పిట్ట దెబ్బకు విమానం నిలిపివేత.. | AI flight suffers bird hit | Sakshi
Sakshi News home page

పిట్ట దెబ్బకు విమానం నిలిపివేత..

Published Thu, Mar 23 2017 12:31 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

పిట్ట దెబ్బకు విమానం నిలిపివేత..

పిట్ట దెబ్బకు విమానం నిలిపివేత..

న్యూఢిల్లీ:  అహ్మదాబాద్‌ నుంచి నెవార్క్‌ మీదుగా లండన్‌ వెళ్లాల్సిన ఏయిర్‌ ఇండియా ఫ్లైట్‌కు పక్షి అడ్డురావడంతో  విమానాన్ని నిలిపివేశారు.  ఈ హఠాత్పరిణామం బుధవారం హిత్రో విమానాశ్రయ సమీపంలో చోటుచేసుకుంది. ఏయిర్‌ఇండియాకు చెందిన ఏ1-171 విమానం 230 మంది ప్రయాణికులు, 50 మంది సిబ్బందితో లండన్‌ వెళ్తుండగా పక్షి​ అడ్డురావడంతో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గమనించిన పైలెట్లు విమానాన్ని హిత్రో విమానాశ్రయంలో నిలిపివేశారు.
 
పక్షి ముక్కుతో విమానంపై దాడి చేయడంతో రాడార్‌ ఆంటీనా దెబ్బతిన్నదని పైలెట్లు తెలిపారు. ప్రయాణీకులందరికి మరో విమానంలో వెళ్లెలా సదుపాయం కల్పించారు. ఈ విమానంలో రిటర్న్‌ రావల్సిన ప్రయాణీకులకు లండన్‌- ముంబై విమానం ఏర్పాటు చేశామని ఏయిర్‌ ఇండియా తెలిపింది. విమానంలో తల్లెత్తిన సమస్యను పరిష్కరించిన తర్వాత సర్వీస్‌ను పునరుద్దరిస్తామని  ఆ సంస్థ ప్రకటించింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement