సింగపూర్కు చెందిన టైగర్ ఎయిర్ వేస్ విమానం ఒకటి పక్షి ఢీకొనడంతో ఆగిపోయింది.
సింగపూర్కు చెందిన టైగర్ ఎయిర్ వేస్ విమానం ఒకటి పక్షి ఢీకొనడంతో ఆగిపోయింది. 167 మంది ప్రయాణికులతో తిరుచిరాపల్లి నుంచి బయల్దేరాల్సిన ఈ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో పక్షీ ఢీకొనడంతో దాని ఇంజన్ దెబ్బతింది. దాంతో విమానం టేకాఫ్ తీసుకోకుండానే ఆగిపోయింది.
ఇంజన్లో ఏదో సమస్య తలెత్తిందని గుర్తించిన పైలట్.. దాన్ని ఎగరనివ్వకుండా ఆపేశారు. మొత్తం ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసి వారిని ఓ హోటల్లో ఉంచారు. తర్వాత చెన్నై నుంచి ఇంజనీర్లు విడిభాగాలతో వచ్చి, సమస్యను సరిచేసిన తర్వాత అప్పుడు విమానాన్ని బయల్దేరదీశారు.