Tiger Airways
-
గోల్డ్ స్మగ్లర్ ‘డబుల్ ధమాకా’
⇒ ఒకే సమయంలో రెండు రకాలుగా అక్రమ రవాణా ⇒ చెన్నై వాసిని పట్టుకున్న ఎయిర్పోర్ట్ కస్టమ్స్ టీమ్ సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. గతానికి భిన్నంగా అక్రమ రవాణా అవుతున్న పసిడిని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. చెన్నైకి చెందిన ఈ స్మగ్లర్ ‘రెండు రకాలు’గా బంగారం తీసుకువస్తూ చిక్కాడు. కస్టమ్స్ అధికారులు ఇతడి నుంచి రూ.59.10 లక్షల విలువైన రెండు కేజీల పసిడి స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఈడీ లైట్లలో అమర్చి... స్మగ్లర్లను కనిపెట్టడానికి కస్టమ్స్ అధికారులు కొన్ని దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ప్రొఫైలింగ్ చేపడుతుంటారు. ఆ వ్యక్తి ఎంత కాలంలో, ఎన్నిసార్లు, ఏఏ దేశాల నుంచి వచ్చి వెళ్లాడనేది అధ్యయనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం టైగర్ ఎయిర్వేస్ ఫ్లైట్‌లో సింగపూర్ నుంచి వచ్చిన ఓ తమిళనాడు వాసిపై అనుమానం వచ్చింది. చెన్నైకు చెందిన ఇతగాడు గడిచిన కొన్ని నెలల్లో పదేపదే సింగపూర్ వెళ్లి వచ్చిన విషయాన్ని పాస్‌పోర్ట్ ఆధారంగా గుర్తించారు. చెన్నైలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పటికీ ఒక్కోసారి ఒక్కో విమానాశ్రయం లో దిగుతుండటంతో అనుమానించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అదుపు లోకి తీసుకుంది. ఇతడు లగేజీలో 2 ఎల్ఈడీ లైట్లను తీసుకువచ్చాడు. తక్కువ ఖరీదైన ఈ తరహా లైట్లను విదేశాల నుంచి తీసుకురా వడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోవడం తో వీటిని ఎంచుకున్నాడు. 800 గ్రాముల బంగారాన్ని 8 బిస్కెట్లుగా మార్చి ఆ లైట్ల వెనుక ఉండే భాగంగా అమర్చాడు. ఈ రెం డింటినీ ఎక్స్‌రే స్కానింగ్ ద్వారా పరిశీలించిన ఏఐయూ అధికారులు రొటీన్‌కు భిన్నమైన షేడ్స్ గుర్తించారు. దీంతో వాటిని విప్పి చూడగా బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అతడిని పూర్తిగా సోదా చేశారు. దీంతో ‘రెక్టమ్ కన్సీల్మెంట్’ను గుర్తించారు. 2 కేజీల బంగారం స్వాధీనం సుదీర్ఘకాలం స్మగ్లర్లు, క్యారియర్లుగా పని చేసేవారు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సల ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేసుకుంటున్నా రు. ఇందులో గరిష్టంగా 2 కేజీల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉం టుంది. ఆదివారం చిక్కిన చెన్నై వాసి 1,200 గ్రాముల 12 బంగారం బిస్కెట్లను రెక్టమ్ కన్సీల్మెంట్ ద్వారా తీసుకువచ్చా డు. ఇతడి నుంచి 2 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల న్నరలో రెక్టమ్ కన్సీల్మెంట్కు చిక్కడం ఇది రెండోసారని అధికారులు చెబుతున్నారు. -
ఇతర నగరాలకూ టైగర్ ఎయిర్
అంతర్జాతీయ చౌక విమానయానంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సింగపూర్ సంస్థ టైగర్ ఎయిర్... తన వ్యూహం మార్చుకుంటోంది. ఇప్పటిదాకా టైగర్ ఎయిర్ అంటే... భారత్ నుంచి సింగపూర్‌కు వెళ్లేవారి కోసం మాత్రమే పరిమితమనే భావన ఉండేది. దాన్ని తొలగించుకుని ఇతర అంతర్జాతీయ నగరాలకు కూడా హైదరాబాద్ సహా భారతదేశంలోని ఇతర నగరాలను కనెక్ట్ చేస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేసియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, వియెత్నాం వంటి అనేక దేశాలకు అత్యంత చౌకగా తమ విమానాల్లో ప్రయాణించవచ్చునని, ఇందుకోసం ప్రత్యేకంగా ‘టైగర్ కనెక్ట్’ను ప్రవేశపెట్టామని సంస్థ కమర్షియల్ డెరైక్టర్ రాబర్ట్ యాంగ్ తెలియజేశారు. ‘టైగర్ కనెక్ట్ ఒక వినూత్న ఆలోచన. