
సాక్షి, హైదరాబాద్: ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పక్షి ఢీకొన్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొనడంతో కొంత దెబ్బతిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. సదరు ఎయిర్‌లైన్స్ అధికారులు, విమానాశ్రయ వర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించలేదు.
కాగా.. మరో ఘటనలో.. ఈ నెల 18న ఉదయం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఇండిగో విమానానికి వడగళ్ల వానతో ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో పైలెట్లకు ముందు ఉన్న అద్దంతో పాటు వెనకాల కొంత పలుచోట్ల విమానం దెబ్బతిన్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి..