళ్లలో చెల్లించే చార్జీలకు ఇది రెట్టింపు. బర్కత్‌పురా నుంచి సికింద్రాబాద్ వరకు నేరుగా ఆటోలో వెళితే రూ.350 నుంచి రూ.400 వరకు చెల్లించాల్సిందే. మీటర్లు లేని ఆటోల్లో మాత్రమే కాదు. ఓలా, ఉబెర్, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలకు అనుసంధానంగా ఉన్న ఆటో రిక్షాల్లోనూ చార్జీల మోత మోగుతోంది. ఎలాంటి నియంత్రణ లేకుండా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అగ్రిగేటర్ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆటో రిక్షాలపైన రవాణాశాఖ నియంత్రణ కొరవడింది. దీంతో అన్ని రకాల ఆటోలు ప్రయాణికులపై నిలువుదోపిడీ కొనసాగిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితు ల్లో ఆటోలో వెళ్లే వారి జేబులను లూఠీ చేస్తున్నారు. క్యాబ్ ఆటోల్లోనూ అంతే... మీటర్లు లేని ఆటోల్లో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగితే అగ్రిగేటర్ సంస్థలకు చెందిన ఆటోలు బుకింగ్ సమయంలోనే హడలెత్తిస్తున్నాయి. కొద్దిపాటి దూరానికే రూ.వందల్లో చార్జీలు విధిస్తున్నాయి. ఈ సంస్థల చార్జీలకు ఎలాంటి ప్రామాణికత లేకపోవడం గమనార్హం. సాధారణంగా ఆటోలు, క్యాబ్‌లలో మోటారు వాహన చట్టం ప్రకారం మీటర్ రీడింగ్ ద్వారా చార్జీలను నిర్ధారించవలసిన రవాణాశాఖ చాలా ఏళ్ల క్రితమే చేతులెత్తేసింది. కర్ణాటక తరహా ఆంక్షలేవీ... అగ్రిగేటర్ సంస్థల ఆటోలపైన తాజాగా కర్ణాటక రవాణాశాఖ ఆంక్షలు విధించింది. రెండు కిలోమీటర్ల దూరానికే రూ.వందకు పైగా వసూలు చేస్తున్న ఓలా,ఉబెర్, రాపిడో ఆటోలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే తరహాలో హైదరాబాద్‌లోనూ ఆంక్షలు విధించి అడ్డగోలు చార్జీలను అరికట్టాలని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రధాన కార్యదర్శి బీటీ శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. ఏళ్లు గడిచినా పత్తాలేని మీటర్లు గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటోరిక్షాలకు 2012లో మీటర్లను బిగించారు. మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.20 , ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున రవాణాశాఖ చార్జీలను నిర్ణయించింది. ఆటోడ్రైవర్లు కచ్చితంగా ఈ నిబంధన పాటించాలి. నిబంధనలకు విరుద్ధంగా చార్జీలు వసూలు చేసే ఆటోలపైన ఆర్టీఏ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంది. కానీ మీటర్లు బిగించిన మొదటి ఏడాది కాలంలోనే డ్రైవర్లు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. మీటర్లకు సీళ్లు వేయడంలో తూనికలు కొలతల శాఖ విఫలమైంది. మీటర్ రీడింగ్ లేకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే ఆటోరిక్షాలపైన ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆటోడ్రైవర్లు మీటర్ రీడింగ్‌ను పూర్తిగా గాలికి వదిలేసి అడ్డగోలు వసూళ్లకు దిగారు.మీటర్ రీడింగ్‌పైన చార్జీలు చెల్లించాలనుకొంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే నగరంలో ఏ ఒక్క ఆటోకు కూడా ఇప్పుడు మీటర్లు పని చేయడం లేదు. ‘మీటర్ వేయాలని అడిగితే దౌర్జన్యానికి దిగినంత పని చేస్తారు. వాళ్లు అడిగినంత ఇచ్చి రావడమే మంచిది.’ అని సీతాఫల్‌మండికి చెందిన కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. (క్లిక్: వనపర్తి–మంత్రాలయం మధ్య నేషనల్ హైవే!) -
ఆటో కంటే అంతరిక్ష యానమే చవక!
మన దేశంలో ఎక్కడినుంచి ఎక్కడకు వెళ్లాలన్నా ఆటో ఎక్కితే కనీసం కిలోమీటరుకు పది రూపాయలు తీసుకుంటారు. కానీ.. అంతరిక్షంలో ఎక్కడో ఉన్న అంగారకుడి మీదకు మన 'మామ్'ను పంపడానికి అయ్యిన ఖర్చు ఎంతో తెలుసా.. కిలోమీటరకు కేవలం ఏడు రూపాయలే! ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. అహ్మదాబాద్‌లో ఆటోవాలాలు కిలోమీటరకు 10 తీసుకుంటారని, కానీ మార్స్ మిషన్‌కు కిలోమీటరుకు 7 రూపాయలే ఖర్చయిందని ఆయన ఎన్నారైలతో జరిగిన భేటీలో తెలిపారు. మానవరహిత స్పేస్‌క్రాఫ్ట్ అంగారకుడి మీదకు వెళ్లడానికి 65 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. ప్రపంచంలో ఏ దేశమూ ఇంత తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయలేదని, మన సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రవేత్తల కృషి పుణ్యమాని ప్రపంచంలోనే మనం తలెత్తుకుని నిలబడగలుగుతున్నామని ఆయన అన్నారు. మంగళ్యాన్లో ప్రతి ఒక్కటీ స్వదేశీ పరికరమేనని, హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయిందని మోదీ చెప్పారు. గ్రావిటీ సినిమాను 100 మిలియన్ డాలర్లతో తీస్తే.. మన ప్రాజెక్టుకు 74 మిలియన్ డాలర్లే ఖర్చయిందన్నారు. -
ఆటో వార్డెన్!