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా భారతీయ నగరాల నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారికిది బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఆస్ట్రేలియాలోని పెర్త్, సిడ్నీ, మెల్బోర్న్ తదితర నగరాలకు వెళ్లాలనుకునేవారు ముందుగా సింగపూర్ రావచ్చు. ఇక్కడ వీసా లేకుండానే(వీసా ఫ్రీ ట్రాన్సిట్ ఫెసిలిటీ-వీఎఫ్టీఎఫ్) నాలుగు రోజులు సిటీ మొత్తం చూడొచ్చు. సింగపూర్ నుంచి పెర్త్‌కు బయలుదేరొచ్చు. అదీ అందుబాటు ధరలోనే’ అని వివరించారు. మారుతున్న టైగర్ ఎయిర్వేస్ను పరిచయం చేయడానికి భారత్ నుంచి పాత్రికేయుల్ని ప్రత్యేకంగా సింగపూర్‌కు ఆహ్వానించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. తమ విమానాల్లో భద్రత, సమయపాలనకు పెద్దపీట వేస్తామన్నారు. రూ.10కే సింగపూర్ టికెట్ ఒకవైపు సింగపూర్‌కు రూ.10 బేస్ ధరకే టికెట్ అందిస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన పథకానికి అనూహ్యమైన స్పందన రావటంతో మళ్లీ ఈ పథకాన్ని అక్టోబర్ 6 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు యాంగ్ చెప్పారు. ఈ పథకం కింద ఇంచుమించు రూ.7,500కే సింగపూర్‌కు రిటర్న్ టికెట్ లభిస్తుందని, మామూలుగా టైగర్ ఎయిర్ రిటర్న్ టికెట్ రూ.12000 లోపే ఉంటుందని చెప్పారు. 6వ తేదీ నుంచి బుకింగ్‌లు ఆరంభమవుతాయని, ఆ తర్వాత 6 నెలల్లో ఈ టికెట్లను వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. స్కూట్ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం... ‘ప్రస్తుతం 14 దేశాల్లోని 50 నగరాలకు టైగర్ ఎయిర్ విమానాలు నడుస్తున్నాయి. అయితే మరింతమందికి చౌక ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు, టైగర్ సేవల్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు స్కూట్ ఎయిర్‌లైన్స్‌తో అవగాహన కుదుర్చుకున్నాం. దీనిప్రకారం టైగర్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించాలనుకునేవారికి స్కూట్ ఎయిర్ ప్రయాణించే నగరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఆయా నగరాలకు టైగర్ ద్వారా అందుబాటు ధరలకే టిక్కెట్లు బుక్ చేసుకుని స్కూట్ ఎయిర్‌లో కూడా ప్రయాణించొచ్చు’’ అని ఆయన వివరించారు. -
పక్షి ఢీకొని.. ఆగిపోయిన విమానం
సింగపూర్‌కు చెందిన టైగర్ ఎయిర్ వేస్ విమానం ఒకటి పక్షి ఢీకొనడంతో ఆగిపోయింది. 167 మంది ప్రయాణికులతో తిరుచిరాపల్లి నుంచి బయల్దేరాల్సిన ఈ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో పక్షీ ఢీకొనడంతో దాని ఇంజన్ దెబ్బతింది. దాంతో విమానం టేకాఫ్ తీసుకోకుండానే ఆగిపోయింది. ఇంజన్లో ఏదో సమస్య తలెత్తిందని గుర్తించిన పైలట్.. దాన్ని ఎగరనివ్వకుండా ఆపేశారు. మొత్తం ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసి వారిని ఓ హోటల్లో ఉంచారు. తర్వాత చెన్నై నుంచి ఇంజనీర్లు విడిభాగాలతో వచ్చి, సమస్యను సరిచేసిన తర్వాత అప్పుడు విమానాన్ని బయల్దేరదీశారు.