సాక్షి, చెన్నై: ఆటోలకు మీటర్లు తప్పని సరి చేయడం లక్ష్యంగా సరికొత్త పథకానికి నగర ట్రాఫిక్ యంత్రాంగం నిర్ణయించింది. ఆటో, క్రైం, ట్రాఫిక్ భాగస్వామ్యంతో ‘ఆటో వార్డెన్’ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. మీటర్లు వేయకున్నా, చార్జీల దోపిడీకి పాల్పడే ఆటోవాలాల భరతం పట్టడం లక్ష్యం గా ఈ బృందాలు రోడ్డెక్కనున్నారుు. ప్రధాన నగరాల్లో సాగుతున్న ఆటో చార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం ఆటోల్లో మీటర్లు తప్పనిసరి చేసింది. కనీస చార్జీగా రూ.25, ఆ తర్వాత కిలో మీటరుకు రూ.12 వసూలు చేయాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. అలాగే, రాత్రుల్లో 50శాతం అదనపు చార్జీ వసూలు చేసుకునే వీలు కల్పించారు. గత ఏడాది ఆగస్టు 25న రాష్ట్ర రాజధాని నగరంలో ఆటో చార్జీలు అమల్లోకి వచ్చాయి. అయితే, మెజారిటీ శాతం ఆటోవాలాలు మాత్రం కుంటి సాకులతో మీటర్లు వేయడం మానేశారు. పలు చోట్ల ప్రయాణికుల నుంచి చార్జీల దోపిడీకి దిగుతూనే ఉన్నారు. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆటో వాలాల భరతం పట్టే విధంగా ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు రోడ్డెక్కి జరిమానాల మోత మోగించారు. వందలాది ఆటోలను సీజ్ చేశారు. అయినా, వారిలో మార్పు రాలేదు. అదే సమయంలో అధికారుల తీరును నిరసిస్తూ రివర్స్ గేర్ బాటపట్టారు. తాము మీటర్లు వేస్తున్నా, అధికారులు పనిగట్టుకుని కేసులు వేస్తున్నారంటూ వాదించారు. తరచూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గట్టుగా చార్జీల్లో మార్పులు చేయాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెచ్చారు. వీటన్నింటిపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో ఆటోలకు మీటర్లు వేయించడంలో ట్రాఫిక్, ఆర్టీఏ యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు ఎక్కడ కోర్టుకు చేరుతాయో, ఎక్కడ చీవాట్లు పడుతాయోనన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. దీంతో సరికొత్తగా ఆటో వాలాల వద్దకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఆటో వార్డెన్ అంటే..: ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా ఆటో వాలాల భరతం ఆటోవాలాల చేతే పట్టించేందుకు సిద్ధమయ్యారు. తాము పని గట్టుకుని కేసులు వేస్తున్నట్టుగా వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టే విధంగా కొత్త పథకాన్ని ట్రాఫిక్ యంత్రాంగం రచించింది. మహానగరంలో అదనపు కమిషనర్ పరిధిలో పన్నెండు డివిజన్లుగా ట్రాఫిక్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఉండే నిజాయితీ పరులైన, ఎలాంటి వ్యవసనాలు లేని ఆటో వాలాలను ఈ పథకానికి ఎంపిక చేయడానికి నిర్ణయించారు. దీనికి ఆటో వార్డెన్ అని నామకరణం చేశారు. ఒక్కో డివిజన్ పరిధిలో పది మంది చొప్పున నిజాయితీ పరులైన ఆటో డ్రైవర్లను ఎంపిక చేస్తారు. పన్నెండు డివిజన్లకు 120 మందిని ఎంపిక చేస్తారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పది మంది చొప్పున పన్నెండు ఆటో డ్రైవర్ల బృందాలను, ఒక్కో బృందానికి ఒక ట్రాఫిక్ పోలీసు, మరో క్రైం పోలీసులతో కలిపి పన్నెండు మందితో ఒక ఆటో వార్డెన్ బృందం ఏర్పాటు కాబోతున్నది. ఈ బృందం రోజు వారీగా ఉదయం నుంచి రాత్రి వరకు తమ తమ డివిజన్లలో పర్యటిస్తూ, ఆటోల్ని తనిఖీలు చే యనుంది. ఆటో డ్రైవర్లు ఎవరైనా మీటర్లు వేయకున్నా, అధిక చార్జీలు వసూలు చేసినా, ఈ బృందం ఎలాంటి కేసులు నమోదు చేయదు. సంబంధిత ఆటో డ్రైవర్‌ను తీసుకెళ్లి, అతడిలో మార్పు వచ్చే వరకు ప్రత్యేక క్లాస్ తీసుకోనున్నారు. మళ్లీ...మళ్లీ పట్టుబడిన పక్షంలో ఆటోల సీజ్, భారీ జరిమానా మోత మోగించేందుకు ట్రాఫిక్ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరి కొద్ది రోజుల్లో ఈ ఆటో వార్డెన్లు రోడ్డెక్కనున్నారు.